Home » Sensex
దేశీయ స్టాక్ మార్కెట్లో(stock market) శుక్రవారం (ఏప్రిల్ 19న) షార్ప్ కరెక్షన్ కనిపించింది. మిడిల్ ఈస్ట్‌లో పెరుగుతున్న ఉద్రిక్తత, దేశంలో లోక్‌సభ ఎన్నికలు సహా పలు అంశాల ఒత్తిడుల నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్లు నష్టాల్లో దూసుకెళ్తున్నాయి. దీంతో మదుపర్లు కొన్ని నిమిషాల్లోనే పెద్ద ఎత్తున నష్టపోయారు.
గ్లోబల్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, విదేశీ పెట్టుబడుల వెల్లువ ఉత్సహంతో... దేశీయ ఈక్విటీ మార్కెట్లు సోమవారం ఆరంభ సెషన్లో లాభాల పరుగందుకున్నాయి. ఆరంభంలో బీఎస్ఈ సెన్సెక్స్ సూచీ 307.22 పాయింట్లు లాభపడి జీవితకాల గరిష్ఠ స్థాయి 74,555.44 మైలురాయిని తాకింది. గరిష్ఠంగా 74,658.95 మార్క్‌ను కూడా టచ్ చేసింది. ఇక ఎన్ఎస్ఈ నిఫ్టీ సూచీ 79.6 పాయింట్లు వృద్ధి చెందిన ఆల్ టైమ్ గరిష్ఠం 22,593 పాయింట్ల మార్క్‌ను తాకింది. ఇరు సూచీలకు ఇది జీవితకాల గరిష్ఠ స్థాయిగా ఉంది.
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బీఎస్ఈ సెన్సెక్స్ (Sensex), ఎన్ఎస్ఈ నిఫ్టీ (NSE Nifty) సరికొత్త జీవితకాల గరిష్ఠాలను తాకాయి. డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికానికి సంబంధించి టెక్ రంగ కంపెనీలు, ప్రభుత్వరంగ బ్యాంకులు, ఇంధన రంగ కంపెనీల ఫలితాలు సానుకూలంగా ఉండడంతో వారాంతం శుక్రవారం నాడు మార్కెట్లు లాభాల్లో దూసుకెళ్లాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు వారంతంలో మంచి లాభాల్లో కొనసాగుతున్నాయి. ఐటీ కంపెనీల సానుకూల ఫలితాలతో శుక్రవారం స్టాక్ మార్కెట్లు అద్భుతమైన వృద్ధితో మొదలయ్యాయి. ఈ క్రమంలో మార్కెట్లోని ప్రధాన సూచీలు గ్రీన్‌లో ట్రేడవుతున్నాయి. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
దేశీయ స్టాక్ మార్కెట్లు కొత్త సంవత్సరం మొదటి వారం చివరి ట్రేడింగ్ రోజైన శుక్రవారం కూడా లాభాలతో ప్రారంభమైంది. BSE సెన్సెక్స్ 174 పాయింట్ల జంప్‌తో 72022 స్థాయి వద్ద మొదలా...కాగా నిఫ్టీ 50 ఈరోజు ట్రేడింగ్‌ను 47 పాయింట్ల లాభంతో 21705 స్థాయి వద్ద ఆరంభించింది.
క్యాలెండర్ ఏడాది 2023లో దేశీయ స్టాక్ మార్కెట్లు కీలక మైలురాళ్లను నమోదు చేస్తున్నాయి. తాజాగా మరో రికార్డును నెలకొల్పాయి. దేశీయ ఈక్విటీ మార్కెట్ చరిత్రలో తొలిసారి బీఎస్ఈ సెన్సెక్స్ సూచీ 70,000 మైలురాయిని తాకింది.
ఇన్ఫోసిస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్, హెచ్‌యుఎల్ వంటి ఇండెక్స్ దిగ్గజాల స్టాక్స్ పతనంతో వరుసగా 6 రోజుల లాభాలకు బ్రేక్ పడింది. బీఎస్ఈ సెన్సెక్స్ 1.31 శాతం లేదా 900 పాయింట్ల మేర నష్టపోయి 66,684 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక వరుస లాభాల క్రమంలో 20 వేల మార్క్‌ను తాకుతుందని భావించిన ఎన్ఎస్ఈ నిఫ్టీ శుక్రవారం ఏకంగా 1.17 శాతం లేదా 234 పాయింట్లు క్షీణించి 19,745 పాయింట్ల వద్ద ముగిసింది. ఫలితంగా బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.304 లక్షల కోట్ల నుంచి రూ.302.1 లక్షల కోట్లకు పడిపోయింది.
బుల్ రంకెలేస్తోంది... నయా రికార్డులను సృష్టిస్తూ ఆకాశమే హద్దుగా దూసుకెళ్తోంది... గ్లోబల్ మార్కెట్ల సానుకూల సంకేతాలు, విదేశీ ఫండ్స్ వెల్లువ ఫలితంగా దేశీయ ఈక్విటీ మార్కెట్లు బుధవారం సరికొత్త రికార్డులను నెలకొల్పాయి. బీఎస్ఈ సెన్సెక్స్ సూచీ (BSE Sensex) చరిత్రలో తొలిసారి 64 వేల మార్క్‌ను తాకింది. మరో సూచీ ఎన్ఎస్ఈ నిఫ్టీ మొట్టమొదటిసారి 19 వేల మార్క్‌ను ముద్దాడింది.
దేశీయ ఈక్విటీ మార్కెట్లు (Equity markets) బుధవారం భారీ నష్టాల్లో ముగిశాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థకు సంబంధించి విడుదలైన డేటాను బట్టి చూస్తే..
దేశీయ మార్కెట్ సూచీలు బీఎస్ఈ సెన్సెక్స్ (BSE Sensex), ఎన్ఎస్ఈ నిఫ్టీ-50 (NSE Nifty) సూచీలు ఒక క్యాలెండర్ ఏడాదిలో చివరిసారిగా 2015లో నష్టాల్లో ముగిశాయి. ఈ విషయాన్ని ఇప్పుడెందుకు గుర్తుచేసుకోవాల్సి వచ్చిందంటే..