Home » Stock Market
మీరు తక్కువ పెట్టుబడి(investments)తో దీర్ఘకాలంలో మంచి లాభాలను ఆర్జించాలనుకుంటున్నారా. అందుకోసం ఇండెక్స్ ఫండ్లలో పెట్టుబడి బెస్ట్ అని చెప్పవచ్చు. అయితే వీటిలో పెట్టుబడులు చేయడం ద్వారా ఏ మేరకు లాభాలను పొందవచ్చనే విషయాలను ఇక్కడ చుద్దాం.
దేశీయ స్టాక్ మార్కెట్లు(stock markets) గత శుక్రవారం భారీ నష్టాలతో ముగిశాయి. ఈ నేపథ్యంలో మదుపర్ల దృష్టి మొత్తం వచ్చే సోమవారం మార్కెట్‌పై పడింది. ఈ క్రమంలో సెప్టెంబర్ 9న మార్కెట్ క్షీణిత కొనసాగుతుందా లేదా రికవరీ ఉంటుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ట్రేడ్ నిపుణులు ఏం చెప్పారనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వారాంతం (శుక్ర వారం) ట్రేడింగ్‌లో భారీ నష్టాన్ని చవిచూశాయి. ఒక దశలో 1,219 పాయింట్లు క్షీణించి 81,000 దిగువకు పడిపోయిన సెన్సెక్స్.. చివరికి 1,017.23 పాయింట్ల (1.24 శాతం) నష్టంతో 81,183.93 వద్ద స్థిరపడింది.
పెట్టుబడిదారులకు రాత్రికి రాత్రే కోటీశ్వరులు కావాలనే ఆశ ఉండకూడదని Edelweiss మ్యూచువల్ ఫండ్ CEO, MD రాధికా గుప్తా అన్నారు. ఇటివల అసోంలో బయటపడిన రూ.2,200 కోట్ల స్టాక్ మార్కెట్ పెట్టుబడుల స్కాం గురించి ప్రస్తావించిన క్రమంలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆమె కీలక సూచనలు చేశారు.
బ్యాంకులు, ఎనర్జీ స్టాక్ల్లో అమ్మకాలు వెల్లువెత్తడంతో వారంలో చివరి రోజైన శుక్రవారం దేశీయ సూచీలు భారీ నష్టాలను చవిచూశాయి. వరుసగా రెండ్రోజులుగా నష్టాల్లోనే ముగుస్తున్న సెన్సెక్స్, నిఫ్టీ ఈ రోజు మరింత భారీగా నష్టపోయాయి. దాదాపు అన్ని రంగాలు నష్టాల్లోనే రోజును ముగించాయి.
రిలయన్స్ జియో తన 8వ వార్షికోత్సవం సందర్భంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్హోల్డర్లకు శుభవార్త చెప్పింది. ఈ క్రమంలో ఏడేళ్ల తర్వాత మళ్లీ 1:1 బోనస్ షేర్లను ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈ కంపెనీ ఇన్వెస్టర్లు సంతోషం వ్యక్తం చేశారు.
కోటీశ్వరులు కావాలని దాదాపు ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ దీనిని కొంత మంది మాత్రమే అచరించి ప్రణాళిక ప్రకారం చేరుకుంటారు. దీనికోసం మీరు ఏం మ్యాజిక్ చేయాల్సిన అవసరం లేదు. కానీ రోజు ఓ 250 రూపాయలు పక్కన పెడితే చాలు. మీరు కోటీశ్వరులు కావచ్చు. ఎది ఎలా అనేది ఇక్కడ తెలుసుకుందాం.
వరుసగా లాభాలు అందుకుంటూ దూసుకుపోతున్న దేశీయ సూచీలకు బ్రేక్ పడింది. అంతర్జాతీయంగా పలు ఉద్రిక్తతలు, ప్రతికూల సంకేతాల కారణంగా దేశీయ సూచీలు నష్టాల బాట పట్టాయి. అమెరికా మార్కెట్లు మంగళవారం నష్టాలు మూటగట్టుకున్నాయి.
అంతర్జాతీయంగా పలు ఉద్రిక్తతల కారణంగా ఇతర దేశాల మార్కెట్లు అనిశ్చిత్తిలో కదలాడుతున్నా దేశీయ సూచీలు మాత్రం లాభాల భాటలోనే పయనిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందుతున్నా ఫైనాన్సియల్, ఐటీ స్టాక్స్‌లో కొనుగోళ్ల కారణంగా సెన్సెక్స్, నిఫ్టీ లాభాలు అందుకున్నాయి.
సెక్యూరిటీ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా చీఫ్ మాధవి పూరి బుచ్ పై కాంగ్రెస్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. మాధవి పూరి బుచ్ ఒకేసారి మూడు చోట్ల జీతం తీసుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పవన్ ఖేరా సోమవారం మీడియా సమావేశంలో ప్రకటించారు. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.