IPL 2024: DCపై SRH విజయంతో.. నష్టపోయిన KKR, CSK
ABN , Publish Date - Apr 21 , 2024 | 06:43 AM
ఐపీఎల్ 2024 35వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు నిన్న రాత్రి 67 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించి గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది. దీంతో ఈ జట్టు పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. కానీ హైదరాబాద్ విజయంతో కోల్‌కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు మాత్రం నష్టపోయాయి. ఎలాగో ఇక్కడ చుద్దాం.
ఐపీఎల్ 2024(IPL 2024)లో ప్యాట్ కమిన్స్ నేతృత్వంలోని సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) జట్టు నిన్న రాత్రి 35వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్(delhi capitals)ను 67 పరుగుల తేడాతో ఓడించి గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది. దీంతో ఈ జట్టు ఐపీఎల్ 2024 పాయింట్ల పట్టిక(IPL 2024 Points Table)లో రాజస్థాన్ రాయల్స్ తర్వాత రెండో స్థానానికి చేరుకుంది. హైదరాబాద్(SRH) విజయంతో కోల్‌కతా నైట్ రైడర్స్(KKR), చెన్నై సూపర్ కింగ్స్(CSK) జట్లు చెరో స్థానం కోల్పోయి రెండు జట్లు వరుసగా మూడు, నాలుగు స్థానాలకు చేరాయి.
ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు అద్భుత ఫామ్‌లో ఉండటంతో రెండో ప్లేస్‌కు చేరుకుంది. ప్రస్తుతం SRH జట్టు 7 మ్యాచ్‌ల్లో 5 గెలిచి మొత్తం 10 పాయింట్లు సాధించింది. ఈ క్రమంలో ఐపీఎల్ 2024 పాయింట్ల పట్టికలో రాజస్థాన్ రాయల్స్(RR) తర్వాత రెండంకెలకు చేరుకున్న రెండో జట్టుగా సన్‌రైజర్స్ హైదరాబాద్ నిలిచింది. RR 7 మ్యాచ్‌లలో 6 గెలిచి 12 పాయింట్లతో జాబితాలో మొదటి స్థానంలో ఉంది. ఈ ఓటమి కారణంగా ఢిల్లీ క్యాపిటల్స్ ఒక స్థానం కోల్పోయింది. దీంతో ఈ జట్టు 6వ స్థానం నుంచి 7వ స్థానానికి పడిపోయింది. 8వ మ్యాచ్‌లో డీసీకి ఇది 5వ ఓటమి.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) జట్టు మరోసారి తుఫాను బ్యాటింగ్ చేసి 266 పరుగులు చేసింది. ఈ సీజన్‌లో ఆ జట్టు మూడోసారి 250 పరుగుల మార్కును దాటింది. 11 ఫోర్లు, 6 సిక్సర్ల సహాయంతో కేవలం 32 బంతుల్లో 89 పరుగుల దూకుడు ఇన్నింగ్స్ ఆడిన ఓపెనర్ ట్రావిస్ హెడ్ కీలక పాత్ర పోషించాడు. ఈ సమయంలో అభిషేక్ శర్మ 12 బంతుల్లో 46 పరుగులు చేసి అతనికి మంచి సపోర్ట్ ఇచ్చాడు.
ఆ తర్వాత 267 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు ఢిల్లీకి(DC) శుభారంభం చేసింది. పృథ్వీ షా మొదటి నాలుగు బంతుల్లో నాలుగు ఫోర్లు కొట్టాడు. అయితే ఐదో బంతికి మరో భారీ షాట్‌కి ప్రయత్నించి వాషింగ్టన్ సుందర్ వికెట్‌ను తీశాడు. దీని తర్వాత జేక్ ఫ్రేజర్ మెక్‌గర్క్ 18 బంతుల్లో 65 పరుగులు చేసి జట్టు వేగాన్ని పెంచాడు.
తర్వాత అభిషేక్ పోరల్ 22 బంతుల్లో 42 పరుగులు చేశాడు. అయితే ఈ ఇద్దరు బ్యాట్స్‌మెన్స్ ఔట్ అయిన వెంటనే, జట్టు క్రమంగా కుప్పకూలింది. SRH బౌలింగ్ లైనప్‌కు DC 20 ఓవర్లు కూడా తట్టుకోలేకపోయింది. దీంతో ఆ జట్టు 19.1 ఓవర్లలో 199 పరుగులకే ఆలౌట్ అయ్యింది.
ఇది కూడా చదవండి:
వినేశ్.. చలో పారిస్ రీతిక, అన్షు కూడా..
మరిన్ని క్రీడా వార్తల కోసం