Share News

Maharashtra Elections: ప్రతిష్టంభనకు తెర.. మహాకూటమి లెక్కలు తేలినట్టే

ABN , Publish Date - Oct 22 , 2024 | 08:14 PM

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సీట్ల పంపకాలు, జాబితాల విడుదల పరంగా మహాయుతి కటమి ముందంజలో ఉంది. అభివృద్ధి ప్రాజెక్టుల పరంగా ప్రధానమంత్రి ఇప్పటికే మహారాష్ట్రలో పలుమార్లు పర్యటించి అనధికారికంగా ముందస్తు ప్రచారానికి శ్రీకారం చుట్టారు.

Maharashtra Elections: ప్రతిష్టంభనకు తెర.. మహాకూటమి లెక్కలు తేలినట్టే

ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో (Maharashtra Assembly Elctions) మహాకూటమి మధ్య సీట్ల పంపకాలపై తలెత్తిన ప్రతిష్ఠంభనకు తెరపడినట్టే. కాంగ్రెస్, శివసేన (UBT), ఎన్‌సీపీ-ఎస్‌పీ మధ్య మంగళవారంనాడు సానుకూలంగా చర్చలు జరిగినట్టు కూటమి సన్నిహిత వర్గాలు తెలిపాయి. కూటమి నేతల మధ్య కుదిరినట్టు చెబుతున్న అవగాహన ప్రకారం.. కాంగ్రెస్ పార్టీ 110 నుంచి 115 సీట్లలోనూ, ఉద్ధవ్ శివసేన 90 నుంచి 95 స్థానాల్లోనూ, శరద్‌పవార్ ఎన్‌సీపీ 75 నుంచి 80 స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉంది.

Waqf Bill: జేపీసీ మీటింగ్‌లో గ్లాస్ బాటిల్ విసిరికొట్టిన టీఎంసీ ఎంపీ సస్పెన్షన్


ఎవరి అంచనాలు వారివే

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ ప్రధానంగా బీజేపీ-ఏక్‌నాథ్ షిండే శివసేన-అజిత్ పవార్ ఎన్‌సీపీతో కూడిన మహాయుతి కూటమికి, కాంగ్రెస్-ఉద్ధవ్ శివసేన-పవార్ ఎన్‌సీపీతో కూడిన మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) మధ్య నెలకొంది. గత రెండేళ్లలో చేసిన అభివృద్ధి పనులే తమను మళ్లీ అధికారంలోకి తెస్తాయని మహాయుతి కూటమి ధీమా వ్యక్తం చేస్తుండగా, గత లోక్‌సభ ఎన్నికల్లో సాగించిన జోరే అసెంబ్లీ ఎన్నికల్లోనూ తాము కొనసాగించనున్నట్టు ఎంవీఏ బలమైన అంచనాలతో ఉంది. మహారాష్ట్ర లోక్‌సభ ఎన్నికల్లో ఎంవీఏ కూటమి మొత్తం 48 స్థానాల్లో 31 స్థానాలు గెలుచుకుంది.


కాగా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సీట్ల పంపకాలు, జాబితాల విడుదల పరంగా మహాయుతి కటమి ముందంజలో ఉంది. అభివృద్ధి ప్రాజెక్టుల పరంగా ప్రధానమంత్రి ఇప్పటికే మహారాష్ట్రలో పలుమార్లు పర్యటించి అనధికారికంగా ముందస్తు ప్రచారానికి శ్రీకారం చుట్టారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం, జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో గతంలో కంటే సీట్లు, ఓటింగ్ శాతం పెంచుకుని రెండో పెద్ద పార్టీగా నిలవడంతో మహారాష్ట్ర బీజేపీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం కనిపిస్తోంది. మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 20న ఒకే విడతలో పోలింగ్ జరుగనుండగా, నవంబర్ 23న ఫలితాలు వెలువడతాయి.


ఇవి కూడా చదవండి..

Lawrence Bishnoi: అతడిని ఎన్ కౌంటర్ చేస్తే కోటి రివార్డు.. పోలీసులకు కర్ణిసేన ఓపెన్ ఆఫర్..

Bomb Threats: ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో సీఆర్‌పీఎఫ్ పాఠశాలలకు బాంబు బెదిరింపులు

Submarine: భారత అమ్ముల పొదిలోకి ఎస్ఎస్‌బీఎన్ ఎస్-4 అణు జలాంతర్గామి..

Read More National News and Latest Telugu News

Updated Date - Oct 22 , 2024 | 08:14 PM