Home » Shubman Gill
డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్న టీమిండియా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఇప్పట్లో కోలుకునేలా కనిపించడం లేదు. ప్రపంచకప్‌లో భాగంగా ఇప్పటికే ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి మ్యాచ్‌కు దూరమైన గిల్.. బుధవారం ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో కూడా ఆడడం లేదు.
సెప్టెంబర్ నెలకు గాను టీమిండియా యువ ఆటగాళ్లు మహ్మద్ సిరాజ్, శుభ్‌మన్ గిల్ ఐసీసీ పురుషుల ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు నామినేట్ అయ్యారు. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మంగళవారం అధికారికంగా ప్రకటించింది.
వన్డే ప్రపంచకప్‌లో టీమిండియాకు భారీ షాక్ తగిలింది. స్టార్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌కు సోకిన డెంగ్యూ జ్వరం ఇప్పట్లో తగ్గేలా లేదు. ఆరోగ్యం విషమించడంతో గిల్‌ను చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు.
వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ఆఫ్ఘనిస్థాన్‌తో మ్యాచ్‌కు ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలే ఉంది. డెంగ్యూ జ్వరం కారణంగా ఇప్పటికే ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌కు స్టార్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ దూరమైన సంగతి తెలిసిందే.
వన్డే ప్రపంచకప్‌లో ఆదివారం నుంచి టీమిండియా ప్రయాణం మొదలుకానుంది. తొలి మ్యాచ్‌లో భారత జట్టు 5 సార్లు ఛాంపియన్ ఆస్ట్రేలియాతో తలపడనుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందే టీమిండియాకు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి.
భారత్ వేదికగా క్రికెట్ సంరంభం ‘క్రికెట్ వరల్డ్ కప్ 2023’ (Cricket World Cup 2023) మొదలైంది. ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లంగ్పై న్యూజిలాండ్ గెలిచి శుభారంభం చేసింది. ఇక ఆతిథ్య భారత్ అక్టోబర్ 8న చెన్నై వేదికగా తొలి పోరులో ఆస్ట్రేలియాతో తలపడబోతోంది.
ఏషియన్ గేమ్స్ 2023 క్వార్టర్ ఫైనల్ 1లో నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ సెంచరీతో విశ్వరూపం చూపించాడు. 8 ఫోర్లు, 7 సిక్సులతో 49 బంతుల్లోనే 100 పరుగులు బాదేశాడు. ఈ క్రమంలో టీమిండియా స్టార్ ప్లేయర్ శుభ్‌మన్ గిల్ రికార్డును జైస్వాల్ బద్దలు కొట్టాడు.
ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో భారత బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఫోర్లు, సిక్సులతో పరుగుల వరద పారించారు. దాదాపు ప్రతి బ్యాటర్ సిక్సులు బాదాడు.
భారత్, ఆస్ట్రేలియా రెండో వన్డే మ్యాచ్‌ను వరుణుడు మరోసారి అడ్డుకున్నాడు. భారత్ విసిరిన 400 పరుగుల కొండంత లక్ష్య చేధనలో భాగంగా ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేస్తుండగా వర్షం వచ్చింది.
ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు పరుగుల వరద పారించారు. బ్యాటింగ్‌కు అనుకూలించిన పిచ్‌పై ఆకాశమే హద్దుగా చెలరేగిన భారత ఆటగాళ్లు సునాయసంగా సెంచరీలు, హాఫ్ సెంచరీలతో రెచ్చిపోయారు.