Home » Sports news
పారిస్ పారాలింపిక్స్ 2024(paralympics 2024)లో మూడో రోజు భారత్‌కు ఐదో పతకం లభించింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్‌హెచ్ 1 విభాగంలో భారత షూటర్ రుబీనా ఫ్రాన్సిస్(Rubina Francis) కాంస్య పతకాన్ని గెలుచుకుంది.
శ్రీలంక టూర్ నుంచి తిరిగొచ్చిన టీమ్ ఇండియా(team india) వచ్చే నెల సెప్టెంబర్‌లో బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌లో తలపడనుంది. ఈ సిరీస్‌ను భారత్‌లో నిర్వహించనున్నారు. రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి టెస్టు సెప్టెంబర్ 19 నుంచి చెన్నైలో జరగనుంది. అయితే ఈ మ్యాచుకు ముగ్గురు కీలక ఆటగాళ్లు దూరం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
ద్రావిడ్ కుమారుడు సమిత్ ద్రావిడ్. తండ్రికి తగ్గట్టే తనయుడు కూడా క్రికెట్లో రాణిస్తున్నాడు. బ్యాట్‌తోనే కాదు బాల్‌తో సత్తా చాటుతున్నాడు. సమిత్‌ను ఆల్ రౌండర్ అనడం బెటర్. కర్ణాటక తరఫున రంజీ మ్యాచ్‌ల్లో ఆడి, ఆ జట్టుకు విజయాలు అందజేశాడు. ప్రస్తుతం మైసూర్ వారియర్స్ తరఫున కేఎస్‌సీఏ మహారాజా టీ 20 ట్రోఫీలో ఆడుతున్నాడు.
ప్యారిస్ పారాలింపిక్స్‌లో భారత్‌కు నాలుగో పతకం లభించింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ SH1 ఫైనల్ పోటీలో మనీష్ నర్వాల్ రజతం గెల్చుకున్నాడు. మరోవైపు మహిళల 100 మీటర్ల (టీ35) రేసులో భారత్‌కు చెందిన ప్రీతీ పాల్ కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది.
పారిస్ పారాలింపిక్స్‌లో దేశానికి తొలి బంగారు పతకం లభించింది. 10 మీటర్ల మహిళల ఎయిర్ పిస్టల్ సింగిల్స్‌లో భారత క్రీడాకారిణి అవనీ లేఖరా స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. అవనీ దేశం అంచనాలను అందుకుంది.
ముంబయి నగరంలో ఈనెల 26 నుంచి జరిగిన ఆల్ ఇండియా రైల్వే నేషనల్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియనషి్‌ప (ఏఐఆర్‌ఎనడబ్ల్యుఎల్‌సీ) పోటీలలో కడప నగరం ఉక్కాయపల్లెకు చెందిన ఎ.శివరామకృష్ణయాదవ్ (గుంటూరు రైల్వే ఉద్యోగి-టీసీ) 89 కేజీల విభాగంలో పాల్గొని రజత పతకం సాధించారు.
Maharaja T20 Trophy: మహారాజా టీ20 ట్రోఫీలో బౌలర్ అభిషేక్ ప్రభాకర్ అదరగొట్టాడు. ఏకంగా 9 వికెట్లు పడగొట్టి తన టీమ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అభిషేక్ అద్భుత ప్రదర్శనతో గుర్బర్గ్ టీమ్ మహారాజా టీ20 ట్రోఫీలో 4 మ్యాచ్‌లు గెలిచింది.
ప్రముఖ పోర్చుగీస్ ఫుట్‌బాల్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో(Cristiano Ronaldo) తాజాగా UR క్రిస్టియానో(UR Cristiano) పేరుతో ఓ యూట్యూబ్ ఛానెల్(YouTube Channel) ప్రారంభించారు. ఇది ప్రారంభించిన వెంటనే కొన్ని నిమిషాల్లోనే రికార్డులు సృష్టించింది. గంటన్నరలోపే గోల్డ్ ప్లే బటన్ దక్కించుకున్నాడు. దీంతోపాటు అనేక రికార్డులు బ్రేక్ చేశాడు.
భారత జట్టు స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్(KL Rahul) గురించి ప్రస్తుతం సోషల్ మీడియా(social media)లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఆయన పేరుతో చేసిన చేసిన ఓ ఇన్స్టాగ్రామ్ పోస్టుపై దుమారం రేగుతోంది. అందులో ఆయన రిటైర్మెంట్ ప్రకటించినట్లు ప్రచారం జరుగుతోంది.
టీమిండియా దాదాపు 40 రోజుల విరామం తర్వాత వచ్చే నెలలో తిరిగి క్రికెట్ మైదానంలోకి అడుగుపెట్టనుంది. శ్రీలంకతో వన్డే సిరీస్‌ను అవమానకరంగా ఓడిన టీమ్ ఇండియా(team india) ఇప్పుడు బంగ్లాదేశ్‌పై తప్పకుండా గెలవాలని చూస్తోంది. అయితే ఈ జట్టుతో ఆడాల్సిన మ్యాచుల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.