Home » Tamil Nadu
ప్రపంచంలోని పలు ప్రాంతా ల్లో సంభవిస్తున్న విపత్తులకు ప్రకృతిని తప్పుపట్టలేమని, ఆందుకు మనమే కారణమని మద్రాసు హైకోర్టు(Madras High Court) అభిప్రాయం వ్యక్తం చేసింది. ఊటీ, కొడైకెనాల్(Ooty, Kodaikanal) తదితర కొండ ప్రాంతాల్లో వినియోగించి విసిరేస్తున్న ప్లాస్టిక్ వస్తువుల నిషేధం కేసులో హైకోర్టు న్యాయమూర్తులు ఈ మేరకు పేర్కొన్నారు.
దేశంలో ముఖ్యంగా తమిళనాడు(Tamil nadu)లో కనిపెట్టిన చికెన్ 65(Chicken 65), నేడు ప్రపంచంలో కోడిమాంసం వంటకాల్లో మూడో స్థానంలో నిలిచింది. ప్రపంచ స్థాయిలో ప్రతి ఏడాది ప్రజలు ఇష్టంగా స్వీకరించే ఆహార పదార్ధాల వివరాలు సేకరించి, వాటి జాబితాను టెస్ట్ అట్లాస్ అనే సంస్థ విడుదల చేస్తోంది.
రాష్ట్ర తుఫాను చరిత్ర 50 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా రూ.500 కి.మీ దూరాన్ని మెల్లగా కదిలిన తుపానుగా ‘ఫెంగల్’ నిలిచింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుపాను చెన్నై, చెంగల్పట్టు, కడలూరు, విల్లుపురం(Chennai, Chengalpattu, Cuddalore, Villupuram) మార్గాల్లో కదిలింది.
ఇటీవల సంభవించిన ఫెంగల్ తుఫాన్ కారణంగా రాష్ట్రంలో ఎనిమిది జిల్లాల్లో అపారనష్టం వాటిల్లింది. దీంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) మంగళవారం ముఖ్యమంత్రి స్టాలిన్(Chief Minister Stalin)కు ఫోన్ చేసి ఆరా తీశారు.
తమకు సాయం అందలేదన్న కోపంతో బాధితులు రాష్ట్ర మంత్రిపైనే బురదచల్లడం ఉద్రిక్తతకు దారి తీసింది. వివరాలిలా వున్నాయి... ఫెంగల్ తుఫాను ప్రభావంతో విల్లుపురం జిల్లా అతలాకుతలమైన విషయం తెలిసిందే.
తన చెల్లిని ప్రేమించిన యువకుడిని కత్తులతో దాడి చేసి దారుణంగా హతమార్చిన సోదరుడిని, హత్యకు సాయపడిన అతడి స్నేహితుడిని పోలీసులు అరెస్టు చేశారు. పాళయంకోట పోలీసుల విచారణలో వెల్లడైన సమాచారం మేరకు కళ్లకురిచ్చి జిల్లాకు చెందిన విజయ్ (25) అనే యువకుడికి నాగర్కోవిల్(Nagercoil)లో ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న యువతితో ఇన్స్టాగ్రామ్ ద్వారా ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది.
ఆరు దశాబ్దాల పాటు కలిసి కాపురం చేసిన దంపతుల్ని మృత్యువు కూడా విడదీయలేకపోయింది. ఆద్యంతం అన్యోన్యంగా గడిపిన ఆ దంపతులు ఒకేరోజు రాత్రి నిద్రలోనే మరణించడం పలువురిని కలసిచివేసింది.
నగదు మోసం కేసులో బెయిలుపై విడుదలైన మరునాడే మంత్రిగా బాధ్యతలు చేపట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని రాష్ట్ర మంత్రి సెంథిల్ బాలాజీ(Minister Senthil Balaji)ని సుప్రీంకోర్టు నిలదీసింది. అసలు తమిళనాడులో ఏం జరుగుతోందని అత్యున్నత న్యాయస్థానం ఆశ్చర్యం వ్యక్తం చేసింది.
ఫెంగల్ తుఫాను ప్రభావంతో కురిసిన వర్షాలు మూడు జిల్లాలను ముంచెత్తాయి. విల్లుపురం, కృష్ణగిరి, కడలూరు(Villupuram, Krishnagiri, Cuddalore) జిల్లాల్లో 40 నుంచి 50 సెం.మీ.లకు పైగా కుండపోతగా వర్షం కురిసింది. దీంతో ఆ జిల్లాల్లో జనజీవనం పూర్తిగా స్తంభించింది.
ఫెంగల్ తుపాను తమిళనాడు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తోంది. తుపాను తీరం దాటినప్పటి నుంచీ తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వానల కారణంగా రికార్డుస్థాయిలో వర్షపాతం నమోదు అవుతోంది.