Maharashtra Polls: శరద్ పవార్ పార్టీలో నటి స్వర భాస్కర్ భర్త... వెంటనే టిక్కెట్
ABN , Publish Date - Oct 27 , 2024 | 06:44 PM
సమాజ్‌వాదీ పార్టీ మహారాష్ట్ర ప్రదేశ్ యువజన విభాగమైన సమాజ్‌వాది యువజన సభ రాష్ట్ర అధ్యక్షుడిగా ఫహద్ అమ్మద్ ఉన్నారు. అయితే ఎన్‌సీపీ-ఎస్‌సీపీ అభ్యర్థిగా ఫహద్ అహ్మద్‌ను నిలబెట్టాలని తాము అనుకుంటున్నట్టు సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌ను శరద్ పవార్ కోరడంతో ఎన్సీపీ(ఎస్‌సీపీ)లో ఫహద్ అహ్మద్ చేరారు.
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ శరద్ పవర్ సారథ్యంలోని ఎన్‌సీపీ (ఎస్‌సీపీ)లోకి బాలీవుడ్ నటి స్వర భాస్కర్ (Swara Bhaskar) భర్త ఫహద్ అహ్మద్ ఆదివారంనాడు చేరారు. ఆయనకు అణుశక్తి నగర్ (Anushkti Nagar) టిక్కెట్‌ను పార్టీ కేటాయించింది. ఇక్కడ ఎన్‌సీపీ అజితి పవార్ అభ్యర్థిగా సనా మాలిక్ పోటీ చేస్తున్నారు.
Palika Bazar: అనుమానాస్పద ఎలక్ట్రానికి పరికరం స్వాధీనం..ఇదెంత డేంజర్ అంటే
ఎవరీ ఫహద్ అమ్మద్
సమాజ్‌వాదీ పార్టీ మహారాష్ట్ర ప్రదేశ్ యువజన విభాగమైన సమాజ్‌వాది యువజన సభ రాష్ట్ర అధ్యక్షుడిగా ఫహద్ అమ్మద్ ఉన్నారు. అయితే ఎన్‌సీపీ-ఎస్‌సీపీ అభ్యర్థిగా ఫహద్ అహ్మద్‌ను నిలబెట్టాలని తాము అనుకుంటున్నట్టు సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌ను శరద్ పవార్ కోరడంతో ఎన్సీపీ(ఎస్‌సీపీ)లో ఫహద్ అహ్మద్ చేరారు. దీనిపై ఆ పార్టీ నేత జయంత్ పాటిల్ మరింత వివరణ ఇస్తూ, గతంలో ఫహద్ అమ్మద్ ఎస్పీలో ఉన్నారని, ఆ పార్టీతో చర్చించిన అనంతరమే ఆయన తమ పార్టీలోకి వచ్చారని చెప్పారు. అణుశక్తి నగర్ నియోజకవర్గం నుంచి ఫహద్‌కు టిక్కెట్ కేటాయించినట్టు తెలిపారు.
కాగా, తనను అభ్యర్థిగా నిలబెట్టేందుకు అఖిలేష్ యాదవ్‌కు విజ్ఞప్తి చేసిన శరద్ పవార్‌కు ఫహద్ అహ్మద్ కృతజ్ఞతలు తెలిపారు. సమాజ్‌వాదీ పార్టీ, ఎన్‌సీపీ ఎస్‌సీపీలు రెండూ ఒకే కుటుంబమని, ములాయం సింగ్ యాదవ్, శరద్ పవార్, సుప్రియా సూలె, అఖిలేష్ యాదవ్ మధ్య పటిష్ట అనుబంధం ఉందని చెప్పారు. మహారాష్ట్ర ప్రజలు ప్రస్తుత ప్రభుత్వాన్ని గద్దెదించాలని బలంగా అనుకుంటున్నారని చెప్పారు.
ఎంవీఏ సీట్ షేరింగ్ ఫార్ములా
మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) కూటమిలో భాగస్వామ్య పార్టీలైన శరద్ పవార్ ఎన్సీపీ, కాంగ్రెస్, ఉద్ధవ్ థాకరే శివసేన మధ్య ఒక్కొక్కరికి 85 సీట్ల చొప్పున సీట్ల పంపకాల ఒప్పందం కుదిరింది. తక్కిన 23 సీట్లను ఆయా అభ్యర్థుల జాబితా ఆధారంగా కేటాయిస్తారు. 288 సీట్ల మహారాష్ట్ర అసెంబ్లీకి ఒకే విడతలో నవంబర్ 20న పోలింగ్ జరుగనుంది. నవంబర్ 23న ఫలితాలు వెలువడతాయి.
ఇవి కూడా చదవండి...
Bandra Stampede: ప్రజల ప్రాణాలను గాలికొదిలేసి బుల్లెట్ ట్రైన్‌తో మంత్రి బిజీ.. సంజయ్ రౌత్ ఆక్షేపణ
Maharashtra Assembly Elections: 'మహా' ప్రచారంలో బీజేపీ హేమాహేమాలు
Read More National News and Latest Telugu News