Home » Sunrisers Hyderabad
ఐపీఎల్ 2024 35వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు నిన్న రాత్రి 67 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించి గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది. దీంతో ఈ జట్టు పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. కానీ హైదరాబాద్ విజయంతో కోల్‌కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు మాత్రం నష్టపోయాయి. ఎలాగో ఇక్కడ చుద్దాం.
నేడు ఐపీఎల్ 2024లో 35వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ సన్‌రైజర్స్, హైదరాబాద్ జట్టుతో ఆడబోతుంది. వరుసగా రెండు విజయాలు నమోదు చేయడంతో ఢిల్లీ మళ్లీ పాంలోకి వచ్చింది. అదే సమయంలో SRH కూడా హ్యాట్రిక్ విజయాలు సాధించింది. దీంతో ఈ మ్యాచ్ ఉత్కంఠగా జరగనుంది. ఈ నేపథ్యంలో రెండు జట్లలో ఏ జట్టుకు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనేది ఇక్కడ తెలుసుకుందాం.
ఐపీఎల్-2024 సీజన్ జోరుగా సాగుతున్న తరుణంలో.. ఈసారి ఏ జట్టు ఛాంపియన్‌గా నిలుస్తుందనే చర్చలు క్రీడా వర్గాల్లో సాగుతున్నాయి. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్‌తో పాటు ఇతర జట్లు కూడా దూకుడుగా రాణిస్తున్నాయి కాబట్టి.. ఏ జట్టు టైటిల్ సొంతం చేసుకుంటుందనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది.
క్రీడలో ఒకట్రెండు సార్లు సరిగ్గా ప్రదర్శించకపోతే.. ఆ ఓటములు అభిమానులపై పెద్దగా ప్రభావం చూపించవు. ఆటలో గెలుపోటములు సహజమేనని సర్దిచెప్పుకుంటూ.. క్రీడాకారులకి, సదరు జట్టుకి అండగా నిలుస్తారు. ప్రస్తుతం ఎదుర్కొన్న ఓటమికి తదుపరి మ్యాచ్‌లో ప్రతీకారం తీర్చుకోవాలంటూ.. ఉత్సాహాన్ని నూరిపోస్తారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఎం. చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 287 పరుగులు చేసి, ఐపీఎల్లో అత్యధిక స్కోరు చేసిన జట్టుగా చారిత్రాత్మక రికార్డ్‌ని నమోదు చేసింది.
ఐపీఎల్ 2024లో భాగంగా.. ఎం. చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు పరుగుల సునామీ సృష్టించింది. ఆర్సీబీ బౌలర్లకు ముచ్చెమటలు పట్టిస్తూ.. బౌండరీల వర్షం కురిపించారు.
ఐపీఎల్-2024లో భాగంగా.. సోమవారం (15/04/24) ఎం. చినస్వామి స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. సాయంత్రం ఏడు గంటలకు టాస్ వేయగా.. ఆర్సీబీ టాస్ గెలిచి, ఫీల్డింగ్ ఎంపిక చేసుకుంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో(IPL 2024) ఈరోజు 30వ మ్యాచ్ రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bengaluru), సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) జట్ల మధ్య జరగనుంది. బెంగళూరు(Bengaluru)లోని ఎం చిన్నస్వామి స్టేడియంలో రాత్రి 7:30 గంటల నుంచి ఈ మ్యాచ్ మొదలుకానుంది. ఈ నేపథ్యంలో ఈరోజు ఏ జట్టు గెలిచే అవకాశం ఉందో ఇక్కడ చుద్దాం.
యువ ఆటగాళ్లకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అనేది ఒక గొప్ప వరంగా మారింది. క్రికెట్లో తమ ప్రస్థానం కొనసాగించేందుకు గాను ఈ టోర్నమెంట్ వారికి ఎంతగానో సహాయపడుతోంది. అయితే.. అందరూ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోలేకపోతున్నారు. కేవలం కొందరు మాత్రమే తమ సత్తా చాటుకోగలుగుతున్నారు.
మంగళవారం పంజాబ్ కింగ్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు సాధించిన విజయంలో తెలుగు యువ క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి అత్యంత ప్రధాన పాత్ర పోషించాడని చెప్పుకోవడంలో సందేహం లేదు. కీలకమైన వికెట్లు కోల్పోయి జట్టు కష్టకాలంలో ఉన్నప్పుడు.. అతను అద్భుత ప్రదర్శన కనబరిచి తన జట్టుకి భారీ స్కోరు అందించడంలో సహాయం చేశాడు.