Home » Sonia Gandhi
Telangana: తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఈరోజు(గురువారం) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకార మహోత్సవానికి కాంగ్రెస్ అధిష్టాన పెద్దలు హాజరుకానున్నారు. ఇందులో భాగంగా ఈరోజు ఉదయం కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు చేరుకున్నారు.
నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరుణంలో పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కీలక సమావేశం ఏర్పాటు చేశారు. పార్లమెంటరీ కమిటీ సమావేశాన్ని సోమవారం సాయంత్రం 5.30 గంటలకు 10 జన్‌పథ్ నివాసంలో ఏర్పాటు చేశారు.
Telangana: తెలంగాణ ఎన్నికల ఫలితాలు ముగిశాయి. కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఇక తెలంగాణ సీఎం ఎవరనే ప్రశ్న మొదలైంది. కాంగ్రెస్ సీఎం అభ్యర్థిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో ఈరోజు (సోమవారం) ఉదయం సీఎల్పీ సమావేశం జరుగగా.. సీఎల్పీ నేతగా ఎవరు ఉండాలని దానిపై అధిష్టానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిర్ణయించారు.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే రాజకీయ ప్రయాణంపై రచించిన ''మల్లికార్జున్ ఖర్గే: పొలిటికల్ ఎంగేజ్మెంట్ విత్ కంపాషన్, జస్టిస్ అండ్ ఇన్‌క్లూజివ్ డవలప్మెంట్'' పుస్తకాన్ని కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ బుధవారంనాడిక్కడ అవిష్కరించారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి కేటీఆర్(Minister KTR) రోడ్ షోలో అంబర్‌పేట అలీకేఫ్ చౌరస్తాలో సాగింది. రోడ్ షోలో పాల్గొన్న
తెలంగాణలో కాంగ్రెస్ ( Congress ) గెలుపు దేశ రాజకీయాల్లో మార్పుకు నాంది కావాలని ఖమ్మం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు ( Thummala NageswaraRao ) వ్యాఖ్యానించారు. సోమవారం నాడు శేరిలింగంపల్లి కాంగ్రెస్ అభ్యర్థి జగదీశ్వర్‌గౌడ్ ( Jagdeeswar Gowd ) తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
కేసీఆర్ పది సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉండి రెండు చోట్ల ఎందుకు పోటీ చేస్తున్నాడని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి. హనుమంతరావు ప్రశ్నించారు. తిరుమలాయపాలెం మండలం ఎలువారిగూడెం పాలేరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా వీహెచ్ మాట్లాడుతూ.. కేసీఆర్ తెలంగాణని బ్రాందీ షాపుల్లో నంబర్ వన్ చేశాడన్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రం కావడం, ఉదయమైతే విషపూరిత పొగమంచు కమ్మేస్తుండటంతో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అప్రమత్తమయ్యారు. శ్వాసకోశ సమస్యలు ఎదుర్కొంటున్న ఆమె వైద్యుల సలహా మేరకు జైపూర్‌కు తాత్కాలికంగా మకాం మార్చారు.
రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ కుటుంబం బాగుపడాలని తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా ఇవ్వలేదన్నారు.
ఐదు గ్యారంటీలను కర్నాటకలో అమలు చేసి చూపించామని కాంగ్రెస్ సీనియర్ నేత, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ( DK Sivakumar ) స్పష్టం చేశారు.