Home » Sonia Gandhi
కర్ణాటక(Karnataka )లో కాంగ్రెస్(Congress ) ప్రభుత్వం ఏర్పడిన 2 నెలల్లోనే మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య తలెత్తిన విభేదాలపై ఆ పార్టీ అధిష్ఠానం కన్నెర్ర జేసింది.
కాంగ్రెస్ ప్రథమ కుటుంబం ఇటీవల మహిళా రైతులతో ఆనందంగా గడిపింది. ఢిల్లీలోని సోనియా గాంధీ నివాసం పెళ్లివారి ఇల్లులా కళకళలాడింది. సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ వాద్రా గ్రామీణ మహిళలతో ఆప్యాయంగా ముచ్చటించారు. వారితో కలిసి భోజనం చేస్తూ, కలుపుగోలుగా మాట్లాడుతూ, వారి కష్టసుఖాలను తెలుసుకున్నారు.
ప్రతిపక్ష పార్టీల INDIA కూటమిపై అమిత్ షా చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి. హనుమంతరావు అన్నారు. ప్రధాని పదవి త్యాగం చేసిన నాయకురాలు సోనియా గాంధీ అని కొనియాడారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలని సోనియా అనుకుంటే ఆ రోజు చేసి ఉండేవారన్నారు.
లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి దూరం కావాలని భావిస్తున్న కాంగ్రెస్ అగ్రనేత్రి సోనియాగాంధీ కర్ణాటక రాష్ట్రం నుంచి రాజ్యసభకు నామినేట్ అవుతారని రెండుమూడు రోజులుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అనారోగ్య కారణంతో 2024 లోక్‌సభ ఎన్నికల్లో సోనియాగాంధీ పోటీ చేసే అవకాశం ఉండదని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఈ మేరకు కర్ణాటక నుంచి రాజ్యసభకు ఎంపిక చేసుకోవాలని సీఎం సిద్దరామయ్య విన్నవించినట్టు తెలుస్తోంది.
పార్లమెంటు వర్షాకాల సమావేశాల తొలి రోజైన గురువారం మణిపూర్ హింసాకాండ, అమానవీయ ఘటనలపై నిరసనలతో ఉభయ సభలు దద్దరిల్లాయి. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించినట్లు కనిపిస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవడంతో ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) గురువారం కాంగ్రెస్ అగ్ర నేత సోనియా గాంధీ (Sonia Gandhi)ని పార్లమెంటులో మర్యాదపూర్వకంగా కలిశారు. ఆమె కూర్చున్న చోటుకు వెళ్లి, ఆమె ఆరోగ్యం, క్షేమ సమాచారాలను అడిగి తెలుసుకున్నారు.
రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని గద్దెదింపడమే లక్ష్యంగా బెంగళూరులో మంగళవారం సమావేశమైన ప్రతిపక్ష నేతల భేటీలో ముఖ్యమం
తెలంగాణలో ‘పవర్’ పాలిటిక్స్ (TS Power Politics) నడుస్తోంది. 24 గంటలు కరెంట్ ఇస్తున్నామని బీఆర్ఎస్ (BRS) .. అస్సలు ఇవ్వట్లేదని కాంగ్రెస్ (Congress) ఆధారాలతో సహా నిరూపించింది. అయినప్పటికీ బీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్య పవర్ వార్‌కు (Power War) ఫుల్స్టాప్ పడలేదు..
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీపై మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు అర్ధరహితమని ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. రాహుల్ గాంధీపై కేటీఆర్ వ్యాఖ్యలు అర్థరహితమన్నారు. రాహుల్ గాంధీ పై విమర్శలు చేసే స్థాయి కేటీఆర్‌కు లేదన్నారు. రాహుల్ గాంధీని అనే ముందు .. కేటీఆర్‌కు వ్యవసాయం గురించి ఏం తెలుసో చెప్పాలన్నారు. ఒక వేలు రాహుల్ గాంధీ వైపు చూపిస్తే .. నాలుగు వేళ్లు మీ వైపు చూపుతున్నాయని తెలుసుకోవాలని పొంగులేటి హితవు పలికారు.
నేడు, రేపు బెంగళూరులో జరగనున్న విపక్షాల సమావేశంలో పాల్గొనడానికి కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ కాసేపటి క్రితం ఢిల్లీలోని తమ నివాసం నుంచి బయలుదేరారు. మధ్యాహ్నం వరకు వారు బెంగళూరు చేరుకోనున్నారు. సోనియా, రాహుల్ గాంధీనే కాకుండా సమావేశంలో పాల్గొనే ఇతర విపక్ష నేతలు కూడా మధ్యాహ్నం వరకు బెంగళూరుకు చేరుకోనున్నారు.