Home » Sonia Gandhi
సెప్టెంబర్17న కాంగ్రెస్ లోకి భారీ చేరికలు ఉండనున్నాయి. కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ సమక్షంలో అధికార పార్టీకి చెందిన బడా నేతలు కాంగ్రెస్‌లో చేరనున్నారు. సెప్టెంబర్ 17న కాంగ్రెస్ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. సభా వేదికపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ప్రసంగించనున్నారు.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు (TS Assembly Elections) సమీపిస్తున్న కొద్దీ రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయ్!. బీఆర్ఎస్లో (BRS) టికెట్ దక్కని ముఖ్యనేతలు, సిట్టింగులంతా పక్క చూపులు చూస్తున్నారు. దీంతో రోజురోజుకూ పొలిటికల్ హీట్ పెరిగిపోతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే రాష్ట్ర రాజకీయాలు బీఆర్ఎస్, కాంగ్రెస్ చుట్టూనే తిరుగుతున్నాయి..
సనాతన ధర్మం మలేరియా, డెంగ్యూ, కరోనా, ఎయిడ్స్, కుష్టు రోగం వంటిదని డీఎంకే నేతలు ఆరోపిస్తుండటంపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ స్పందించడం లేదేమని ప్రశ్నిస్తోంది.
ప్రధాని నరేంద్ర మోదీకి రాసిన లేఖలో మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి ఎందుకు ప్రస్తావించలేదని కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సూటిగా ప్రశ్నించారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi)కి కాంగ్రెస్ అగ్ర నేత సోనియా గాంధీ (Sonia Gadhi) బుధవారం ఓ లేఖ రాశారు. ఈ నెల 18 నుంచి 22 వరకు జరిగే ప్రత్యేక పార్లమెంటు సమావేశాల ఎజెండాను వెల్లడించాలని కోరారు.
పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కాంగ్రెస్ పార్లమెంటరీ స్ట్రాజజీ గ్రూప్ మంగళవారంనాడు సమావేశం కానుంది. దీనికి ఆ పార్టీ పార్లమెంటరీ చైర్పర్సన్ సోనియాగాంధీ అధ్యక్షత వహించనున్నారు.
కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియాగాంధీ ఆదివారంనాడు అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారు. స్వల్పంగా జ్వరం రావడంతో ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని, వైద్యుల పర్యవేక్షణలో చికిత్స జరుగుతోందని సన్నిహిత వర్గాలు తెలిపాయి.
పార్టీ విలీనంపై కాంగ్రెస్‌తో చర్చలు తుది దశకు వచ్చాయని వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల తెలిపారు. రాజశేఖరరెడ్డిని అపారంగా గౌరవిస్తున్నారు కాబట్టే.. సోనియా, రాహుల్‌తో చర్చలు వరకూ వెళ్ళానన్నారు. వైఎస్ పేరును ఎఫ్ఐఆర్లో చేర్చటం సోనియాకు తెలియక చేసిన పొరపాటే కానీ.. తెలిసి చేసిన తప్పు కాదని షర్మిల పేర్కొన్నారు.
లోక్ సభ, శాసన సభల ఎన్నికలను ఒకేసారి నిర్వహించడం కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై ప్రతిపక్ష ఇండియా కూటమి ఆగ్రహం వ్యక్తం చేసింది. మోదీ ప్రభుత్వ చర్యలు సమాఖ్య నిర్మాణానికి ముప్పు కలిగిస్తాయని దుయ్యబట్టింది.
న్యూఢిల్లీ: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల.. కాంగ్రెస్ అగ్ర నేత సోనియా గాంధీతో గురువారం ఉదయం ఢిల్లీలో జరిగిన భేటీ ముగిసింది. షర్మిల వెంట బ్రదర్ అనిల్ కూడా వెళ్లారు. తాజా రాజకీయాలపై సోనియాతో చర్చలు జరిగినట్లు సమాచారం.