Home » Suryakumar Yadav
India vs South Africa: చూస్తుండగానే సౌతాఫ్రికా పర్యటన వచ్చేసింది. ఈ నెల 10 నుంచి భారత జట్టు సౌతాఫ్రికాలో పర్యటించనుంది. ఈ పర్యటనలో సఫారీలతో టీమిండియా మూడేసి మ్యాచ్‌ల చొప్పున టీ20, వన్డే, టెస్టు సిరీస్ ఆడనుంది.
Suryakumar Yadav: ఆదివారం ఉత్కంఠభరితంగా సాగిన ఐదో టీ20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై టీమిండియా విజయం సాధించింది. చివరి ఓవర్లో ఆస్ట్రేలియా విజయానికి 10 పరుగులు మాత్రమే అవసరం కాగా టీమిండియా యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు.
Suryakumar Yadav: చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మూడో టీ20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా అనూహ్యంగా ఓటమిపాలైంది. 222 పరుగుల భారీ స్కోర్‌ను సైతం మన బౌలర్లు కాపాడలేకపోయారు. ఒకానొక దశలో విజయం మనదే అనిపించినప్పటికీ, ఆ తర్వాత గ్లెన్ మ్యాక్స్‌వెల్ సెంచరీతో విధ్వంసం సృష్టించి మన జట్టుకు మ్యాచ్‌ను దూరం చేశాడు.
టీమిండియా సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లీ రికార్డును బద్దలుకొట్టేందుకు మిస్టర్ 360 డిగ్రీస్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ 3 అడుగుల దూరంలో ఉన్నాడు. తన తర్వాతి మూడు టీ20 ఇన్నింగ్స్‌ల్లో సూర్యకుమార్ యాదవ్ మరొక 60 పరుగులు చేస్తే టీమిండియా తరఫున వేగంగా 2 వేల పరుగులు చేసిన బ్యాటర్‌గా చరిత్ర సృష్టిస్తాడు.
IND vs AUS 3rd T20: సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో అదరగొడుతున్న టీమిండియా కుర్రాళ్లు మరో విజయంపై కన్నేశారు. సీనియర్లు జట్టులో లేకపోయినప్పటికీ యువ జట్టు అద్భుతంగా ఆడుతోంది. మొదటి రెండు మ్యాచ్‌ల్లో భారీ స్కోర్లు చేసి గెలిచింది.
భారత్, ఆస్ట్రేలియా జట్లు రెండో టీ20 మ్యాచ్ కోసం సిద్ధమయ్యాయి. ఇప్పటికే మొదటి మ్యాచ్ గెలిచి సిరీస్‌లో అధిక్యంలోకి వెళ్లిన టీమిండియా రెండో టీ20లోనూ సత్తా చాటాలని భావిస్తోంది. అందుకోసం ఈ మ్యాచ్‌లో మన జట్టు అన్ని విభాగాల్లో రాణించాలని పట్టుదలగా ఉంది. ముఖ్యంగా గత మ్యాచ్‌లో మన బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు.
Team india: ప్రపంచకప్ లాంటి మెగా టోర్నీ ఫైనల్లో ఓడిపోయిన తమకు ప్రధాని మోదీతో పాటు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు కూడా ఎంతో మద్దతుగా నిలిచారని.. వారి పట్ల ఎప్పటికీ కృతజ్ఞులుగా ఉంటామని పేర్కొన్నాడు. నిజానికి ప్రపంచకప్‌లో తమ ప్రదర్శన చాలా సంతృప్తి ఇచ్చిందని. .ఈ జోష్‌తో వచ్చే ఏడాది జూన్‌లో జరిగే టీ20 ప్రపంచకప్‌లో గెలిచి తీరుతామని సూర్యకుమార్ యాదవ్ స్పష్టం చేశాడు.
వన్డే ఫార్మాట్లో ఎలా ఆడిన టీ20ల్లో మాత్రం టీమిండియా స్టార్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ తన టాప్ ఫామ్‌ను కొనసాగిస్తుంటాడు. ప్రస్తుతం కూడా అదే చేస్తున్నాడు. ఇటీవల జరిగిన వన్డే ప్రపంచకప్‌లో అంతగా రాణించలేకపోయిన సూర్య ఆ వెంటనే ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో మాత్రం చెలరేగాడు.
Suryakumar yadav Comments: గురువారం నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభంకానుంది. తొలి మ్యాచ్ విశాఖపట్నం వేదికగా జరగనుంది. చాలా రోజలు తర్వాత విశాఖలో అంతర్జాతీయ మ్యాచ్ జరగబోతుండడం గమనార్హం. ఈ సిరీస్‌లో టీమిండియాకు కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ వ్యవహరిస్తున్నాడు.
India vs Australia: ప్రపంచకప్ ఫైనల్లో టీమిండియా ఓడిపోయిందనే బాధ నుంచి అభిమానులు ఇంకా కోలుకోనే లేదు. ఇంతలోనే టీమిండియా మరో సిరీస్‌కు సిద్ధమైపోయింది. అది కూడా ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ ముగిసిన నాలుగో రోజుల్లోనే కావడం గమనార్హం. గురువారం నుంచి ఆస్ట్రేలియాతో టీమిండియా 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది.