Home » Tamil Nadu
టీవీకే విధానాలని చెప్పుకుంటున్నవన్నీ తమ పార్టీ విధానాలేని, తమను చూసి కాపీ కొట్టినవేనని డీఎంకే నేత టీకేఎస్ ఇలాంగోవన్ మీడియాతో మాడ్లాడుతూ అన్నారు. ఆయన (విజయ్) చెప్పినవన్నీ గతంలో తాము చెప్పినవేననీ, తాము ఏదైతే చెప్పామో దానినే పాటిస్తున్నామని చెప్పారు.
తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ తమిళ హీరో విజయ్ ఆదివారం విళుపురం జిల్లా విక్రవాండి సమీపంలోని వి.సాలైలో మొదటి రాష్ట్ర మహానాడును నిర్వహించారు. ఈ సందర్బంగా హీరో విజయ్ మాట్లాడుతూ...2026లో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయన్నారు. ఈ ఎన్నికల్లో తమను భారీ మెజార్టీతో గెలిపిస్తారని ప్రజలపై తమకు అచంచలమైన విశ్వాసం ఉందన్నారు. ఈ సందర్బంగా డీఏంకే, బీజేపీలపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
అగ్రహీరో విజయ్(Hero Vijay) సారథ్యంలోని తమిళగ వెట్రి కళగం (టీవీఏ) తొలి మహానాడుకు సర్వంసిద్ధమయ్యాయి. మహానాడు ప్రారంభోత్సవానికి ముందు పార్టీ అధినేత విజయ్ 101 అడుగుల స్తంభానికి పార్టీ జెండా ఆవిష్కరించనున్నారు. ఈ మహానాడు ప్రాంగణంలో అనేక మహనీయుల కటౌట్లను ఏర్పాటు చేశారు. ఇందులో ఇద్దరు మహిళా స్వాతంత్య్ర సమరయోధులకు కూడా స్థానం కల్పించారు.
పార్టీ మనకు ఎంతో చేసిందనీ, పార్టీకి కొంతైనా తిరిగి ఇచ్చేద్దామని పార్టీ నేతలకు, శ్రేణులకు భారతీయ జనతా పార్టీ(Bharatiya Janata Party) తమిళనాడు, కర్ణాటక జాతీయ కో-ఇన్చార్జ్ డాక్టర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి(Dr. Ponguleti Sudhakar Reddy) పిలుపునిచ్చారు. అంజికరైలోని ఓ ఫంక్షన్ హాల్లో శుక్రవారం ‘తమిళనాడు బీజేపీ సంఘటన్ పర్వ్’ పేరుతో ఒక వర్క్‌షాపు నిర్వహించారు.
వేలూరు జిల్లా కాట్పాడి(Katpadi) సమీపంలో ఎక్స్‌ప్రెస్ రైలింజన్ బోగీల నుంచి విడిపోవడంతో కలకలం రేగింది. అస్సోం రాష్ట్రం డిబ్రూఘర్ నుంచి కన్నియకుమారి(Kanniyakumari) వెళ్లే ఎక్స్‌ప్రెస్ శుక్రవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో కాట్పాడి సమీపంలో వెళ్తుండగా, ముకుందరాయపురం-తిరువలం మధ్య రైలింజన్ బోగీలను అనుసంధానం చేసే కప్లింగ్ ఊడింది. దీంతో, బోగీలు రైలుపట్టాలపై నిలిచిపోయాయి.
అన్నాడీఎంకేకు రోజురోజుకూ ప్రజాభిమానం పెరుగుతోందని 2026లో జరిగే శాసనసభ ఎన్నికల్లో తమ పార్టీ ఘనవిజయం సాధిస్తుందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి (Former Chief Minister Edappadi Palaniswami) ధీమా వ్యక్తంచేశారు. సేలం జిల్లా ఎడప్పాడిలో శుక్రవారం ఉదయం జరిగిన పార్టీ నిర్వాహకుల సమావేశంలో పాల్గొన్న ఆయన ప్రసంగించారు.
రాజధాని నగరం చెన్నైలో ఉన్న 75 శాతం గృహాల్లో వినియోగించే నీటిలో ఈ.కొలి బ్యాక్టీరియా(E. coli bacteria) ఉన్నట్లు ఐఐటీ మద్రాసు(IIT Madras) జరిపిన పరిశోధనల్లో వెల్లడైంది. మద్రాసు ఐఐటీ ప్రొఫెసర్లు, విద్యార్థులు సంయుక్తంగా ‘పీపుల్స్ వాటర్ డేటా ఇనిషివేటివ్’ కార్యక్రమంలో భాగంగా నగరంలోని 752 గృహాల నుంచి తాగునీటి నమూనాలు సేకరించారు.
చెన్నై మెట్రో రైల్(Chennai Metro Rail) ప్రాజెక్టులో భాగంగా డ్రైవర్ రహిత మెట్రో రైళ్ళను నగరంలో నడుపనున్నారు. ఇందులో భాగంగా, మెట్రో రైల్ అధికారులు ఈ నెల 26న తొలి డ్రైవర్ రహిత మెట్రో రైల్ టెస్ట్ డ్రైవ్ నిర్వహించనున్నారు. పూందమల్లిలోని టెస్ట్ డ్రైవింగ్ ట్రాక్‌లో ఈ రైళ్ళను పరీక్షిస్తారు. చెన్నై నగరంలో ప్రజా రవాణా సులభతరం చేసే చర్యల్లో భాగంగా మెట్రో రైల్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు.
రేషన్ దుకాణాల(Ration shops) ద్వారా ప్రజలకు బ్యాంకింగ్ సేవలు అందించేలా సహకార బ్యాంక్‌ల్లో పొదుపు ఖాతాలు ప్రారంభించాలని సహకార శాఖ మండల జాయింట్ రిజిస్ట్రార్లకు సహకార శాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఈ విషయమై సహకార సంఘాల రిజిస్ట్రార్ సుబ్బయ్యన్, మండల జాయింట్ రిజిస్ట్రార్లకు పంపిన ఉత్తర్వుల్లో.. కేంద్ర సహకార బ్యాంకు(Central Cooperative Bank)ల ద్వారా ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో రైతులకు పంట రుణం సహా పలు రకాల రుణ సహయాలు అందజేస్తున్నారు.
తమిళనాడులోని హోసూరులో గత 24 గంటలుగా ఎడతెరపి లేకుండా భారీ వర్షం కురిసింది. దీంతో సమీపంలోని రిజర్వాయర్లు నీటితో నిండిపోయాయి. ఆ నీటికి కిందకి వదిలారు. ఆ క్రమంలో హోసూరు రహదారిపైకి భారీగా విషపూరితమైన నురగ వచ్చి చేరింది. దాదాపు 5 అడుగుల మేర ఈ నురుగ ఏర్పడింది. దీంతో వాహనాలను మరో మార్గంలో మళ్లిస్తున్నారు.