LSG vs PBKS IPL 2025: లక్నో వర్సెస్ పంజాబ్.. ఈ ఐదుగురి ఆట మిస్ అవ్వొద్దు
ABN , Publish Date - Apr 01 , 2025 | 04:25 PM
Shreyas Iyer: ఐపీఎల్‌లో మరో భీకర యుద్ధానికి అంతా సిద్ధమైంది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని పంజాబ్ కింగ్స్‌తో పంత్ కెప్టెన్సీలోని లక్నో సూపర్ జియాంట్స్ ఇవాళ తాడోపేడో తేల్చుకోనుంది. ఈ నేపథ్యంలో ఇవాళ్టి మ్యాచ్‌లో తప్పక చూడదగిన ప్లేయర్లు ఎవరు అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

గెలుపుతో జోష్‌లో ఉన్న లక్నో సూపర్ జియాంట్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య ఇవాళ టఫ్ వార్ జరగనుంది. ఇరు జట్లలోని బ్యాటర్లు సూపర్ ఫామ్‌లో ఉండటం, బౌలింగ్ యూనిట్ కూడా సమష్టిగా రాణిస్తుండటంతో నేటి మ్యాచ్ చివరి వరకు రసవత్తరంగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. నువ్వా నేనా అంటూ ఇరు టీమ్స్ ఢీ అంటే ఢీ అంటున్నాయి. ఈ నేపథ్యంలో లక్నో-పంజాబ్ పోరులో తప్పక గమనించదగిన ఆటగాళ్లు ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం..
శ్రేయస్ అయ్యర్
ఇంటర్నేషనల్ లెవల్‌లో అదరగొడుతున్న అయ్యర్.. అదే ఫామ్‌ను ఐపీఎల్‌లోనూ కంటిన్యూ చేస్తున్నాడు. తొలి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ మీద 42 బంతుల్లో 97 పరుగులు చేశాడు. అందులో 5 ఫోర్లతో పాటు ఏకంగా 9 సిక్సులు ఉన్నాయి. కెప్టెన్‌గానూ అదరగొడుతున్న అయ్యర్.. ద్వితీయ విఘ్నాన్ని దాటేందుకు తన 100 పర్సెంట్ ఇవ్వడం ఖాయం.
శశాంక్ సింగ్
పంజాబ్ పించ్ హిట్టర్ శశాంక్ సింగ్ మళ్లీ బ్యాట్‌తో వీరంగం సృష్టించేందుకు సిద్ధమవుతున్నాడు. గత మ్యాచ్‌లో 16 బంతుల్లో 44 పరుగులు చేశాడతను. సింగిల్ హ్యాండ్‌తో మ్యాచ్‌ను ముగించేయడం శశాంక్‌కు బ్యాట్‌తో పెట్టిన విద్య.
నికోలస్ పూరన్
లక్నో కీలక బ్యాటర్ పూరన్ నెక్స్ట్ లెవల్ ఫామ్‌లో ఉన్నాడు. ఎదురొచ్చిన బౌలర్లను అతడు పిచ్చకొట్టుడు కొడుతున్నాడు. అతడు గానీ క్రీజులో కుదురుకున్నాడా పంజాబ్ నుంచి ఇట్టే మ్యాచ్‌ను లాక్కొని వెళ్లిపోతాడు.
మిచెల్ మార్ష్
లక్నో ఓపెనర్ మిచెల్ మార్ష్ కూడా ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. బ్రేకుల్లేని బుల్డోజర్‌లా దూసుకెళ్తున్నాడు. ప్రత్యర్థి బౌలర్లపై బౌండరీల వర్షం కురిపిస్తున్నాడు. అతడ్ని ఆపకపోతే పంజాబ్ నుంచి మ్యాచ్ చేజారినట్లే.
అర్ష్‌దీప్ సింగ్
పంజాబ్ టీమ్‌లో మ్యాచ్‌ను మలుపు తిప్పే బౌలర్లు చాలా మందే ఉన్నారు. అయితే అందరి కంటే కూడా లీథల్ పేసర్ అర్ష్‌దీప్ చాలా కీలకం. లాస్ట్ మ్యాచ్‌లో అతడు 2 వికెట్లు పడగొట్టాడు. ఎకనామికల్‌గానూ బౌలింగ్ చేశాడు. అర్ష్‌దీప్‌తో లక్నో బ్యాటింగ్ ఆర్డర్ జాగ్రత్తగా ఉండాల్సిందే.
ఇదీ చదవండి:
లక్నోతో పంజాబ్ ఢీ.. ప్రిడిక్షన్ ఇదే..
చార్జీకు డబ్బుల్లేవ్.. కట్ చేస్తే ఐపీఎల్ హీరో
కోహ్లీ టార్గెట్ తెలిస్తే మైండ్‌బ్లాంక్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం చదవండి