Thummala: తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు దేశ రాజకీయాల్లో మార్పుకు నాంది కావాలి
ABN , First Publish Date - 2023-11-27T20:01:12+05:30 IST
తెలంగాణలో కాంగ్రెస్ ( Congress ) గెలుపు దేశ రాజకీయాల్లో మార్పుకు నాంది కావాలని ఖమ్మం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు ( Thummala NageswaraRao ) వ్యాఖ్యానించారు. సోమవారం నాడు శేరిలింగంపల్లి కాంగ్రెస్ అభ్యర్థి జగదీశ్వర్‌గౌడ్ ( Jagdeeswar Gowd ) తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ( Congress ) గెలుపు దేశ రాజకీయాల్లో మార్పుకు నాంది కావాలని ఖమ్మం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు ( Thummala NageswaraRao ) వ్యాఖ్యానించారు. సోమవారం నాడు శేరిలింగంపల్లి కాంగ్రెస్ అభ్యర్థి జగదీశ్వర్‌గౌడ్ ( Jagdeeswar Gowd ) తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ...‘‘సెటిలర్స్ అనే మాట తీసేయండి ఇది మన గడ్డ...ఇక్కడే జీవిస్తున్నాం.. ఎవడబ్బ సొత్తు కాదు. పూజ్యులు ఎన్టీఆర్ సంక్షేమ రాజ్యం....రామరాజ్యం చూశాం. రామరాజ్యం అంటే ఎన్టీఆర్ రాజ్యం. ఎన్టీఆర్ ఆత్మ గౌరవ రాజకీయాలు నేర్పితే ..ఆత్మ విశ్వాస రాజకీయాలు చంద్రబాబు నేర్పారు. చంద్రబాబు నాయకత్వంలోనే హైదరాబాద్ అభివృద్ధి చెందుతుంది’’ అని తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.
హైదరాబాద్‌కు విశ్వనగరంగా చంద్రబాబు పునాది వేశారు
‘‘ఐ.టీ టవర్స్, ఔటర్ రింగు రోడ్డు, శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ఇన్‌ఫ్రాతో విశ్వనగరంగా చంద్రబాబు పునాది వేశారు. 2020 విజన్‌తో ఉమ్మడి రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారు. రాజకీయంగా నష్టపోయినా తెలంగాణ ఏర్పాటులో సోనియా గాంధీ చరిత్రలో నిలిచారు. తెలంగాణలో అహంకారం దోపిడీ మాఫియా కబ్జా రాజ్యంగా మారింది. ప్రజా ప్రతినిధులు మాఫియాగా మారారు. పోలీస్‌లను ఎమ్మెల్యేలకు అప్పజెప్పారు. ప్రజాస్వామిక తెలంగాణ కోసం మార్పు కోరుతున్నారు. ఓ కుటుంబం నుంచి తెలంగాణకు విముక్తి కోసం కాంగ్రెస్ పార్టీనే ఈ ఎన్నికల్లో గెలిపించాలి. ఈ ఎన్నికలు చారిత్రకమైనవి. మాట తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేసిన సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలి. జగదీశ్వర్‌గౌడ్‌ను ఈ ఎన్నికల్లో గెలిపించాలి’’ అని తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు.
మరిన్ని పోరు తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి