CBN Arrest : చంద్రబాబు అరెస్ట్‌పై మొన్న అమిత్ షా.. నిన్న గవర్నర్ రియాక్షన్.. ఇక ఏం జరగబోతోంది..!?

ABN , First Publish Date - 2023-10-10T18:27:58+05:30 IST

టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు అక్రమ అరెస్ట్‌తో (Chandrababu Arrest) ఏపీలో రాజకీయ పరిణామాలు ఎలా మారిపోయాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.!

CBN Arrest : చంద్రబాబు అరెస్ట్‌పై మొన్న అమిత్ షా.. నిన్న గవర్నర్ రియాక్షన్.. ఇక ఏం జరగబోతోంది..!?

టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు అక్రమ అరెస్ట్‌తో (Chandrababu Arrest) ఏపీలో రాజకీయ పరిణామాలు ఎలా మారిపోయాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.! ఈ వ్యవహారంపై తెలుగు రాష్ట్రాల్లోనే (Telugu States) కాదు.. యావత్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు, ప్రముఖులు, సినీ-రాజకీయ ప్రముఖులు సైతం స్పందించి.. జగన్ ప్రభుత్వంపై (Jagan Govt) తీవ్ర స్థాయిలో దుమ్మెత్తిపోస్తున్నారు. మరోవైపు.. ప్రభుత్వం తీరును ఖండిస్తూ నిరాహార దీక్షలు, ర్యాలీలు, మోత మోగిద్దాం, కాంతితో క్రాంతి ఇలా నిత్యం ఏదో కార్యక్రమంతో టీడీపీ శ్రేణులు ముందుకెళ్తున్నాయి. ఒక్క ఏపీలోనే కాదు.. ప్రపంచ దేశాల్లో ఉన్న తెలుగు ప్రజలంతా టీడీపీ (TDP) పిలుపునిచ్చిన కార్యక్రమాల్లో పాల్గొని చంద్రబాబుకు మద్దతుగా నిలుస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం (Modi Govt) సైతం ఒకింత ఉలిక్కిపడిన పరిస్థితి కనిపించిందనే టాక్ గట్టిగానే నడుస్తోంది. బాబును టచ్ చేయడం అంత ఆషామాషీ కాదని.. ఆయన తప్పు చేయరు.. చేయనివ్వరని.. నిత్యం ప్రజలు, అభివృద్ధి గురించి ఆలోచనతోనే ఉండే వ్యక్తి స్కామ్‌లు ఎందుకు చేస్తారన్నది టీడీపీ చెబుతున్న మాటలు. చంద్రబాబు అరెస్ట్ వెనుక కేంద్ర హస్తం ఉందని.. మోదీ సర్కార్ అండతోనే ఏపీ సీఎం వైఎస్ జగన్ రెడ్డి రాష్ట్ర స్థాయిలోని వ్యవస్థలను భ్రష్టుపట్టిస్తా ఆడుకుంటున్నారనే ఆరోపణలు కోకొల్లలు. ఇక సోషల్ మీడియాలో (Social Media) అయితే వైసీపీ వర్సెస్ టీడీపీగా (YSRCP Vs TDP) పరిస్థితులు నెలకొన్నాయి. ఇవన్నీ అటుంచితే చంద్రబాబు అరెస్టుపై కేంద్రం నుంచి హోం మంత్రి అమిత్ షా (Amit Shah).. రాష్ట్రం నుంచి గవర్నర్ అబ్దుల్ నజీర్ (Abdul Nazeer) స్పందించారు. ఇంతకీ వారేం మాట్లాడారు..? స్పందనతోనే సరిపెట్టుకుంటారా..? ఏం చేయబోతున్నారు..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలపై ‘ ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ (ABN Andhrajyothy) ప్రత్యేక కథనం..


CBN-Arrest.jpg

షా ఏమన్నారు..?

ఏపీ సీఎం వైఎస్ జగన్ రెడ్డి ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. షాతో భేటీ సందర్భంగా ఏపీలో అసలేం జరుగుతోంది..? అని రాష్ట్ర పరిణామాలపై ఆయన ఆరా తీసినట్లుగా తెలియవచ్చింది. బాబు అరెస్టు పర్యవసానాలపై నేరుగా జగన్‌తోనే హోం మంత్రి మాట్లాడేశారు. ప్రజల్లో బాబుపై పెరిగిన సానూభూతి, జగన్‌పై వచ్చిన వ్యతిరేకతపై చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. అరెస్ట్ వెనుక బీజేపీ పెద్దలు ఉన్నారంటూ జరుగుతున్న ప్రచారంపై కూడా షా ఆందోళన చెందారు. దీంతో పాటు టీడీపీ ఎంపీలు లేఖ రాయడం, ఢిల్లీలో లోకేష్ రాష్ట్రపతిని కలిసి బాబు అరెస్టుపై ఫిర్యాదు చేయడం ఇవన్నీ కూడా భేటీలో ప్రస్తావనకు వచ్చాయని సమాచారం. సుమారు అరగంటసేపు షా-జగన్ మధ్య మాటామంతి జరిగినా చంద్రబాబు గురించే సుమారు 15 నిమిషాలపాటు చర్చించారట. ఫైనల్‌గా సమావేశం అసంతృప్తిగానే జరిగిందని వైసీపీ శ్రేణులే లోలోపల చెప్పుకుంటున్న పరిస్థితి. వాస్తవానికి జగన్ ఏదో చర్చించాలని వెళితే.. ఇలా సీన్ మొత్తం రివర్స్ అయ్యిందట.

