Share News

Stock Markets: సరికొత్త శిఖరంపై దేశీయ మార్కెట్లు.. ఏకంగా రూ.400 లక్షల కోట్లు

ABN , Publish Date - Apr 08 , 2024 | 11:14 AM

గ్లోబల్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, విదేశీ పెట్టుబడుల వెల్లువ ఉత్సహంతో... దేశీయ ఈక్విటీ మార్కెట్లు సోమవారం ఆరంభ సెషన్‌లో లాభాల పరుగందుకున్నాయి. ఆరంభంలో బీఎస్ఈ సెన్సెక్స్ సూచీ 307.22 పాయింట్లు లాభపడి జీవితకాల గరిష్ఠ స్థాయి 74,555.44 మైలురాయిని తాకింది. గరిష్ఠంగా 74,658.95 మార్క్‌ను కూడా టచ్ చేసింది. ఇక ఎన్‌ఎస్ఈ నిఫ్టీ సూచీ 79.6 పాయింట్లు వృద్ధి చెందిన ఆల్ టైమ్ గరిష్ఠం 22,593 పాయింట్ల మార్క్‌ను తాకింది. ఇరు సూచీలకు ఇది జీవితకాల గరిష్ఠ స్థాయిగా ఉంది.

Stock Markets: సరికొత్త శిఖరంపై దేశీయ మార్కెట్లు.. ఏకంగా రూ.400 లక్షల కోట్లు

గ్లోబల్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, విదేశీ పెట్టుబడుల వెల్లువ ఉత్సహంతో... దేశీయ ఈక్విటీ మార్కెట్లు సోమవారం ఆరంభ సెషన్‌లో లాభాల పరుగందుకున్నాయి. ఆరంభంలో బీఎస్ఈ సెన్సెక్స్ సూచీ 307.22 పాయింట్లు లాభపడి జీవితకాల గరిష్ఠ స్థాయి 74,555.44 మైలురాయిని తాకింది. గరిష్ఠంగా 74,658.95 మార్క్‌ను కూడా టచ్ చేసింది. ఇక ఎన్‌ఎస్ఈ నిఫ్టీ సూచీ 79.6 పాయింట్లు వృద్ధి చెందిన ఆల్ టైమ్ గరిష్ఠం 22,593 పాయింట్ల మార్క్‌ను తాకింది. సోమవారం ఉదయం 11 గంటల సమయానికి ఇరు సూచీలకు ఇది జీవితకాల గరిష్ఠ స్థాయిగా ఉంది.


బీఎస్ఈ-30లో రిల్ (రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్) షేర్లు లాభాల్లో పయనించడం బీఎస్ఈ సూచీ వృద్ధికి ప్రధానంగా దోహదం చేసింది. టాటా స్టీల్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, పవర్‌ గ్రిడ్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ షేర్లు చక్కటి లాభాల్లో కొనసాగుతున్నాయి. కాగా విప్రో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు నష్టాల్లో కనిపించాయి.


ఆసియా మార్కెట్ల విషయానికి వస్తే దక్షిణకొరియా, జపాన్, చైనా, హాంకాంగ్ సూచీలు సానుకూలంగా పయనిస్తున్నాయి. అమెరికా ప్రధాన మార్కెట్ వాల్ స్ట్రీట్ సూచీ శుక్రవారం గణనీయ లాభాలతో ముగియడం ఆసియా మార్కెట్లకు సానుకూల సంకేతాలను ఇచ్చింది. మరోవైపు ఎఫ్ఐఐ (విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు) శుక్రవారం దేశీయ మార్కెట్లలో రూ.1,659.27 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లు కొనుగోలు చేశారు. ఈ డేటా కూడా మదుపర్లలో ఉత్సాహాన్ని నింపిందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు నాలుగవ త్రైమాసిక ఫలితాలు సానుకూలంగా ఉండబోతున్నాయనే అంచనాలు కూడా మార్కెట్ల దూకుడుగా కారణమవుతున్నాయని విశ్లేషిస్తున్నారు.


ఎం-క్యాప్ @రూ.400 లక్షల కోట్లు

లాభాల బాటలో పయనిస్తున్న దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం రికార్డును నమోదు చేశాయి. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ సోమవారం ఏకంగా రూ.400 లక్షల కోట్ల మార్క్‌ను తాకింది. మదుపర్ల కొనుగోలు ఆసక్తి ఇందుకు తోడ్పడింది.

ఇవి కూడా చదవండి

IRCTC: షిర్డీ, శని శింగణాపూర్, త్రయంబకేశ్వర్ టూర్ ప్లాన్.. 3 రోజులకు ఎంతంటే

Lowest Home Loan: ఈ బ్యాంకుల్లో అత్యల్ప వడ్డీ రేటుకే హోమ్ లోన్స్!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Apr 08 , 2024 | 11:22 AM