Home » Shiv Sena
మహారాష్ట్రలోని బీజేపీ-శివసేన-ఎన్సీపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ సీనియర్ నేత పీ చిదంబరం వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ ప్రభుత్వాన్ని పరిశీలించినపుడు, మూడు కాళ్ల జంతువు 100 మీటర్ల పరుగు పందెంలో పరుగెడుతున్నట్లు ఉందని వ్యాఖ్యానించారు.
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాకరే (Uddhav Thackeray) విదర్భ పర్యటనలో రెండో రోజు అత్యంత భావోద్వేగంతో మాట్లాడారు. శివసేన పార్టీ పేరును తన తాత గారు కేశవ్ థాకరే సూచించారని, ఆ పేరును ఎన్నికల కమిషన్ (EC) ఇతరులకు ఇవ్వకూడదని అన్నారు. ఎన్నికల గుర్తుపై ఈసీ నిర్ణయం తీసుకోవచ్చునన్నారు.
శివసేన పార్టీని చీల్చిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలనే డిమాండ్లపై మహారాష్ట్ర శాసన సభ సభాపతి రాహుల్ నార్వేకర్శ నివారం స్పందించారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే (Eknath Shinde) నేతృత్వంలోని శివసేన ఎమ్మెల్యేల్లో అసంతృప్తి సెగలు రగులుతున్నాయి. ఎన్సీపీని చీల్చి, అజిత్ పవార్ (Ajit Pawar) వర్గం బీజేపీ-శివసేన కూటమిలో చేరడంతో తమకు ప్రాధాన్యం తగ్గుతుందని వీరు అభిప్రాయపడుతున్నారు.
మహారాష్ట్రలో జరుగుతున్న రాజకీయ పరిణామాల పట్ల మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (MNS) చీఫ్ రాజ్ థాకరే (Raj Thackeray) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
మహారాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మరికాసేపట్లో సమావేశం కాబోతున్నారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (AICC) కార్యదర్శి హెచ్‌కే పాటిల్ ఈ సమావేశానికి హాజరవుతారు. శాసన సభలో ప్రతిపక్ష నేత పదవిపై ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్సీపీ నేత అజిత్ పవార్ ఈ పదవికి శుక్రవారం రాజీనామా చేయడంతో ఈ పదవి ఖాళీ అయిన సంగతి తెలిసిందే.
మహారాష్ట్రలో ఆదివారం రాజకీయంగా అతి పెద్ద సంచలనం నమోదైంది. మరాఠా రాజకీయ దిగ్గజం శరద్ పవార్‌పై ఆయన సమీప బంధువు అజిత్ పవార్ తిరుగుబాటు చేసి, ప్రత్యర్థి పక్షంతో చేతులు కలిపారు. బీజేపీ-శివసేన కూటమితో కలిసి ప్రభుత్వంలో చేరారు. అజిత్ పవార్‌తోపాటు ఎన్సీపీలో ప్రముఖ నేత చగన్ భుజ్‌బల్ కూడా బీజేపీ-శివసేన కూటమితో చేతులు కలిపారు.
మరాఠా రాజకీయ దిగ్గజం శరద్ పవార్‌కు ఆయన సమీప బంధువు అజిత్ పవార్ గట్టి ఝలక్ ఇచ్చినట్లు జాతీయ మీడియా కథనాలనుబట్టి తెలుస్తోంది.
శివసేన వ్యవస్థాపక దినోత్సవం ఈనెల 19న పోటాపోటీగా నిర్వహించేందుకు అటు ఏక్నాథ్ షిండే సారథ్యంలోని శివసేన, ఉద్ధవ్ థాకరే సారథ్యంలో శివసేన యూబీటీ సిద్ధమవుతున్నాయి.
శివసేన ఉద్ధవ్ బాల్‌థాకరే మహిళా నేత, ఆఫీస్ బేరర్పై మహారాష్ట్రలోని థానేలో జరిగిన ఒక కార్యక్రమంలో కొందరు మహిళలు దాడికి దిగారు. ఇంక్ చల్లి అవమానించారు. శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ మేరకు బాధితురాలు, శివసేన యూబీటీ సోషల్ మీడియా కన్వీనర్ అయోధ్య పోల్ థానేలోని కల్వా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.