Minister: రాష్ట్రంలో 2,553 వైద్య పోస్టుల భర్తీ..
ABN , Publish Date - Nov 30 , 2024 | 11:26 AM
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2,553 వైద్య పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టినట్లు ఆరోగ్య శాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం(Minister M. Subramaniam) పేర్కొన్నారు. సచివాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ...
- మంత్రి ఎం.సుబ్రమణ్యం
చెన్నై: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2,553 వైద్య పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టినట్లు ఆరోగ్య శాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం(Minister M. Subramaniam) పేర్కొన్నారు. సచివాలయంలో మంత్రి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... ముఖ్యమంత్రి స్టాలిన్(Chief Minister Stalin) ఉత్తర్వుల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యుల కొరతపై వివరాలు సేకరించామని, ప్రస్తుతం ఖాళీగా ఉన్న 2,553 పోస్టులకు అర్హులైన వారిని ముందుగానే ఎంపిక చేయనున్నట్లు మంత్రి వివరించారు.
ఈ వార్తను కూడా చదవండి: Heavy Rains: నేడు తీరం దాటనున్న ‘ఫెంగల్’
మొత్తం 23,917 దరఖాస్తులను పరిశీలన జరుగుతోందని, ఆన్‌లైన్(Online)లో 2026 జనవరి 27వ తేది రాతపరీక్ష నిర్వహించనున్నట్లు ఇదివరకే ప్రకటించామని, అయితే సీఎం సూచనల మేరకు రెండు రోజుల ముందే ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. వైద్యుల పదోన్నతికి సంబంధించిన కేసులకు పరిష్కారం వచ్చిందని, మరో వారం రోజుల్లో 428 మంది వైద్యులకు పదోన్నతి ఉత్తర్వులు అందజేయనున్నట్లు మంత్రి సుబ్రమణ్యం తెలిపారు.
కొవిడ్(Covid) సమయంలో డ్యూటీ చేసిన 940 మందిని కాంట్రాక్ట్ వేతన జాబితాలో చేర్చామని, వీరిని కూడా పర్మినెంట్ చేయడంపై ప్రభుత్వం పరిశీలిస్తోందని చెప్పారు. మీడియా సమావేశంలో ఆరోగ్య శాఖ డైరెక్టర్ సెల్వవినాయగం, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ శంఖుమణి తదితరులు పాల్గొన్నారు.
ఈవార్తను కూడా చదవండి: మూడు జిల్లాల్లో 8 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు
ఈవార్తను కూడా చదవండి: పోటీపై అధిష్ఠానం నిర్ణయమే శిరోధార్యం
ఈవార్తను కూడా చదవండి: రామప్ప, సోమశిల అభివృద్ధికి రూ.141.84 కోట్లు
ఈవార్తను కూడా చదవండి: ఒక్కనాడైనా జై తెలంగాణ అన్నావా.. రేవంత్‌పై హరీష్ విసుర్లు
Read Latest Telangana News and National News