Home » Shreyas Iyer
ఈ నెల 11 నుంచి భారత్, అప్ఘానిస్థాన్ మధ్య జరిగే టీ20 సిరీస్‌లో స్టార్ ఆటగాడు శ్రేయాస్ అయ్యర్‌కు చోటు దక్కలేదు. శ్రేయాస్‌కు విశ్రాంతి కల్పిస్తున్నామని, అందుకే అప్ఘానిస్థాన్‌తో సిరీస్‌కు ఎంపిక చేయలేదని సెలెక్టర్లు తెలిపారు.
IPL 2024: వచ్చే ఏడాది ఐపీఎల్‌కు సంబంధించి కోల్‌కతా నైట్‌రైడర్స్ కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది జరిగిన మెగా టీ20 లీగ్ ఐపీఎల్‌కు దూరమైన శ్రేయాస్ అయ్యర్ తిరిగి జట్టులో చేరనుండటంతో అతడిని కెప్టెన్‌గా నియమిస్తున్నట్లు కేకేఆర్ యాజమాన్యం వెల్లడించింది. నితీష్ రాణా వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని తెలిపింది.
నేడు ఒకే రోజు టీమిండియా నలుగురు స్టార్ క్రికెటర్లు పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. టీమిండియా పేస్ గన్ జస్ప్రీత్ బుమ్రా, స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్, మాజీ క్రికెటర్ ఆర్పీ సింగ్ నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్నారు.
వన్డే వరల్డ్ కప్ 2023లో సెమీ ఫైనల్ వరకూ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ ఎంత అద్భుతంగా రాణించారో అందరికీ తెలుసు. భారత్ సాధించిన అద్భుత విజయాల్లో వీళ్లు ప్రధాన పాత్ర పోషించారు. ఎన్నో కీలకమైన ఇన్నింగ్స్‌లు ఆడి.. భారత్ మిడిలార్డర్‌కు..
Team India: ఈ వరల్డ్ కప్ మెగా టోర్నీలో మొదటి నుంచి అద్భుత ప్రదర్శన కనబరుస్తూ వరుస విజయాలు నమోదు చేసిన భారత జట్టు.. తాజాగా ఆల్‌టైం రికార్డ్ నమోదు చేసింది. ఆదివారం బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియం వేదికగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఈ ఘనత సాధించింది.
IND vs NED: బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియం వేదికగా నెదర్లాండ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు ఊచకోత కోశారు. మొదటి నుంచి ఐదో బ్యాటర్ దాకా.. ప్రతి ఒక్కరూ మైదానంలో విధ్వంసం సృష్టించారు. ముఖ్యంగా.. శ్రేయస్ అయ్యర్ (128 నాటౌట్), కేఎల్ రాహుల్ (102) అయితే పరుగుల సునామీ సృష్టించారు.
వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. కీలక సమయంలో విలువైన ఇన్నింగ్స్ ఆడిన శ్రేయస్ అయ్యర్ 77 పరుగులతో సత్తా చాటాడు.
శ్రీలంకతో ముంబైలోని వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ కూడా ఫామ్‌లోకి వచ్చేశాడు. ఈ మ్యాచ్‌లో ఆరు సిక్సర్లు బాదడమే కాకుండా ఈ ప్రపంచకప్‌లోనే భారీ సిక్సర్ నమోదు చేశాడు.
ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో భారత బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఫోర్లు, సిక్సులతో పరుగుల వరద పారించారు. దాదాపు ప్రతి బ్యాటర్ సిక్సులు బాదాడు.
భారత్, ఆస్ట్రేలియా రెండో వన్డే మ్యాచ్‌ను వరుణుడు మరోసారి అడ్డుకున్నాడు. భారత్ విసిరిన 400 పరుగుల కొండంత లక్ష్య చేధనలో భాగంగా ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేస్తుండగా వర్షం వచ్చింది.