IND vs SA: దక్షిణాఫ్రికాలో అడుగుపెట్టిన భారత జట్టు.. ఈ సారైనా ఆ లోటు తీరుతుందా?..
ABN , First Publish Date - 2023-12-07T11:32:14+05:30 IST
India vs South Africa: చూస్తుండగానే సౌతాఫ్రికా పర్యటన వచ్చేసింది. ఈ నెల 10 నుంచి భారత జట్టు సౌతాఫ్రికాలో పర్యటించనుంది. ఈ పర్యటనలో సఫారీలతో టీమిండియా మూడేసి మ్యాచ్‌ల చొప్పున టీ20, వన్డే, టెస్టు సిరీస్ ఆడనుంది.
చూస్తుండగానే సౌతాఫ్రికా పర్యటన వచ్చేసింది. ఈ నెల 10 నుంచి భారత జట్టు సౌతాఫ్రికాలో పర్యటించనుంది. ఈ పర్యటనలో సఫారీలతో టీమిండియా మూడేసి మ్యాచ్‌ల చొప్పున టీ20, వన్డే, టెస్టు సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌ల కోసం భారత జట్టు సౌతాఫ్రికాలో అడుగుపెట్టింది. సౌతాఫ్రికా చేరుకున్న టీమిండియా ఆటగాళ్లకు విమనాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ తమ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. టీమిండియా ఆటగాళ్లను చూసేందుకు విమానాశ్రయానికి చేరుకున్న అభిమానులు వారితో సెల్ఫీలు కూడా తీసుకున్నారు. అభిమానులు అడగడంతో టీమిండియా ఆటగాళ్లు కూడా కాదనకుండా ఎంతో ఓపికతో సెల్ఫీలు ఇచ్చారు. ముందుగా వైట్ బాల్ సిరీస్ జరగనుండంతో ప్రస్తుతానికి టీ20, వన్డే సిరీస్ ఆడే జట్లు మాత్రమే సౌతాఫ్రికాకు వెళ్లాయి. టెస్టు సిరీస్ ఆడే జట్టు తర్వాత వెళ్లనుంది.
ఇక సఫారీ పర్యటనలో భారత జట్టు ముందుగా టీ20 సిరీస్ ఆడనుంది. ఈ నెల 10, 12, 14వ తేదీల్లో మూడు టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. వెస్టిండీస్, అమెరికా వేదికగా 2024 జూన్‌లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌నకు ఈ సిరీస్‌ను సన్నాహకంగా భావిస్తున్నారు. సౌతాఫ్రికాతో సిరీస్ తర్వాత టీ20 ప్రపంచకప్‌నకు ముందు భారత జట్టు మరొక టీ20 సిరీస్ మాత్రమే ఆడనుంది. జనవరిలో భారత్ వేదికగా అప్ఘానిస్థాన్‌తో ఈ సిరీస్ జరగనుంది. ఇక సౌతాఫ్రికా గడ్డపై గతంలో భారత జట్టు వన్డే, టీ20 సిరీస్‌లను గెలిచింది. కానీ టెస్టు సిరీస్ మాత్రం ఇప్పటివరకు ఒకసారి కూడా గెలవలేదు. దీంతో ఈ సారైనా ఆ లోటు తీరుతుందేమో చూడాలి.
టీమిండియా టీ20 జట్టు
యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రింకూ సింగ్, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), జితేష్ శర్మ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, దీపక్ చాహర్.
టీమిండియా వన్డే జట్టు
రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్, తిలక్ వర్మ, రజత్ పటిదార్, రింకూ సింగ్, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (కెప్టెన్, వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, ముఖేష్ కుమార్, అవేష్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, దీపక్ చాహర్.
టీమిండియా టెస్టు జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, మహ్మద్. షమీ*, జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), ప్రసిద్ధ్ కృష్ణ.