Share News

Chennai: హాయిగా ఊపిరి పీల్చుకోండి..

ABN , Publish Date - Nov 29 , 2024 | 10:28 AM

రాష్ట్ర రాజధాని నగరం చెన్నై(Chennai), ఆలయాల నగరం మదురై, పరిశ్రమల నగరం తిరుచ్చి నగరాల్లో గాలి నాణ్యత మెరుగుపడింది. రాజ్యసభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ సహాయమంత్రి కీర్తి వర్థన్‌సింగ్‌ ఈ మేరకు లిఖితపూర్వక సమాచారం అందించారు.

Chennai: హాయిగా ఊపిరి పీల్చుకోండి..

- చెన్నై, మదురై, తిరుచ్చిలో మెరుగైన గాలి నాణ్యత

చెన్నై: రాష్ట్ర రాజధాని నగరం చెన్నై(Chennai), ఆలయాల నగరం మదురై, పరిశ్రమల నగరం తిరుచ్చి నగరాల్లో గాలి నాణ్యత మెరుగుపడింది. రాజ్యసభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ సహాయమంత్రి కీర్తి వర్థన్‌సింగ్‌ ఈ మేరకు లిఖితపూర్వక సమాచారం అందించారు. జాతీయ, రాష్ట్ర, నగరస్థాయి ‘క్లీన్‌ ఎయిర్‌ యాక్షన్‌ ప్లాన్‌’ అమలు చేయడం ద్వారా 130 నగరాల్లో గాలి నాణ్యత మెరుగుపరచడానికి పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ 2019 జనవరిలో ‘నేషనల్‌ క్లీన్‌ ఎయిర్‌ ప్రోగ్రాం’ ప్రారంభించిన విషయం తెలిసిందే.

ఈ వార్తను కూడా చదవండి: BJP MLA: ఆ పథకాన్ని రాజకీయం చేయొద్దు


ఈ ప్రాజెక్టు ద్వారా 2025-26 నాటికి పీఎం10 స్థాయిలను 40 శాతానికి తగ్గింవచ్చని, లేదా జాతీయ ప్రమాణాన్ని (మీటరుకు 60 మైక్రోగ్రాములు) సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ పథకం అమలు కోసం 2019-20 నుంచి 2025-26 వరకు రూ.16,539 కోట్లు కేటాయించారు. 15వ ఆర్థిక సంఘం మిలియన్‌ ప్లస్‌ సిటీ ఛాలెంజ్‌ ఫండ్‌ కింద, 48 మిలియన్లకు పైగా జనాభా వున్న నగరాలు, పట్టణ సముదాయాలకు ఇప్పటి వరకూ రూ.9596.66 కోట్లు విడుదల చేసింది.


nani2.jpg

2023-24లో నిర్వహించిన వార్షిక పనితీరు అంచనా ప్రకారం 2017-18తో పోలిస్తే 2023-24 ఆర్థిక సంవత్సరంలో పీఎం10 సాంద్రత పరంగా 130 నగరాల్లో 97 వాయు నాణ్యతలో మెరుగుదల చూపించాయి. 2017-18తో పోలిస్తే 2023-24 నాటికి 55 నగరాలు పీఎం10 స్థాయిలలో 20 శాతం, లేదా అంతకంటే ఎక్కువ తగ్గింపు సాధించాయి. ఇందులో చెన్నై, మదురై, తిరుచ్చి కూడా ఉండడం విశేషం.


ఈవార్తను కూడా చదవండి: Kishan Reddy: తెరచాటు ఒప్పందం..

ఈవార్తను కూడా చదవండి: Panchayat Elections: సంక్రాంతికి పంచాయతీ భేరి!

ఈవార్తను కూడా చదవండి: Warangal: వచ్చే ఆగస్టుకల్లా కోచ్‌ ఫ్యాక్టరీ పూర్తి

ఈవార్తను కూడా చదవండి: Komati Reddy: హరీశ్‌, కేటీఆర్‌లది నా స్థాయి కాదు

Read Latest Telangana News and National News

Updated Date - Nov 29 , 2024 | 10:28 AM