Home » Skill Development Case
విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబు పీటీ వారెంట్లపై రైట్ ఆఫ్ ఆడియన్స్ పిటిషన్‌ను ఏసీబీ కోర్టు కొట్టివేసింది. గత వారం రైట్ ఆఫ్ ఆడియన్స్ పిటిషన్‌పై కోర్టు విచారణ నిర్వహించింది. పీటీ వారెంట్లపై విచారణ చేపట్టబోయే ముందు తమ వాదనలు వినాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు రైట్ ఆఫ్ ఆడియన్స్ పిటిషన్ వేశారు.
టీడీపీ అధినేత నారా చంద్రబాబుపై (Chandrababu) సీఐడీ అక్రమంగా బనాయించిన స్కిల్ డెవలప్మెంట్ కేసులో (Skill Development Case) క్వాష్ పిటిషన్‌పై రెండ్రోజులుగా సుప్రీంకోర్టులో (Supreme Court) విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే...
టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు అక్రమ అరెస్ట్‌తో (Chandrababu Arrest) ఏపీలో రాజకీయ పరిణామాలు ఎలా మారిపోయాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.!
స్కిల్ డెవలప్‌మెంట్ అక్రమ కేసులో మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై విచారణ శుక్రవారానికి వాయిదా పడింది. శుక్రవారం మధ్యాహ్నం గం. 2.00కు తదుపరి విచారణ జరుగుతుందని కోర్ట్ వెల్లడించింది.
సుప్రీంకోర్టులో చంద్రబాబు ఎస్ఎల్‌పీపై సోమవారం వాదనలు ముగిశాయి. సోమవారం చంద్రబాబు తరపున న్యాయవాది హరీష్ సాల్వే రెండున్నర గంటలకుపైగా వాదనలు వినిపించారు. అయితే.. చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై రేపు (మంగళవారం) కూడా విచారణ కొనసాగనుంది.
టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబుపై (Nara Chandrababu) సీఐడీ (CID) అక్రమంగా స్కిల్ కేసు (Skill Case) బనాయించి అరెస్ట్ చేసి నేటికి నెలరోజులయ్యింది. ఇప్పటికే తాను నిర్దోషిని అని నిరూపించుకోవడానికి కింది స్థాయి నుంచి దేశ అత్యున్న న్యాయస్థానం సుప్రీంకోర్టు వరకూ చంద్రబాబు న్యాయపోరాటం చేస్తున్నారు..
టీడీపీ అధినేత చంద్రబాబుకు (Nara Chandrababu Naidu) సోమవారం బెయిల్ (Bail) వస్తుందా?.. రాదా అనే ఉత్కంఠకు తెరపడింది. చంద్రబాబు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌ను విజయవాడ ఏసీబీ కోర్ట్ కొట్టివేసింది. సీఐడీ దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌ను కూాడా తోసిపుచ్చింది. కాగా ఈ రోజు ఉదయం ఏపీ హైకోర్టులో కూడా చంద్రబాబుకు నిరాశే ఎదురైంది. అంగళ్లు అల్లర్లు, ఇన్నర్ రింగ్ రోడ్, ఫైబర్ నెట్ కేసుల్లో ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లను కోర్ట్ కొట్టివేసిన విషయం తెలిసిందే.
స్కిల్ డెవలప్‌మెంట్ (Skill Development) అక్రమ కేసులో రిమాండ్ ఉన్న తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ పిటిషన్ దాఖలు చేసిన మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి మరోసారి నిరాశ ఎదురైంది.
టీడీపీ అధినేత చంద్రబాబుకు సోమవారం బెయిల్ వస్తుందా.. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలవుతారా.. ఆయన్ను మరోసారి పోలీసు కస్టడీకి పంపుతారా అన్న ఉత్కంఠ దేశవిదేశాల్లోని తెలుగు ప్రజల్లో నెలకొంది. బెయిల్ కోసం ఆయన హైకోర్టు, ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపైన, సీఐడీ విజయవాడ ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌పైన సోమవారం తీర్పులు వెలువడనున్నాయి.
టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబుకు (Nara Chandrababu) అక్టోబర్-09 అత్యంత కీలకం కానుంది. బాబుపై సీఐడీ (CID), పోలీసులు దాఖలు చేసిన పిటిషన్లతో పాటు..