2024 Lok Sabha Polls : ‘వారణాసి బరిలో మోదీపై విజయం ప్రియాంక గాంధీ వాద్రాకే’

ABN , First Publish Date - 2023-08-19T15:01:17+05:30 IST

రానున్న లోక్ సభ ఎన్నికల్లో వారణాసి బరిలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రియాంక గాంధీ వాద్రా పోటీ చేస్తే, ప్రియాంక విజయం సాధిస్తారని శివసేన-యూబీటీ ఎంపీ ప్రియాంక చతుర్వేది చెప్పారు. ఈ స్థానం నుంచి మోదీ రెండుసార్లు గెలిచిన సంగతి తెలిసిందే.

2024 Lok Sabha Polls : ‘వారణాసి బరిలో మోదీపై విజయం ప్రియాంక గాంధీ వాద్రాకే’
Priyanka Chaturvedi , Priyanka Gandhi Vadra

న్యూఢిల్లీ : రానున్న లోక్ సభ ఎన్నికల్లో వారణాసి బరిలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రియాంక గాంధీ వాద్రా పోటీ చేస్తే, ప్రియాంక విజయం సాధిస్తారని శివసేన-యూబీటీ ఎంపీ ప్రియాంక చతుర్వేది చెప్పారు. ఈ స్థానం నుంచి మోదీ రెండుసార్లు గెలిచిన సంగతి తెలిసిందే. ఉత్తర ప్రదేశ్‌లో ఉన్న 80 లోక్ సభ స్థానాల్లో ఇదొకటి.

2024 లోక్ సభ ఎన్నికల్లో (2024 Lok Sabha elections) మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించాలనే లక్ష్యంతో 26 పార్టీలు కలిసి ఇండియా (I.N.D.I.A) కూటమిగా ఏర్పాటైన సంగతి తెలిసిందే. ఈ కూటమిలో భాగస్వామి అయిన శివసేన-యూబీటీ ఎంపీ ప్రియాంక చతుర్వేది శనివారం మాట్లాడుతూ, ప్రియాంక గాంధీ వాద్రా (Priyanka Gandhi Vadra) కోరుకుంటే ఉత్తర ప్రదేశ్‌లోని అమేథీ నుంచి కానీ, వారణాసి నుంచి కానీ పోటీ చేయవచ్చునన్నారు. ఆమె కచ్చితంగా విజయం సాధిస్తారన్నారు. తమ కూటమి పార్టీలు ముందడుగు వేసి పోరాడుతున్నాయన్నారు. తమ కూటమి ప్రభావం, పలుకుబడి పెరుగుతున్నాయనడానికి నిదర్శనం మోదీ పార్లమెంటులోనూ, ఎర్ర కోటపైన తమపై విమర్శలు గుప్పించడమేనని తెలిపారు. బీజేపీయేతర పార్టీలు 26 కలిసికట్టుగా ఉన్నాయని, వాటి ఎమ్మెల్యేలు, ఎంపీలు కలిసికట్టుగా పోరాడతారని చెప్పారు. ఈ పోరాటంలో వారి ఓట్లన్నీ కలుస్తాయని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేతో తమ కూటమి హోరాహోరీగా పోరాడుతుందని ధీమా వ్యక్తం చేశారు.


సీట్ల కేటాయింపుపై ఏకాభిప్రాయం గురించి ప్రశ్నించినపుడ ప్రియాంక చతుర్వేది స్పందిస్తూ, సమయం వచ్చినపుడు దీని గురించి వెల్లడిస్తామన్నారు. వారణాసి స్థానానికి ప్రియాంక గాంధీ వాద్రా సరైన అభ్యర్థి అని చర్చల సందర్భంగా నిర్థరణ అయితే, శివసేన-యూబీటీ అదేవిధంగా ఇండియా కూటమి ఆమెను సమర్థిస్తాయన్నారు.

బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ చొరవతో ప్రతిపక్షాల ఐక్యతకు బాటలు పడిన సంగతి తెలిసిందే. ప్రతిపక్షాల తొలి సమావేశం పాట్నాలో, రెండో సమావేశం బెంగళూరులో జరిగింది. మూడో సమావేశం ముంబైలో ఈ నెల 31, వచ్చే నెల 1 తేదీల్లో జరగబోతోంది. ప్రియాంక గాంధీ లోక్ సభ ఎన్నికల్లో పోటీపై ఇటీవలే ఆమె భర్త రాబర్ట్ వాద్రా సంకేతాలు పంపిన సంగతి తెలిసిందే.


ఇవి కూడా చదవండి :

Udyan Express : ఉద్యాన్ ఎక్స్‌ప్రెస్ రైలులో అగ్నిప్రమాదం.. ప్రయాణికులు సురక్షితం..

Evil Nurse : ఏడుగురు పసికందులను చంపేసిన నర్స్.. భారత సంతతి డాక్టర్ కృషితో ఆ రాక్షసికి శిక్ష..

Updated Date - 2023-08-19T15:01:17+05:30 IST