Home » Secunderabad
సికింద్రాబాద్ పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే పద్మారావు గౌడ్‌ని నిర్ణయిస్తూ ఆ పార్టీ అధినేత కేసీఆర్ శనివారం ప్రకటించారు. ఈ మేరకు పార్టీ శాసన సభ్యులు ప్రజాప్రతినిధులు ఇతర ముఖ్యనేతలతో జరిగిన సమావేశంలో చర్చించి అందరి అభిప్రాయం సేకరించిన తరువాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇన్నాళ్లు రిజర్వ్ రైలు టికెట్లను మాత్రమే ఫోన్లో బుక్ చేసే సదుపాయం ఉండేది. అయితే రైల్వే శాఖ తాజా నిర్ణయంతో అన్ రిజర్వ్ సీట్లకు కూడా ఆన్లైన్ టికెట్లు బుక్ చేసుకోవచ్చు. సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోని 14 స్టేషన్లలో విస్తరించి ఉన్న 31 కౌంటర్లలో పైలట్ ప్రాజెక్టుగా క్యూఆర్ కోడ్ చెల్లింపు వ్యవస్థను ప్రవేశపెట్టారు.
నిత్యం ప్రయాణీకులతో రద్దీగా ఉండే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ల్యాప్‌టాప్‌ల దొంగను రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి రూ.7 లక్షల విలువైన 10 ల్యాప్‌టాప్‌లు, సెల్ఫోన్లతో పాటు ఓ ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. రైల్వే స్టేషన్లో వేచిచూసే ప్రయాణీకులతో పాటు.. రైలులో ప్రయాణించే వారే లక్ష్యంగా నిందితుడు చోరీలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు.
తెలంగాణలోని 17లోక్‌సభ స్థానాలతోపాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్(Secunderabad Cantonment) అసెంబ్లీ నియోజకవర్గానికి ఎన్నికను నిర్వహించాలని కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించింది.
రాబోయే పార్లమెంట్ ఎన్నికల కోసం బీజేపీ(BJP) దూకుడు పెంచింది. అత్యధిక ఎంపీ స్థానాలు గెలవడమే లక్ష్యంగా కమలం పార్టీ పావులు కదుపుతోంది. కార్యచరణలో భాగంగా శనివారం నాడు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ హై కమాండ్ విడుదల చేసింది.
సిట్టింగ్ శాసనసభ్యురాలు లాస్యనందిత(Lasyanandita) రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
తెలుగు రాష్ర్టాల్లో గంటకు 110 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తూ.. విభిన్న వర్గాల ప్రజలకు నిరంతరాయంగా సేవలందిస్తున్న గోదావరి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్(Godavari Superfast Express)కు గురువారంతో 50 ఏళ్లు నిండాయి.
సికింద్రాబాద్ పరిధిలో యాచకులపై దుండగులు కత్తులతో పొడిచారు. దాడిలో ఒకరు చనిపోగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.
సికింద్రాబాద్‌లో గల ఆల్ఫా హోటల్లో బాంబు ఉందని శనివారం రాత్రి 10.45 గంటలకు అజ్క్షాత వ్యక్తి ఫోన్ చేసి బెదిరించాడు.
ఓ 19 ఏళ్ల యువతి సన్యాసిగా మారబోతున్నారు. అవును మీరు విన్నది నిజమే. చిత్తోర్‌కు చెందిన రాజస్థానీ జైన్ మార్వాడీ జ్యువెలర్ కుటుంబానికి చెందిన 19 ఏళ్ల కుమార్తె యోగితా సురానా హైదరాబాద్‌లో సన్యాసిని మారబోతుంది.