Share News

Special trains: క్రిస్మస్‌, న్యూ ఇయర్‌ సందర్భంగా ఊటీకి ప్రత్యేక రైళ్లు

ABN , Publish Date - Nov 30 , 2024 | 11:08 AM

క్రిస్మస్‌, న్యూ ఇయర్‌, అర్ధసంవత్సర సెలవులను పురస్కరించుకుని ఊటీ నుంచి పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు(Special trains) నడపనున్నట్లు దక్షిణరైల్వే ప్రకటించింది. వివరాలిలా వున్నాయి... డిసెంబరు 25, 27, 29, 31వ తేదీల్లో ఉదయం 9.10 గంటలకు మేట్టుపాళయంలో బయలుదేరే ప్రత్యేక రైలు మధ్యాహ్నం 2.25 గంటలకు ఊటీ చేరుకుంటుంది.

Special trains: క్రిస్మస్‌, న్యూ ఇయర్‌ సందర్భంగా ఊటీకి ప్రత్యేక రైళ్లు

చెన్నై: క్రిస్మస్‌, న్యూ ఇయర్‌, అర్ధసంవత్సర సెలవులను పురస్కరించుకుని ఊటీ నుంచి పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు(Special trains) నడపనున్నట్లు దక్షిణరైల్వే ప్రకటించింది. వివరాలిలా వున్నాయి... డిసెంబరు 25, 27, 29, 31వ తేదీల్లో ఉదయం 9.10 గంటలకు మేట్టుపాళయంలో బయలుదేరే ప్రత్యేక రైలు మధ్యాహ్నం 2.25 గంటలకు ఊటీ చేరుకుంటుంది. 26, 28, 30, జనవరి 1వ తేదీల్లో ఉదయం 11.30 గంటలకు ఊటీలో బయలుదేరే ప్రత్యేక రైలు సాయంత్రం 4.20 గంటలకు మేట్టుపాళయం చేరుకుంటుంది.

ఈ వార్తను కూడా చదవండి: Heavy Rains: నేడు తీరం దాటనున్న ‘ఫెంగల్‌’


కున్నూరు - ఊటీ మధ్య: కున్నూరు- ఊటీ మధ్య ప్రత్యేక రైళ్లువచ్చే డిసెంబరు 25వ తేదీ నుంచి జనవరి 2వ తేదీ వరకు ఆరు రోజుల పాటు కున్నూరు-ఊటీ మధ్య ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. కున్నూరు నుంచి ఉదయం 8.25 గంటలకు బయలుదేరే ప్రత్యేక రైలు 9.45 గంటలకు ఊటీ చేరుకుంటుంది. అదేవిధంగా ఊటీ నుంచి సాయంత్రం 4.45 గంటలకు బయలుదేరే ప్రత్యేకరైలు 5.55 గంటలకు కున్నూరు చేరుకుంటుంది.


ఊటీ-కేథి మధ్య ప్రత్యేక రైలు: ఊటీ-కేథి మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నారు. ఊటీలో ఉదయం 9.45, 11.30, మధ్యాహ్నం 3.00, కేథిలో ఉదయం 10.30, 12.40, సాయంత్రం 4.00 గంటలకు బయలుదేరే ప్రత్యేక రైళ్లు అరగంటకు గమ్యస్థానం చేరుకుంటాయి. ఆయా రైళ్లకు ముందస్తు రిజర్వేషన్‌ చేసుకోవచ్చని అధికారులు సూచించారు.


ఈవార్తను కూడా చదవండి: మూడు జిల్లాల్లో 8 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు

ఈవార్తను కూడా చదవండి: పోటీపై అధిష్ఠానం నిర్ణయమే శిరోధార్యం

ఈవార్తను కూడా చదవండి: రామప్ప, సోమశిల అభివృద్ధికి రూ.141.84 కోట్లు

ఈవార్తను కూడా చదవండి: ఒక్కనాడైనా జై తెలంగాణ అన్నావా.. రేవంత్‌‌పై హరీష్ విసుర్లు

Read Latest Telangana News and National News

Updated Date - Nov 30 , 2024 | 04:32 PM