Chandrababu: బాబుకు బెయిల్‌పై అంతటా ఉత్కంఠ!

ABN , First Publish Date - 2023-10-09T07:05:50+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబుకు సోమవారం బెయిల్‌ వస్తుందా.. రాజమండ్రి సెంట్రల్‌ జైలు నుంచి విడుదలవుతారా.. ఆయన్ను మరోసారి పోలీసు కస్టడీకి పంపుతారా అన్న ఉత్కంఠ దేశవిదేశాల్లోని తెలుగు ప్రజల్లో నెలకొంది. బెయిల్‌ కోసం ఆయన హైకోర్టు, ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్లపైన, సీఐడీ విజయవాడ ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌పైన సోమవారం తీర్పులు వెలువడనున్నాయి.

Chandrababu: బాబుకు బెయిల్‌పై అంతటా ఉత్కంఠ!

అమరావతి, అక్టోబరు 8(ఆంధ్రజ్యోతి): టీడీపీ అధినేత చంద్రబాబుకు(Nara Chandrababu Naidu) సోమవారం బెయిల్‌(Bail) వస్తుందా.. రాజమండ్రి సెంట్రల్‌ జైలు నుంచి విడుదలవుతారా.. ఆయన్ను మరోసారి పోలీసు కస్టడీకి పంపుతారా అన్న ఉత్కంఠ దేశవిదేశాల్లోని తెలుగు ప్రజల్లో నెలకొంది. బెయిల్‌ కోసం ఆయన హైకోర్టు, ఏసీబీ కోర్టు(ACB Court)లో దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్లపైన, సీఐడీ విజయవాడ ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌పైన సోమవారం తీర్పులు వెలువడనున్నాయి. అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు (IRR), ఫైబర్‌నెట్‌, అంగళ్లు ఘటనలకు సంబంధించి హైకోర్టులో చంద్రబాబు వేర్వేరుగా దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్లపై న్యాయమూర్తి జస్టిస్‌ కె.సురేశ్‌రెడ్డి సోమవారం నిర్ణయాన్ని వెల్లడించనున్నారు.


అలాగే స్కిల్‌ డెవల్‌పమెంట్‌(Skill Development) వ్యవహారంలో జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్న తనకు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై ఏసీబీ కోర్టు తీర్పు వెలువరించనుంది. దీంతో పాటు టీడీపీ అధినేతను మరోసారి పోలీసు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌పైనా నిర్ణయం ప్రకటించనుంది. కాగా.. స్కిల్‌ డెవల్‌పమెంట్‌ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు(Supreme Court)లో సోమవారమే విచారణ జరుగనుంది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 17 (ఏ) చంద్రబాబుకు వర్తిస్తుందా లేదా అనే విషయంపై సుప్రీంకోర్టు ఇచ్చే ఉత్తర్వులు టీడీపీ అధినేతపై దాఖలైన ఇతర కేసులపైనా ప్రభావం చూపనున్నాయి. దీంతో సోమవారం ఆయనకు, టీడీపీకి, ప్రభుత్వానికి కూడా అత్యంత కీలకంగా మారింది.

Updated Date - 2023-10-09T07:07:19+05:30 IST