Home » T20 Cricket
వెస్టిండీస్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో నిలకడగా రాణించిన తెలుగు తేజం తిలక్ వర్మ ఐర్లాండ్‌తో సిరీస్‌లో విఫలం అవుతుండటం క్రికెట్ అభిమానులకు ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తొలి మ్యాచ్‌లో గోల్డెన్ డకౌట్, రెండో మ్యాచ్‌లో సిల్వర్ డకౌట్ కావడం తిలక్ వర్మ సామర్థ్యంపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఈ రెండు మ్యాచ్‌ల్లో తిలక్ వర్మ షార్ట్ పిచ్ బాల్‌కే వెనుదిరిగాడు.
లి టీ20(First T20)లో టీం ఇండియా(Team India) గెలుపొందింది. మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఐర్లాండ్(Ireland)తో భారత్ తలపడింది. వర్షం(Rain) అంతరాయంతో మ్యాచ్‌కు ఆటంకం ఏర్పడింది.
టీమిండియా స్టార్ బౌలర్ బుమ్రా రీ ఎంట్రీకి వరుణుడు అడ్డుతగిలేలా కనిపిస్తున్నాడు. తొలి మ్యాచ్ జరగనున్న డబ్లిన్‌లో శుక్రవారం భారీ వర్షం పడుతుందని వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. 92 శాతం వర్షం పడుతుందని నివేదిక ఇచ్చింది. దీంతో ఇప్పటికే ప్రత్యక్షంగా మ్యాచ్ చూసేందుకు టిక్కెట్లు కొనుగోలు చేసిన క్రికెట్ అభిమానులు నిరుత్సాహానికి గురవుతున్నారు.
కరీబియన్ గడ్డపై ఐదు టీ20ల సిరీస్(Five T20 series) ముగిసిందో.. లేదో క్రికెట్ ప్రేమికులకు మరోసారి వినోదాన్ని పంచేందుకు టీమిండియా (Team India) సిద్ధమవుతోంది.
కెప్టెన్ హార్దిక్ పాండ్యా(Captain Hardik Pandya)తోపాటు ఇతర సీనియర్ క్రికెటర్లకు విశ్రాంతి ఇవ్వడంతో ఐర్లాండ్(Ireland)తో జరిగే టీ20లకు ఏస్ పేసర్ జస్ర్పీత్ బుమ్రా(Jasrpeet Bumrah) టీమిండియాకు నాయకత్వం వహిస్తున్నాడు.
అరంగేట్రం సిరీ్‌సలోనే 20 ఏళ్ల తిలక్ వర్మ(Tilak Verma) పరిణతి చెందిన ప్రదర్శనతో జట్టు నమ్మదగిన ఆటగాడిగా ప్రశంసలు అందుకొన్నాడు. దీంతో వరల్డ్‌కప్ మిడిలార్డర్‌లో చోటుకు డార్క్‌హార్స్‌గా మారాడు.
స్టార్లతో కూడిన భారత బ్యాటింగ్ లైనప్(Indian batting line-up) ముందు 150 పరుగుల ఛేదన పెద్ద కష్టమా.. అనిపించినా, విండీస్ పేసర్లు(West Indies Pacers) బెంబేలెత్తించారు. అరంగేట్ర బ్యాటర్ తిలక్ వర్మ(Tilak Verma) (22 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 39) రాణించగా.. మిగతా బ్యాటర్ల వైఫల్యం దెబ్బతీసింది.
మిస్టర్ 360 డిగ్రీస్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌కు టీమిండియా కెప్టెన్‌గా ప్రమోషన్ లభించే అవకాశాలున్నాయి. వచ్చే నెలలో ఐర్లాండ్‌లో పర్యటించే భారత జట్టుకు సూర్యకుమార్ యాదవ్‌నే కెప్టెన్‌గా నియమించనున్నారని సమాచారం. నిజానికి గత టీ20 ప్రపంచకప్ తర్వాతి నుంచి పొట్టి ఫార్మాట్లో భారత జట్టును హార్దిక్ పాండ్యా నడిపిస్తున్నాడు.
ఐపీఎల్ తరహాలో మేజర్ లీగ్ క్రికెట్ టోర్నీ కూడా అభిమానులకు కావాల్సినంత వినోదాన్ని అందిస్తోంది. ఈ నేపథ్యంలో ఆదివారం వాషింగ్టన్ ఫ్రీడమ్ జట్టుతో టెక్సాస్ సూపర్ కింగ్స్ తలపడ్డ మ్యాచ్‌లో కెప్టెన్ డ్వేన్ బ్రావో కొట్టిన ఓ సిక్సర్ మేజర్ లీగ్ క్రికెట్ టోర్నీలోనే భారీ షాట్‌గా నిలిచిపోయింది.
వెస్టిండీస్‌తో టీమిండియా ఆడబోయే ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌కు చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ ఆధ్వర్యంలోని సెలక్షన్ కమిటీ జట్టును ప్రకటించింది. అయితే టాలెంట్ ప్లేయర్ రింకూ సింగ్‌ను సెలక్టర్లు పక్కనపట్టారు. దీంతో బీసీసీఐపై సోషల్ మీడియా వేదికగా క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు.