Share News

IND vs AUS: రోహిత్, కోహ్లీ రికార్డుపై కన్నేసిన సూర్యకుమార్ యాదవ్.. మరొక హాఫ్ సెంచరీ కొడితే..

ABN , First Publish Date - 2023-11-25T12:52:00+05:30 IST

వన్డే ఫార్మాట్‌లో ఎలా ఆడిన టీ20ల్లో మాత్రం టీమిండియా స్టార్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ తన టాప్ ఫామ్‌ను కొనసాగిస్తుంటాడు. ప్రస్తుతం కూడా అదే చేస్తున్నాడు. ఇటీవల జరిగిన వన్డే ప్రపంచకప్‌లో అంతగా రాణించలేకపోయిన సూర్య ఆ వెంటనే ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో మాత్రం చెలరేగాడు.

IND vs AUS: రోహిత్, కోహ్లీ రికార్డుపై కన్నేసిన సూర్యకుమార్ యాదవ్.. మరొక హాఫ్ సెంచరీ కొడితే..

తిరువనంతపురం: వన్డే ఫార్మాట్‌లో ఎలా ఆడిన టీ20ల్లో మాత్రం టీమిండియా స్టార్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ తన టాప్ ఫామ్‌ను కొనసాగిస్తుంటాడు. ప్రస్తుతం కూడా అదే చేస్తున్నాడు. ఇటీవల జరిగిన వన్డే ప్రపంచకప్‌లో అంతగా రాణించలేకపోయిన సూర్య ఆ వెంటనే ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో మాత్రం చెలరేగాడు. 9 ఫోర్లు, 4 సిక్సులతో 42 బంతుల్లోనే 80 పరుగుల చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ క్రమంలో టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ రికార్డులపై సూర్యకుమార్ యాదవ్ కన్నేసాడు. ఆగష్టులో వెస్టిండీస్‌తో జరిగిన చివరి నాలుగు, ఐదో టీ20ల్లో సూర్య వరుసగా హాఫ్ సెంచరీలు చేశాడు. విశాఖపట్నం వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లోనూ సూర్య హాఫ్ సెంచరీతో రాణించాడు. దీంతో టీ20 ఫార్మాట్‌లో సూర్య హ్యాట్రిక్ హాఫ్ సెంచరీలు సాధించాడు. ఈ ఘనత సాధించిన ఐదో భారత బ్యాటర్‌గా నిలిచాడు.


మొదటి సారిగా ఈ ఘనతను 2012లో విరాట్ కోహ్లా సాధించాడు. కింగ్ కోహ్లీ 2014, 2016లో కూడా హ్యాట్రిక్ హాఫ్ సెంచరీలు సాధించాడు. 2018లో రోహిత్ శర్మ, 2020, 2021లో కేఎల్ రాహుల్, 2022లో శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీ సాధించాడు. తాజాగా సూర్యకుమార్ యాదవ్ కూడా ఈ జాబితాలో చేరాడు. కాగా సూర్య గతేడాది కూడా హ్యాట్రిక్ హాఫ్ సెంచరీలు చేశాడు. దీంతో ఆదివారం తిరువనంతపురం వేదికగా జరిగే రెండో టీ20 మ్యాచ్‌లోనూ హాఫ్ సెంచరీ సాధిస్తే వరుసగా నాలుగు టీ20 మ్యాచ్‌ల్లో హాఫ్ సెంచరీలు సాధించిన మొదటి భారత బ్యాటర్‌గా సూర్యకుమార్ యాదవ్ చరిత్ర సృష్టిస్తాడు. ప్రస్తుతం టీ20 క్రికెట్‌లో నంబర్ వన్ బౌలర్‌గా ఉన్న సూర్యకుమార్ యాదవ్ ఇప్పటివరకు 54 మ్యాచ్‌లు ఆడాడు. 173 స్ట్రైక్‌ రేటు 46 సగటుతో 1921 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 16 హాఫ్ సెంచరీలున్నాయి. ఇక భారత్, ఆస్ట్రేలియా జట్లు రెండో టీ20 మ్యాచ్‌ కోసం సిద్దమవుతున్నాయి. కేరళలోని తిరువనంతపురం వేదికగా ఆదివారం ఈ మ్యాచ్ జరగనుంది. విశాఖలో జరిగిన మొదటి మ్యాచ్‌లో భారీ లక్ష్యాన్ని చేధించి గెలిచిన టీమిండియా రెండో టీ20లోనూ సత్తా చాటాలని చూస్తోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - 2023-11-25T12:52:06+05:30 IST