Supreme Court: మీ కాళ్లపై మీరు నిలుచోవడం నేర్చుకోండి.. అజిత్ వర్గానికి సుప్రీం చురకలు
ABN , Publish Date - Nov 13 , 2024 | 05:14 PM
అన్‌డివైడెడ్ ఎన్‌సీపీ లోగో అయిన 'గడియారం' గుర్తును వాడకుండా తన మేనల్లుడిని (అజిత్) నిరోధించాలని కోరుతూ శరద్ పవార్ వేసిన పిటిషన్‌పై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌తో కూడిన సుప్రీం ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది.
న్యూఢిల్లీ: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు (Maharashtra Assembly Elections) మరో వారంలో జరుగనున్న నేపథ్యంలో అక్కడి అజిత్ పవార్ (Ajit Pawar) సారథ్యంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP)కి సుప్రీంకోర్టులో బుధవారంనాడు చుక్కెదురైంది. ఎన్నికల ప్రచారంలో ఆ పార్టీ వ్యవస్థాపకుడైన శరద్ పవార్ ఫోటోను కానీ, వీడియోలు కానీ వాడరాదని అజిత్ వర్గాన్ని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ''సొంత కాళ్లపై నిలబడటం నేర్చుకోండి'' అని చురకలు కూడా వేసింది.
Maharashtra Elections: సీఎం బ్యాగ్‌ను కూడా వదిలిపెట్టని అధికారులు
అన్‌డివైడెడ్ ఎన్‌సీపీ లోగో అయిన 'గడియారం' గుర్తును వాడకుండా తన మేనల్లుడిని (అజిత్) నిరోధించాలని కోరుతూ శరద్ పవార్ వేసిన పిటిషన్‌పై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌తో కూడిన సుప్రీం ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా శరద్ పవార్ తరఫు న్యాయవాది అభిషేక్ సింఘ్వి తన వాదన వినిపిస్తూ శరద్ పవార్‌కు చెందిన పాత వీడియోను అజిత్ పవార్ వర్గం తమ ప్రచారంలో వాడుకుటోందని, ఇందువల్ల పవార్లు ఇద్దరూ శత్రువులు కారనే అభిప్రాయానికి తావిస్తుందని, అదనపు ఓట్లు రాబట్టుకునేందుకు అజిత్ వర్గం చేస్తున్న ఈ ప్రయత్నాన్ని నిలువరించాలని కోరారు.
దీనిపై అజిత్ వర్గం విజ్ఞప్తిని జస్టిస్ సూర్య తోసిపుచ్చుతూ, సర్క్యులేషన్‌లో ఉన్న వీడియో కొత్తదైనా, పాతదైనా సైద్ధాంతిక విభేదాలతో ఒకరిపై ఒకరు పోటీ చేస్తున్న విషయాన్ని అజిత్ పవార్ వర్గం గుర్తించాలని అన్నారు. ''మీ కాళ్ల మీద మీరు నిలబడటం నేర్చుకోండి'' అని న్యాయవాది మందలించారు. శరద్ పవార్ ఫోటో కానీ, వీడియో కానీ ఎన్నికల ప్రచారంలో వాడకుండా తమ పార్టీ నేతలకు, కార్యకర్తలకు అజిత్ పవార్ కార్యాలయం సర్క్యులర్ జారీ చేయాలని ధర్మాసనం ఆదేశించింది.
ఇవి కూడా చదవండి
Nitish Touch PM Feet: మళ్లీ మోదీ పాదాలకు మొక్కిన నితీష్
నటి కస్తూరి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు
For More National And Telugu News