Share News

Secunderabad-Ramanadhapuram: సికింద్రాబాద్‌-రామనాథపురం రైలు సేవల పొడిగింపు

ABN , Publish Date - May 01 , 2024 | 01:20 PM

సికింద్రాబాద్‌-రామనాధపురం(Secunderabad-Ramanadhapuram) రైలు సేవలు పొడిగించినట్లు దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. నెం.07695 సికింద్రాబాద్‌-రామనాథపురం ప్రత్యేక రైలు ఈ నెల 1,8,15,22,29, జూన్‌ 5,12,19,26 తేదీల్లో రాత్రి 9.10 గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరి మరుసటిరోజు రాత్రి 11.45 గంటలకు రామనాథపురం చేరుకుంటుంది.

Secunderabad-Ramanadhapuram: సికింద్రాబాద్‌-రామనాథపురం రైలు సేవల పొడిగింపు

చెన్నై: సికింద్రాబాద్‌-రామనాధపురం(Secunderabad-Ramanadhapuram) రైలు సేవలు పొడిగించినట్లు దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. నెం.07695 సికింద్రాబాద్‌-రామనాథపురం ప్రత్యేక రైలు ఈ నెల 1,8,15,22,29, జూన్‌ 5,12,19,26 తేదీల్లో రాత్రి 9.10 గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరి మరుసటిరోజు రాత్రి 11.45 గంటలకు రామనాథపురం చేరుకుంటుంది. మారుమార్గంలో నెం.07695 రామనాథపురం-సికింద్రాబాద్‌ ప్రత్యేక రైలు ఈ నెల 3,10,17,24,31, జూన్‌ 7,14,21,28 తేదీల్లో ఉదయం 9.50 గంటలకు రామనాథపురంలో బయల్దేరి మరుసటి రోజు మధ్యాహ్నం 12.50 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది.

ఇదికూడా చదవండి: CM Revanth: తెలంగాణకు బీజేపీ ఏం ఇచ్చింది ‘గాడిద గుడ్డు’.. రేవంత్ ట్వీట్

టిక్కెట్‌ లేని ప్రయాణికులకు రూ.3.5 లక్షల జరిమానా

నగరంలో నడుస్తున్న సబర్బన్‌ రైళ్లలో టిక్కెట్‌ లేకుండా ప్రయాణిస్తున్న వారి నుంచి రూ.3.5 లక్షల జరిమానా వసూలుచేసినట్లు దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. నగరంలో నడుపుతున్న 264 సబర్బన్‌ రైళ్లలో సోమవారం ఒకేరోజు 160 మంది టిక్కెట్‌ చెకింగ్‌ అధికారులు, ఆర్పీఎఫ్‌ సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా టిక్కెట్లు లేకుండా ప్రయాణిస్తున్న 1,300 మంది నుంచి రూ.3.5 లక్షల జరిమానా వసూలుచేసినట్లు దక్షిణ రైల్వే తెలియజేసింది.

ఇదికూడా చదవండి: Danam Nagendhar: రెండు లక్షల ఓట్ల మెజారిటీతో విజయం సాధిస్తా..

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - May 01 , 2024 | 01:20 PM