Home » South Africa
వన్డే క్రికెట్లో కొంత కాలంగా సౌతాఫ్రికా రెచ్చిపోతోంది. ఫస్ట్ బ్యాటింగ్ వస్తే చాలు ఆ జట్టు బ్యాటర్లు పూనకాలు వచ్చినట్టుగా చెలరేగుతున్నారు. దీంతో ఆ జట్టు మొదట బ్యాటింగ్ చేసినప్పుడు వరుసగా 6 వన్డేల్లో 300కు పైగా పరుగులు సాధించడం విశేషం.
వన్డే ప్రపంచకప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. గత మ్యాచ్‌లో ఆప్ఘనిస్తాన్ చేతిలో 69 పరుగుల తేడాతో ఓడిన ఇంగ్లండ్.. ఈరోజు దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 229 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.
వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ముంబై వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా భారీ స్కోరు చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 399 పరుగులు చేసింది.
గత మ్యాచ్‌లో పసికూన ఐర్లాండ్ చేతిలో అనూహ్య రీతిలో ఓడి షాక్‌లో ఉన్న సౌతాఫ్రికాకు ఇంతలోనే మరో ఎదురుదెబ్బ తగిలింది. కీలకమైన ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు ఆ జట్టు కెప్టెన్ తెంబా బవుమా దూరమయ్యాడు.
నెదర్లాండ్స్ టీమ్ సఫారీలకు షాక్ ఇవ్వడం ఇది తొలిసారి కాదు. గత ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌లోనూ దక్షిణాఫ్రికా జట్టును నెదర్లాండ్స్ ఓడించింది.
ధర్మశాలలో నెదర్లాండ్స్-దక్షిణాఫ్రికా మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా ఇంకా ప్రారంభం కాలేదు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా ఫీల్డింగ్ ఎంచుకుంది.
వన్డే ప్రపంచకప్‌లో మరోసారి దక్షిణాఫ్రికా భారీ స్కోరు చేసింది. శ్రీలంకపై 428 పరుగులు చేసిన సఫారీ జట్టు ఇప్పుడు ఆస్ట్రేలియాపైనా మంచి స్కోరు సాధించింది.
ఢిల్లీ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చెలరేగి ఆడింది. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో ఆ జట్టు 5 వికెట్ల నష్టానికి 428 పరుగులు చేసింది. ఏకంగా ముగ్గురు ఆటగాళ్లు సెంచరీల దాహం తీర్చుకున్నారు.
దక్షిణాఫ్రికా బ్యాటర్, ఐపీఎల్లో సన్‌రైజర్స్ ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్ విశ్వరూపం ప్రదర్శించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో వన్డేలో 83 బంతుల్లో 13 ఫోర్లు, 13 సిక్స్‌లు బాది 174 పరుగులు సాధించాడు.
మన దేశం పేరును ‘ఇండియా’కు బదులుగా భారత్ అని పిలిచే చర్యలు చంద్రయాన్-3 విజయవంతమవడానికి ముందే ప్రారంభమయ్యాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దక్షిణాఫ్రికా, గ్రీస్ దేశాల్లో పర్యటించేందుకు వెళ్లినపుడే ‘ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్’ అని రాశారు.