Home » Sharad Pawar
ఈ ఏడాది చివర్లో జరిగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 'మహా వికాస్ అఘాడి' మెజారిటీ సాధిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదని ఎన్సీపీ-ఎస్పీ సుప్రీం శరద్ పవార్ ధీమా వ్యక్తం చేశారు. సీఎం ఎవరనేది ఆ తర్వాతే నిర్ణయిస్తామని చెప్పారు.
ముఖ్యమంత్రి పదవికి ఎవరినీ అభ్యర్థిగా ప్రకటించకుండా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోరాడదామని కాంగ్రెస్ ప్రతిపాదించింది.
కేంద్ర మాజీ మంత్రి, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కూతురు, ఎంపీ సుప్రియా సూలే ఫోన్ హ్యాక్ అయ్యింది. ఆమె వాట్సాప్‌ను కూడా కేటుగాళ్లు హ్యాక్ చేశారు. ఇదే విషయాన్ని సుప్రియా సూలే ఎక్స్‌వేదికగా ప్రకటించారు. తన ఫోన్, వాట్సాప్ హ్యాక్ అయ్యాయని..
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది ద్వితీయార్థంలో జరగాల్సి ఉన్న నేపథ్యంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) చీఫ్ శరద్ పవార్, మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన చీఫ్ రాజ్‌థాకరేలు సీఎం ఏక్నాథ్ షిండేను శనివారంనాడు వేర్వేరుగా కలుసుకున్నారు.
మహారాష్ట్రలో హింస తలెత్తేందుకు అవకాశాలున్నాయంటూ ఎన్సీపీ-ఎస్పీ చీఫ్ శరద్ పవార్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ తప్పుపట్టింది. శరద్ పవార్ వంటి సీనియర్ నేత నుంచి ఇలాంటి వ్యాఖ్యలు వెలువడతాయని తాము ఊహించలేదని బీజేపీ మహారాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ బావన్కులే అన్నారు.
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా, ఎన్సీపీ(ఎస్పీ) నేత, సీనియర్ నాయకుడు శరద్ పవార్ల మధ్య రాజకీయం వేడెక్కింది. ఇటీవల మహారాష్ట్రలోని పుణెలో జరిగిన బీజేపీ సదస్సులో శరద్ పవార్‌ను ఉద్దేశించి ‘అవినీతి చక్రవర్తి’ అని షా వ్యాఖ్యానించారు.
''అవినీతికి సూత్రధారి'' అంటూ కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఇటీవల తనపై చేసిన వ్యాఖ్యలపై మహారాష్ట్ర సీనియర్ నేత, నేషనల్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) చీఫ్ శరద్ పవార్ మండిపడ్డారు. సొంత రాష్ట్రమైన గుజరాత్ నుంచి సుప్రీంకోర్టు ఆయనను దూరంగా ఉంచిన విషయాన్ని గుర్తుచేశారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేతో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ సోమవారం భేటీ అయ్యారు. ముంబైలోని సహ్యాద్రి గెస్ట్ హౌస్‌లో వారిద్దరూ సమావేశమయ్యారు.
నేషనల్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) చీఫ్ శరద్ పవార్ పై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిని శరద్ పవార్ పార్టీ అంతే ఘాటుగా తిప్పికొట్టింది. పుణెలో మహారాష్ట్ర బీజేపీ సెషన్లో అమిత్‌షా ఆదివారంనాడు మాట్లాడుతూ, అవినీతి ప్రజలకు శరద్ పవార్ చీఫ్ అని, ఆయన దేశంలో అవినీతిని వ్యవస్థాగతం చేశారని విమర్శించారు.
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదులు తెలిపే తీర్మానంపై మోదీ మాట్లాడుతుండగా ప్రతిపక్ష నాయకుడు ఖర్గేని మాట్లాడాలనివ్వాలని విపక్ష ఎంపీలు నిరసన వ్యక్తం చేయడం, చివరకు వారు సభ నుంచి వాకౌట్ చేయడంపై ఎన్సీపీ-ఎస్సీపీ చీప్ శరద్ పవార్ (Sharad Pawar)స్పందించారు. మల్లికార్జున్ ఖర్గే ప్రతిపక్ష నేతగా రాజ్యాంగ పదవిలో ఉన్నందున ఆయనను ప్రధానమంత్రి మోదీ, రాజ్యసభ చైర్మన్ గౌరవించాల్సి ఉంటుందని అన్నారు.