KL Rahul: కేఎల్ రాహుల్ రిటైర్మెంట్ ప్రకటించారా.. పోస్ట్ వైరల్..
ABN , Publish Date - Aug 23 , 2024 | 07:23 AM
భారత జట్టు స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్(KL Rahul) గురించి ప్రస్తుతం సోషల్ మీడియా(social media)లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఆయన పేరుతో చేసిన చేసిన ఓ ఇన్‌స్టాగ్రామ్ పోస్టుపై దుమారం రేగుతోంది. అందులో ఆయన రిటైర్మెంట్ ప్రకటించినట్లు ప్రచారం జరుగుతోంది.
భారత జట్టు స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్(KL Rahul) గురించి ప్రస్తుతం సోషల్ మీడియా(social media)లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఆయన పేరుతో చేసిన చేసిన ఓ ఇన్‌స్టాగ్రామ్ పోస్టుపై దుమారం రేగుతోంది. అందులో ఆయన రిటైర్మెంట్ ప్రకటించినట్లు ప్రచారం జరుగుతోంది. అందులో KL రిటైర్మెంట్ ప్రకటించినట్లు చెబుతున్నారు. కేఎల్ రాహుల్ ప్రొఫెషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ తీసుకున్నట్లు పోస్ట్‌లో పేర్కొన్నారు. దీంతో పాటు వివక్షతో ఇబ్బంది పడుతున్న కారణంగానే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోస్ట్‌లో తెలిపారు.
నిజం ఏంటి
అయితే ప్రస్తుతానికి రాహుల్ మాత్రం ఇంకా అధికారికంగా రిటైర్మెంట్ గురించి ప్రకటించలేదు. ఈ విషయాన్ని ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. అందులో రాహుల్ కీలక ప్రకటన చేయాల్సి ఉందని రాశారు. అయితే రాహుల్ ఏం ప్రకటించబోతున్నారో చెప్పలేదు. ఈ క్రమంలోనే ఆయనకు సంబంధించిన అనేక ఫేక్ పోస్టులు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. ఇందులో రిటైర్మెంట్ గురించి చర్చలు జరుగుతున్నాయి.
బ్రాండ్ ప్రమోషన్‌లో భాగం
కేఎల్‌కు సంబంధించి మరో పోస్ట్ వైరల్‌గా మారింది. అందులో భారత క్రికెట్‌పై అభిమానంతో రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు రాసి ఉంది. అయితే ఈ వాదనలు పూర్తిగా తప్పని చెప్పవచ్చు. ఆయన ఏదో బ్రాండ్‌తో కనెక్ట్ కాబోతున్నారని, ప్రమోషన్లకు ముందు సెలబ్రిటీలు తరచూ ఇలాంటి రహస్య పోస్ట్‌లు చేస్తూనే ఉంటారని మరికొంత మంది చెబుతున్నారు. బహుశా ఇది కూడా దానిలో భాగం కావచ్చని అంటున్నారు. అయితే ఇందులో నిజం తెలియాలంటే మాత్రం రాహుల్ అధికారికంగా చెప్పేవరకు ఆగాల్సిందే.
దులీప్ ట్రోఫీలో
ఇటీవలే శ్రీలంక పర్యటనలో వన్డే జట్టులో కేఎల్ ఎంపికయ్యాడు. మొదటి వన్డేలో రాహుల్ 31 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. కాగా రెండో వన్డేలో డకౌట్ అయ్యాడు. సెప్టెంబర్ 5 నుంచి ప్రారంభమయ్యే దేశీయ క్రికెట్ టోర్నమెంట్ దులీప్ ట్రోఫీకి కూడా KL ఎంపికయ్యాడు. KL శుబ్‌మన్ గిల్ కెప్టెన్‌గా ఉన్న A జట్టులో భాగంగా ఉన్నాడు. సెప్టెంబరు 5న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో టీమ్ బీతో మొదటి మ్యాచ్ జరుగుతుంది.
రాహుల్ కెరీర్ ఎలా ఉంది?
కేఎల్ రాహుల్ అంతర్జాతీయ కెరీర్ గురించి మాట్లాడితే బెంగళూరుకు చెందిన ఈ వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ 2014లో ఆస్ట్రేలియాపై టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. అప్పటి నుంచి భారత టాప్ వికెట్ కీపర్‌గా కొనసాగుతున్నాడు. KL ఇప్పటివరకు 50 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 34.08 సగటుతో 2,863 పరుగులు చేశాడు. 77 ODI మ్యాచ్‌లలో 49.15 సగటుతో 2851 పరుగులు, 72 T20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో 37.75 సగటుతో 2,265 పరుగులు చేశాడు. రాహుల్ ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG)కి కెప్టెన్‌గా ఉన్నాడు.
ఇవి కూడా చదవండి:
వచ్చే జూన్ 20 నుంచి ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్
Gold and Silver Rate Updates: గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
Read More Sports News and Latest Telugu News