Home » Srisailam
శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్ఎల్బీసీ) టన్నెల్ పనులను రెండేళ్లలోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు.
కృష్ణా బేసిన్లోని శ్రీశైలం ప్రాజెక్టుకు వరద మళ్లీ పెరుగుతోంది. శుక్రవారం డ్యాం సైట్ వద్ద 3,92,415 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదవుతుండగా.. జూరాల, సుంకేశుల నుంచే 3,29,576 క్యూసెక్కుల వరద చేరుతోంది.
వర్షాకాలం వచ్చిందంటే చాలు నాగార్జునసాగర్ డ్యామ్ వద్ద పర్యాటకుల సందడి మామూలుగా ఉండదు. ఈసారి కుండపోత వర్షాలు కురవడంతో పెద్దఎత్తున జలాశయానికి నీరు చేరింది. ఎగువన ఉన్న శ్రీశైలం జలాశయానికి భారీగా వరదనీరు చేరడంతో అన్ని గేట్లు ఎత్తి దిగువకు వదిలారు. దీంతో నాగార్జునసాగర్ డ్యామ్ నిండుకుండలా మారింది.
కొద్దిరోజులుగా భారీగా వస్తున్న వరదతో కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులన్నీ నిండాయి. ఇంకా నిలకడగా వరద వచ్చిచేరుతుండటంతో ఆల్మట్టి నుంచి నాగార్జునసాగర్ దాకా ప్రాజెక్టుల గేట్లన్నీ తెరిచి ఉంచారు.
ఎగువన కురిసిన భారీ వర్షాల కారణంగా నాగార్జున సాగర్ ప్రాజెక్ట్కు వరద నీరు పోటెత్తింది. ఈ నేపథ్యంలో సోమవారం ఆరు గేట్లను అధికారులు ఎత్తివేశారు. దీంతో రెండు లక్షల క్యూసెక్ల నీరు కిందకు విడుదల చేయనున్నారు. జులై 25వ తేదీన శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి భారీగా నాగార్జున సాగర్ ప్రాజెక్ట్కు వరద ప్రవాహం వచ్చి చేరింది.
నాగర్కర్నూల్ జిల్లా శ్రీశైలం ఘాట్ రోడ్డులో ఓ కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టి బోల్తాపడింది. ఈ ఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాలతో రాష్ట్రంలోని ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. క్రమంగా నీటి మట్టాలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో రేపు (సోమవారం) ఉదయం 8 గంటలకు నాగార్జున సాగర్ గేట్లు తెరవాలని అధికారులు నిర్ణయించారు.
ఎగువ పరీవాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది. జూరాల నుంచి 2,63,532 క్యూసెక్కులు, సుంకేసుల నుంచి 1,67,556 క్యూసెక్కులు మొత్తం 4,33,088 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది.
కృష్ణా బేసిన్ ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది. శ్రీశైలం నుంచి ఆల్మట్టి దాకా ప్రాజెక్టులకు భారీగా వరద వచ్చిచేరుతోంది. ప్రధానంగా శ్రీశైలాన్ని నింపి.. నాగార్జునసాగర్ దిశగా కదులుతున్న కృష్ణవేణి ఆ ప్రాజెక్టును కళకళలాడిస్తోంది. వరద క్రస్ట్ గేట్లను తాకింది.
కృష్ణా ప్రవాహానికి శ్రీశైలం పూర్తిగా నిండి.. పది గేట్ల నుంచి భారీగా నీళ్లు విడుదల చేయడంతో నాగార్జునసాగర్ కూడా జలసిరితో కళకళలాడుతోంది. వారం రోజుల్లో సాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.