Next Week IPOs: వచ్చే వారం రానున్న ఐపీఓలివే.. షేర్ మార్కెట్‌లో మనీ సంపాదించే ఛాన్స్
ABN , Publish Date - Sep 01 , 2024 | 02:35 PM
షేర్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టే వారికి గుడ్ న్యూస్. ఎందుకంటే వచ్చే వారం మరో ఆరు కొత్త ఐపీఓలు మార్కెట్లోకి రానున్నాయి. దీంతోపాటు మరో 11 కంపెనీలు కూడా మార్కెట్లోకి ప్రవేశించనున్నాయి. ఈ నేపథ్యంలో ఆ IPOల వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
షేర్‌మార్కెట్‌లో(stock market) ఐపీఓల వారం రానే వచ్చింది. వీటిలో పెట్టుబడులు పెట్టే వారి కోసం ఈసారి ఆరు కొత్త ఐపీఓలు రాబోబోతున్నాయి. దీంతోపాటు మరో 11 కంపెనీలు కూడా వచ్చే వారం (సెప్టెంబర్ 2న) స్టాక్ మార్కెట్‌లోకి ప్రవేశించబోతున్నాయి. అంటే ఈ వారం ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురుస్తుందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో కొత్తగా రానున్న ఐపీఓల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. వచ్చే ఐపీఓలలో ఒకటి మొయిన్ బోర్డ్ విభాగం నుంచి వస్తుండగా, 5 SME నుంచి వస్తున్నాయి.
1. గాలా ప్రెసిషన్ ఇంజనీరింగ్ లిమిటెడ్
ఈ కంపెనీ IPO సెప్టెంబర్ 2న తెరవబడుతుంది. పెట్టుబడిదారులు సెప్టెంబర్ 4 వరకు అప్లై చేసుకోవచ్చు. ఈ మెయిన్ బోర్డ్ IPO ఇష్యూ పరిమాణం రూ. 168 కోట్లు. దీని ధర రూ. 503 నుంచి రూ. 529 మధ్య ఉంటుంది. ఒక లాట్‌లో 28 షేర్లు ఉన్నాయి. దీని కోసం ఇన్వెస్టర్లు రూ.14,812 పెట్టుబడి పెట్టాలి.
2. జెయ్యమ్ గ్లోబల్ ఫుడ్స్ లిమిటెడ్
ఇది SME బోర్డు IPO. దీని ఇష్యూ పరిమాణం దాదాపు రూ.82 కోట్లు. ఇది సెప్టెంబర్ 2న మొదలు కానుండగా, సెప్టెంబర్ 4 వరకు కొనసాగుతుంది. దీని ధర రూ. 59 నుంచి రూ. 61 మధ్య ఉంటుంది. ఒక లాట్‌లో 2 వేల షేర్లు ఉన్నాయి. ఇందుకోసం రూ.1.22 లక్షలు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 9న లిస్టింగ్ జరుగుతుంది.
3. నేచర్ వింగ్స్ హాలిడేస్ లిమిటెడ్
ఇది SME బోర్డు IPO. మీరు దీని కోసం సెప్టెంబర్ 3 నుంచి 5 వరకు తీసుకోవచ్చు. ఈ IPO ఇష్యూ పరిమాణం రూ. 7 కోట్లు. ఒక్కో షేరు ధరను రూ.74గా నిర్ణయించారు. ఒక లాట్‌లో 1600 షేర్లు ఉన్నాయి. దీని కోసం రూ.1,18,400 ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 10న లిస్టింగ్ జరుగుతుంది.
4. మాక్ కాన్ఫరెన్స్ ఈవెంట్స్ లిమిటెడ్
ఈ IPO SME బోర్డు ఇష్యూ పరిమాణం రూ. 125.28 కోట్లు. ఈ IPO సెప్టెంబర్ 4న ప్రారంభమవుతుంది. చివరి తేదీ సెప్టెంబర్ 6. దీని ధర 214 నుంచి 225 రూపాయల మధ్య ఉంటుంది. ఒక లాట్‌లో 600 షేర్లు ఉన్నాయి. ఇందుకోసం రూ.1.35 లక్షలు పెట్టుబడి పెట్టాలి. దీని జాబితా సెప్టెంబర్ 11న జరుగుతుంది.
5. నమో ఈవేస్ట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్
ఇది రూ. 51.20 కోట్ల ఇష్యూ పరిమాణంతో SME బోర్డు విభాగంలో వస్తుంది. సెప్టెంబర్ 4 నుంచి 6వ తేదీ వరకు ఈ ఐపీఓను తీసుకునే ఛాన్స్ ఉంది. దీని ధర 80 నుంచి 85 రూపాయలు. ఒక లాట్‌లో 1600 షేర్లు ఉన్నాయి. ఇందుకోసం రూ.1.36 లక్షలు పెట్టుబడి పెట్టాలి. దీని జాబితా సెప్టెంబర్ 11న జరుగుతుంది.
6. నా ముద్రా ఫిన్‌కార్ప్ లిమిటెడ్
ఈ IPO ఇష్యూ పరిమాణం రూ. 33.26 కోట్లు. సెప్టెంబర్ 5 నుంచి సెప్టెంబర్ 9 వరకు ఈ IPOను పెట్టుబడిదారులు తీసుకోవచ్చు. దీని ప్రైస్ బ్యాండ్ రూ.104 నుంచి రూ.110 మధ్య ఉంటుంది. ఒక లాట్‌లో 1200 షేర్లు ఉన్నాయి. ఇందుకోసం రూ.1.32 లక్షలు పెట్టుబడి చేయాల్సి ఉంటుంది. దీని లిస్టింగ్ సెప్టెంబర్ 12న జరుగుతుంది.
ఈ IPOలు జాబితా చేయబడతాయి
వచ్చే వారం ప్రీమియర్ ఎనర్జీస్, ఎకోస్ మొబిలిటీతో సహా 11 IPOల జాబితా ఉంది. ఈ IPOలకు చాలా వరకు పెట్టుబడిదారుల నుంచి మంచి స్పందన కనిపించింది. ఈ క్రమంలో మార్కెట్ పరిస్థితులు అనుకూలించడంతో వచ్చే వారం కూడా ప్రైమరీ మార్కెట్ చాలా బుల్లిష్‌గా ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
ITR Refund: ఐటీఆర్ రీఫండ్ ఇంకా వాపసు రాలేదా.. అయితే ఇలా చేయండి
Telegram: మరికొన్ని రోజుల్లో టెలిగ్రామ్ యాప్ బ్యాన్?.. కారణాలివేనా..
Google Pay: గూగుల్ పే నుంచి కొత్తగా ఆరు ఫీచర్లు.. అవేంటంటే..
Read More Business News and Latest Telugu News