Home » Stock Market
ఓ ప్రభుత్వ సంస్థ 2 స్టాక్‌లపై 1 ఉచిత స్టాక్ అందించనున్నట్లు ప్రకటించింది. అంతేకాదు ఈ స్టాక్ 365 రోజుల్లోనే 253% బంపర్ రాబడిని అందించడం విశేషం. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే వారికి గుడ్ న్యూస్. ఎందుకంటే వచ్చే వారం మరో ఆరు కొత్త ఐపీఓలు మార్కెట్లోకి రానున్నాయి. దీంతోపాటు మరో 11 కంపెనీలు కూడా మార్కెట్లోకి ప్రవేశించనున్నాయి. ఈ నేపథ్యంలో ఆ IPOల వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం (ఆగస్టు 30)తో ముగిసిన వారంలో మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు సరికొత్త రికార్డులను తాకాయి. ఇది సెన్సెక్స్-నిఫ్టీ కంటే తక్కువ పనితీరును కనబరిచింది. సెన్సెక్స్, నిఫ్టీ కూడా సరికొత్త ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. అయితే వచ్చే వారం మార్కెట్ ఎలా ఉండబోతుందనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు చేస్తే నష్టపోతామని చాలా మంది అనుకుంటారు. కానీ ప్లాన్ ప్రకారం మంచి పెన్నీ స్టాక్‌పై(penny stock) పెట్టుబడులు చేస్తే ఏడాదిలోనే కోటీశ్వరులు అయ్యే ఛాన్స్ ఉంటుంది. అవును మీరు విన్నది నిజమే. ఇక్కడ కూడా ఓ స్టాక్ విషయంలో అచ్చం అలాగే జరిగింది. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
స్టాక్ మార్కెట్లో సెప్టెంబర్ సిరీస్‌కు మంచి ఆరంభం లభించింది. మార్కెట్లు వరుసగా 12వ రోజు గ్రీన్‌లో ముగిశాయి. నేడు (ఆగస్టు 30న) మళ్లీ కొత్త ముగింపు గరిష్టాలను కూడా తాకాయి. ఈ నేపథ్యంలో సెన్సెక్స్-నిఫ్టీలు అర శాతం లాభాలతో ముగిశాయి.
అంతర్జాతీయంగా నెలకొన్న పలు ఉద్రిక్తతల కారణంగా దేశీయ సూచీలు అనిశ్చిత్తిలో కదలాడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందుకుంటున్న మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. దీంతో వరుసగా రెండో రోజు కూడా దేశీయ సూచీలు ఫ్లాట్‌గానే రోజును ముగించాయి.
గత రెండు వారాలుగా స్వల్ప లాభాల్లో ట్రేడయిన స్టాక్ మార్కెట్లు బుధవారం స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. భౌగోళిక, రాజకీయ పరిస్థితుల కారణంగా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందుతున్నాయి.
దేశ రాజధాని ఢిల్లీలో రెండే షోరూమ్‌లు.. కేవలం ఎనిమిది మాత్రమే ఉద్యోగులు.. కంపెనీ పేరు రిసోర్స్‌ఫుల్ ఆటోమొబైల్.. 2018లో మొదలైన ఈ సంస్థ సాహ్ని ఆటోమొబైల్ బ్రాండ్‌పై వ్యాపారం చేస్తుంది. యమహా కంపెనీకి చెందిన వాహనాల డీలర్ షిప్ ఉంది. బైక్‌ల సేల్స్, సర్వీసింగ్ పనులు చేస్తుంటుంది.
వరుస లాభాలతో దూసుకుపోతున్న దేశీయ సూచీలు మంగళవారం కూడా అదే జోష్‌తో ప్రారంభమయ్యాయి. ఉదయం అంతా లాభాల్లోనే కదలాడాయి. అయితే మధ్యాహ్నం తర్వాత మదుపర్లు అమ్మకాలకు దిగడంతో ఆరంభ లాభాలు ఆవిరయ్యాయి. ఒక దశలో సూచీలు నష్టాల్లోకి కూడా జారుకున్నాయి.
అంతర్జాతీయంగా ఉన్న సానుకూల పరిణామాలు దేశీయ మార్కెట్లకు కలిసొస్తున్నాయి. స్టాక్ మార్కెట్ బెంచ్‌మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు సోమవారం ఉదయం 9.24 గంటలకు లాభాలతో షురూ అయ్యాయి.