IPL 2025: 24 గంటల్లో మూడుసార్లు 97 నాటౌట్.. హిస్టరీలో ఇలాంటిది చూసుండరు
ABN , Publish Date - Mar 27 , 2025 | 11:19 AM
Quinton De Kock: క్రికెట్‌లో ఎప్పుడూ చూడని ఓ వింత ఘటన చోటుచేసుకుంది. 24 గంటల వ్యవధిలో ఏకంగా ముగ్గురు ప్లేయర్లు ఒకే స్కోరు చేసి నాటౌట్‌గా నిలిచారు. అందునా ఒకే టోర్నమెంట్‌లో ఇద్దరు ఆటగాళ్లు సేమ్ స్కోరు చేయడం విశేషం. దీని గురించి మరింతగా తెలుసుకుందాం..

క్రికెట్ అనేది ఓ ఆటే కాదు.. ఆశ్చర్యాలు, అద్భుతాలకు అడ్డా అని కూడా చెప్పొచ్చు. ఇక్కడ నమ్మశక్యం కాని ఎన్నో అరుదైన ఫీట్లు నమోదవుతుంటాయి. ప్లాన్ చేయకుండానే వింతలు, విడ్డూరాలు చోటుచేసుకుంటాయి. అలాంటి ఓ ఘటన గురించే ఇప్పుడంతా డిస్కస్ చేసుకుంటున్నారు. ఒకే రోజు ఏకంగా ముగ్గురు బ్యాటర్లు ఒకే రకమైన స్కోర్లు చేశారు. అంతేకాదు, ముగ్గురూ నాటౌట్‌గా నిలిచారు. అదీ ఛేజింగ్ చేసే టైమ్‌లోనే రన్స్ బాదారు. అలాగే తమ జట్లకు విజయాలు అందించారు. అందులో ఇద్దరు ఆటగాళ్లు ఒకే టోర్నమెంట్‌లో ఈ ఫీట్ నమోదు చేయడం మరో విశేషం. మరి.. ఎవరా ప్లేయర్లు అనేది ఇప్పుడు చూద్దాం..
వేర్వేరు జట్లకు ఆడుతూ..
టీమిండియా స్టైలిష్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్, సౌతాఫ్రికా దిగ్గజం క్వింటన్ డికాక్, న్యూజిలాండ్ సంచలనం టిమ్ సీఫర్ట్.. ఈ ముగ్గురూ ఓ అరుదైన అద్భుతానికి తెరదీశారు. వేర్వేరు జట్లకు ఆడుతూ 24 గంటల వ్యవధిలో వీళ్లు చెరో 97 రన్స్ బాదారు. ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ తరఫున బరిలోకి దిగిన అయ్యర్.. గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో 97 పరుగులతో నాటౌట్‌గా నిలిచి టీమ్‌ను గెలిపించాడు. అటు రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో కేకేఆర్ ఓపెనర్ డికాక్ 97 రన్స్‌తో నాటౌట్‌గా నిలిచి జట్టు బోణీ కొట్టడంలో కీలకపాత్ర పోషించాడు. మరోవైపు పాకిస్థాన్‌తో జరిగిన టీ20లో సీఫర్ట్ 97 నాటౌట్‌గా నిలిచి కివీస్‌కు ఘనవిజయాన్ని అందించాడు. ఇది చూసిన నెటిజన్స్.. ఇలాంటి వింతలు జరుగుతుంటేనే ఆటలో మజా మరింత పెరుగుతుందని చెబుతున్నారు. బహుశా దేవుడు రాసిన స్క్రిప్ట్ కావొచ్చని కామెంట్స్ చేస్తున్నారు.
ఇవీ చదవండి:
రోహిత్, కోహ్లీ ఆ గ్రేడ్‌లో ఉంటారా
సెపక్‌తక్రా జట్టుకు ప్రధాని అభినందన
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి