Home » Secunderabad
రాష్ట్రంలో పదేళ్లు బీఆర్ఎస్ దోచుకుంటే.. ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ మోసం చేసిందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి(BJP state president Kishan Reddy) పేర్కొన్నారు.
ఎన్నికలు.. ఓటర్లు.. అనగానే పురుషులు ఎంతమంది!? మహిళలు ఎంతమంది అని చూస్తారు కానీ.. మొత్తం ఓటర్లలో యువత సగానికి సగం ఉన్నారని తెలుసా!?
ఎంపీ ఎన్నికల్లో బీజేపీ(BJP)కి మద్దతు ఇవ్వాలని టీటీడీపీ(TTDP) నిర్ణయించింది. ఇందులో భాగంగా, టీటీడీపీ నేతలతో బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి(Former MLA Chintala Ramachandra Reddy) చర్చలు జరిపారు.
గ్రేటర్ హైదరాబాద్లో కీలకంగా ఉన్న సికింద్రాబాద్, మల్కాజిగిరి ఎంపీ స్థానాలను.. వాటితోపాటు మహబూబ్నగర్ లోక్సభ స్థానాన్ని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ అడుగులేస్తోంది.
ఆడవారు పవిత్రంగా భావించే మంగళసూత్రం విలువ ప్రధాని మోదీకి ఏమి తెలుస్తుందని సికింద్రాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దానం నాగేందర్(Danam Nagender) ఎద్దేవా వేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మహిళలు మంగళసూత్రాలు అమ్ముకోవాలని ప్రధాని చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు.
సీఆర్పీఎఫ్ ఎస్ఐ ప్రసాద్(CRPF SI Prasad)ను బెదిరించి దోచుకున్న నలుగురు దొంగలను కాచిగూడ రైల్వే పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. శుక్రవారం రైల్వే పీఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రైల్వే డీఎస్పీ ఎస్. ఎన్. జావేద్, రైల్వే పీఎస్ సీఐ ఎల్లప్ప, ఆర్పీఎఫ్ సీఐ గోరఖ్నాథ్ మల్లు వివరాలు వెల్లడించారు.
పర్యాటకులు, భక్తుల కోసం ప్రత్యేకించి మే 25 నుంచి 9 రోజుల పాటు భారత్ గౌరవ్ రైలు ‘దివ్య దక్షిణ యాత్ర’కు బయలుదేరుతుందని ఐఆర్సీటీసీ అధికారులు తెలిపారు.
సికింద్రాబాద్-రామనాధపురం(Secunderabad-Ramanadhapuram) రైలు సేవలు పొడిగించినట్లు దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. నెం.07695 సికింద్రాబాద్-రామనాథపురం ప్రత్యేక రైలు ఈ నెల 1,8,15,22,29, జూన్ 5,12,19,26 తేదీల్లో రాత్రి 9.10 గంటలకు సికింద్రాబాద్లో బయల్దేరి మరుసటిరోజు రాత్రి 11.45 గంటలకు రామనాథపురం చేరుకుంటుంది.
సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి రెండు లక్షల ఓట్ల మెజారిటీతో విజయం సాధిస్తానని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దానం నాగేందర్(Danam Nagendhar) తెలిపారు.
పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ల పరిశీలన ముగిసింది. పలు కారణాలతో రెండు పార్లమెంట్ల పరిధిలో 30 నామినేషన్లను తిరస్కరించినట్టు అధికారులు తెలిపారు. మల్కాజిగిరి సెగ్మెంట్(Malkajigiri segment)లో అత్యధికంగా 77 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి.