Cristiano Ronaldo: కొత్తగా క్రిస్టియానో రొనాల్డో యూట్యూబ్ ఛానెల్.. నిమిషాల్లోనే సిల్వర్ ప్లే బటన్
ABN , Publish Date - Aug 23 , 2024 | 08:01 AM
ప్రముఖ పోర్చుగీస్ ఫుట్‌బాల్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో(Cristiano Ronaldo) తాజాగా UR క్రిస్టియానో(UR Cristiano) పేరుతో ఓ యూట్యూబ్ ఛానెల్(YouTube Channel) ప్రారంభించారు. ఇది ప్రారంభించిన వెంటనే కొన్ని నిమిషాల్లోనే రికార్డులు సృష్టించింది. గంటన్నరలోపే గోల్డ్ ప్లే బటన్ దక్కించుకున్నాడు. దీంతోపాటు అనేక రికార్డులు బ్రేక్ చేశాడు.
ప్రముఖ పోర్చుగీస్ ఫుట్‌బాల్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో(Cristiano Ronaldo) చాలా పాపులర్ ఆటగాడు. ఈ ఆటగాడు తాజాగా UR క్రిస్టియానో(UR Cristiano) పేరుతో ఓ యూట్యూబ్ ఛానెల్(YouTube Channel) ప్రారంభించారు. రొనాల్డో యూట్యూబ్ ఛానెల్ 'UR క్రిస్టియానో' కేవలం 24 గంటల్లో 23 మిలియన్ల సబ్‌స్క్రైబర్ల సంఖ్యను దాటేసింది. ఈ క్రమంలో క్రిస్టియానో యూట్యూబ్ ఛానెల్ వేగంగా 20 మిలియన్ల సబ్‌స్క్రైబర్‌లను చేరుకున్న మొదటి యూట్యూబర్‌గా రోనాల్డో నిలిచాడు.
ఛానల్ ప్రారంభించిన 24 గంటల్లోపే ఈ రికార్డు సృష్టించాడు. యూట్యూబ్‌లో అత్యంత వేగంగా 20 మిలియన్ల సబ్‌స్క్రైబర్‌లను సంపాదించిన రికార్డు గతంలో మిస్టర్ బీస్ట్ పేరిట ఉంది. మిస్టర్ బీస్ట్‌గా పేరుగాంచిన జిమ్మీ డొనాల్డ్‌సన్. తన యూట్యూబ్ ఛానెల్‌ని ప్రారంభించిన రెండేళ్లలోనే ఈ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఇప్పుడు ఈ విషయంలో రొనాల్డో అతని కంటే ముందున్నాడు.
12 గంటల్లో డైమండ్ ప్లే బటన్
దీంతో పాటు యూట్యూబ్ నుంచి రొనాల్డోకు బోలెడన్ని అవార్డులు కూడా వచ్చాయి. ఈ క్రమంలో రొనాల్డో కేవలం 22 నిమిషాల్లోనే సిల్వర్ ప్లే బటన్, 90 నిమిషాల్లో గోల్డెన్, 12 గంటల్లో డైమండ్ ప్లే బటన్‌ను అందుకున్నాడు. YouTubeలో మీరు లక్ష మంది సబ్‌స్క్రైబర్‌లను పొందితే సిల్వర్ ప్లే బటన్, 10 లక్షల మంది సబ్‌స్క్రైబర్‌లను పొందితే గోల్డ్ ప్లే బటన్, 10 మిలియన్లు లేదా కోటి మంది సబ్‌స్క్రైబర్‌లను పొందితే డైమండ్ ప్లే బటన్ లభిస్తుంది. యూట్యూబ్ నుంచి ఈ అవార్డు అందుకున్న తర్వాత రొనాల్డో తన కుమార్తెలతో ఈ ఆనందాన్ని పంచుకున్నాడు. ఆయన తన కుమార్తెల ముందు యూట్యూబ్ ప్లే బటన్‌ను చూపుతున్న వీడియోను పోస్ట్ చేశాడు. ఇది చూసిన కుమార్తెలు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. రొనాల్డో ఛానెల్లో ఇప్పటివరకు 19 వీడియోలు పోస్ట్ చేయబడ్డాయి.
సంపాదన ఎంత?
యూట్యూబర్‌లకు 1 మిలియన్ (10 లక్షలు) వీక్షణల కోసం సుమారు 6 వేల డాలర్లు (దాదాపు రూ. 5 లక్షలు) ఇవ్వబడతాయి. వీడియోల సమయంలో కనిపించే ప్రకటనల ద్వారా వారికి ఆదాయం వస్తుంది. ఈ నేపథ్యంలో రొనాల్డో ఒక రోజులో దాదాపు $300,000 అంటే రూ. 2.51 కోట్లు సంపాదించాడని నివేదికలు చెబుతున్నాయి.
సోషల్ మీడియాలో
మరోవైపు రొనాల్డోకు Instagram, Facebook, Twitterలో కూడా మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. రొనాల్డోకు X ప్లాట్‌ఫారమ్‌లో 112.5 మిలియన్లు, ఫేస్‌బుక్‌లో 170 మిలియన్లు, ఇన్‌స్టాగ్రామ్‌లో 636 మిలియన్ల మంది ఫాలోవర్లు కలరు.
అత్యంత ప్రజాదరణ
యూట్యూబ్‌లో అత్యధిక సంఖ్యలో సబ్‌స్క్రైబర్‌ల రికార్డు మిస్టర్ బీస్ట్ పేరిట ఉంది. ఆయనకు 311 మిలియన్ (31 కోట్ల కంటే ఎక్కువ) సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. తాజాగా టీ సిరీస్ రికార్డును కూడా బద్దలు కొట్టాడు. టీ సిరీస్‌కు 272 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. అయితే రొనాల్డో పాపులారిటీ తీరు చూస్తుంటే రాబోయే రోజుల్లో అన్ని రికార్డులను బద్దలు కొట్టి నంబర్ 1 అవుతాడని చెప్పవచ్చు.
ఇవి కూడా చదవండి:
KL Rahul: కేఎల్ రాహుల్ రిటైర్మెంట్ ప్రకటించారా.. పోస్ట్ వైరల్..
వచ్చే జూన్ 20 నుంచి ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్
Gold and Silver Rate Updates: గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
Read More Sports News and Latest Telugu News