Amit-Shah-and-Jagan.jpg

గవర్నర్ ఏమన్నారు..?

చంద్రబాబు అరెస్టయిన మరుక్షణం నుంచి ఇవాళ్టి వరకూ ఎక్కడ చూసినా ఏపీ గవర్నర్ నజీర్ అహ్మద్ గురించే చర్చ. బాబుపై కేసు నమోదు, అరెస్టుకు గవర్నర్‌ అనుమతి అవసరమా? లేదా? దీనిపైనే చర్చ సాగుతూనే ఉంది. ఈ వ్యవహారంపైనే విజయవాడ ఏసీబీ కోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు వాదనలు కొనసాగుతున్నాయి. అయినా సరే... ఇప్పటిదాకా ప్రభుత్వం గవర్నర్‌ నజీర్‌ అహ్మద్‌ను దీనిపై సంప్రదించనేలేదు. కేసు వివరాలను కనీసం ప్రస్తావించలేదు. అలాంటిది.. సోమవారం అకస్మాత్తుగా ఉన్నతాధికారులు రాజ్‌భవన్‌కు పరుగులు తీశారు. గవర్నర్‌ నుంచి పిలుపు రావడమే దీనికి కారణమని తెలుస్తోంది. అది కూడా... ‘అదా అసలు సంగతి’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక ప్రచురించిన మరుసటి రోజే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. స్కిల్‌ ప్రాజెక్టులో చంద్రబాబుపై సీఐడీ పెట్టింది డొల్ల కేసని, గవర్నర్‌ ‘నో’ అంటారు కాబట్టే ఆయన ముందస్తు అనుమతి కోరలేదని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. ఇంతకూ ఈ వ్యవహారంలో ఏం జరిగింది? ప్రభుత్వం తనను ఎందుకు అనుమతి కోరలేదు? దాని వెనక ఉన్న కారణాలు ఏమిటి? అని తెలుసుకోవాలని భావించిన గవర్నర్‌ .. సంబంధిత అధికారులంతా వచ్చి తనకు వివరణ ఇవ్వాలని ఆదేశించారు. దీంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌ రెడ్డి, సీఐడీ చీఫ్‌ సంజయ్‌, అడ్వొకేట్‌ జనరల్‌ శ్రీరామ్‌ సుబ్రమణ్యం, అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ పొన్నవోలు సుధాకర్‌ రెడ్డి సోమవారం నాడు సాయంత్రం ఆరు గంటలకు రాజ్‌భవన్‌కు హుటాహుటిన పరుగులు తీశారు. తమకు సహాయకంగా ఒక ఇంటెలిజెన్స్‌ ఎస్పీ, సీఐడీ డీఎస్సీని కూడా తీసుకెళ్లి కేసు గురించి నిశితంగా వివరించారట.

Gov-and-Jagan.jpg

ఏం జరగబోతోంది..?

విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. బాబు అరెస్టుపై అటు కేంద్ర హోం మంత్రి.. ఇటు గవర్నర్ ఇద్దరూ వీలైనంత త్వరలో ప్రభుత్వం నుంచి నివేదికలు తెప్పించేందుకు సన్నాహులు చేస్తున్నట్లు తెలియవచ్చింది. ఏపీ ప్రభుత్వాన్ని షా.. రాష్ట్ర ఉన్నతాధికారులను గవర్నర్.. అసలేం జరిగింది..? కేసు పూర్వపరాలేంటి..? అరెస్ట్ చేసిన తీరు..? ఎందుకు గవర్నర్ అనుమతి తీసుకోలేదు..? రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎందుకిలా క్షీణించిపోయాయి..? కొన్ని వ్యవస్థలను ప్రభుత్వం ఎందుకింతలా సర్వ నాశనం చేస్తోంది..? ఇలా ప్రతి విషయంపైన పిన్ టూ పిన్ వివరాలను నివేదిక రూపంలో ఇవ్వాలని ప్రభుత్వాన్ని గవర్నర్, షా అడగబోతున్నారట. ఇదేగానీ జరిగితే ఏపీ ప్రభుత్వం పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు, న్యాయ నిపుణులు చెబుతున్నారు. హోం మంత్రి, గవర్నర్ రియాక్ట్ అయ్యారు సరే.. త్వరలోనే నివేదికలు తీసుకుంటారు సరే.. తర్వాత ఏం జరగబోతోందనే దానిపై అటు టీడీపీలో సర్వత్రా ఆసక్తి నెలకొనగా.. వైసీపీలో మాత్రం టెన్షన్ మొదలైందనే టాక్ నడుస్తోంది. మొత్తానికి చూస్తే త్వరలోనే ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామమే జరుగుతుందని మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది. ఆ కీలక పరిణామం ఏంటనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగకు తప్పదేమో మరి.

CBN-JAGAN.jpg


ఇవి కూడా చదవండి


NCBN Case : చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో తీర్పు ఎప్పుడొస్తుంది..!?



TS Assembly Polls 2023 : తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయ్యాక.. బీఆర్ఎస్ కీలక ప్రకటనలు


Updated Date - 2023-10-10T18:36:24+05:30 IST