Heavy Rains: నేడు తీరం దాటనున్న ‘ఫెంగల్’
ABN , Publish Date - Nov 30 , 2024 | 10:25 AM
నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైవున్న వాయుగుండం శుక్రవారం తుఫానుగా మారింది. ఇది శనివారం ఉదయం పుదుచ్చేరి (కారైక్కాల్) - మహాబలిపురం మధ్య తీరం దాటవచ్చని భారత వాతావరణ శాఖ చెన్నై(Chennai) ప్రాంతీయ కేంద్రం అంచనా వేసింది.

- 15 జిల్లాలకు భారీ వర్ష సూచన
- వాతావరణ శాఖ హెచ్చరిక
- చెన్నై సహా ఆరు జిల్లాల్లో విద్యాలయాలకు సెలవు
- అల్లకల్లోలంగానే సముద్రం
చెన్పై: నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైవున్న వాయుగుండం శుక్రవారం తుఫానుగా మారింది. ఇది శనివారం ఉదయం పుదుచ్చేరి (కారైక్కాల్) - మహాబలిపురం మధ్య తీరం దాటవచ్చని భారత వాతావరణ శాఖ చెన్నై(Chennai) ప్రాంతీయ కేంద్రం అంచనా వేసింది. ఈ తుఫాను తీరం దాటే సమయంలో గంటకు 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయవచ్చని హెచ్చరించింది. ప్రస్తుతం ఫెంగల్ తుఫాను చెన్నై నగరానికి సుమారుగా 250 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.
ఈ వార్తను కూడా చదవండి: MP Kanimozhi: ఆ జాలర్లను విడిపించండి..
అలాగే, చెన్నై, చెంగల్పట్టు, తిరువళ్ళూరు, కాంచీపురం(Chennai, Chengalpattu, Tiruvallur, Kanchipuram), కడలూరు జిల్లాల సహా మొత్తం 15 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.. దీంతో చెన్నై, చెంగల్పట్టు, తిరువళ్ళూరు, కాంచీపురం, కడలూరు, మైలాడుదురై జిల్లాల్లో పాఠశాలలు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. రాష్ట్రంలో చెన్నై, చెంగల్పట్టు, తిరువళ్ళూరు, కాంచీపురం, రాణిపేట, విల్లుపురం, కడలూరు, మైలాడుదురై, నాగపట్టణం, తిరువారూర్, తంజావూరు, పుదుక్కోట, రామనాథపురం, తిరునెల్వేలి, కన్నియాకుమారి జిల్లాలతో పాటు పుదుచ్చేరి, కారైక్కాల్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది.
చెన్నై నగరంలో గిండి, ఈక్కాట్టుతాంగల్, కోడంబాక్కం, నుంగంబాక్కం, ఎగ్మోర్, వడపళని, చెప్పాక్కం, తిరునెల్వేలి, మైలాడుదురై, అన్నాసాలై, ప్యారీస్, కాశీమేడు, టి నగర్ తదితర ప్రాంతాల్లో బలమైన గాలులతో వర్షం కురిసింది. అలాగే, కాశీమేడు, పట్టిణంపాక్కం ప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారి, అలలు ఉధృతంగా ఎగిసిపడుతున్నాయి. తుఫాను తీరందాటే సమయంలో తమిళనాడులోని కోస్తా జిల్లాలతో పాటు గల్ఫ్ ఆఫ్ మన్నార్, కన్నియాకుమారి సముద్రతీరం ప్రాంతాల్లో గంటకు 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని హెచ్చరించిన వాతావరణ శాఖ జాలర్లు సముద్రంలో వేటకు వెళ్ళొద్దని, వెళ్ళినవారు తక్షణం తీరానికి చేరుకోవాలని సూచన చేసింది.
ప్రభుత్వ యంత్రాంగం సిద్ధం
ఫెంగల్ తీరం దాటే సమయంలో చెన్నై, తిరువళ్ళూరు, కాంచీపురం, చెంగల్పట్టు, కడలూరు, విల్లుపురం, మైలాడుదురై జిల్లాల్లో గంటకు 60 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఆయా జిల్లాల్లో అధికార యంత్రాంగ్నాన అప్రమత్తం చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది. అలాగే, భవన నిర్మాణ స్థలాల్లో ఉపయోగించే అన్ని క్రేన్లను కిందికి దించాలని ఆదేశించింది. ప్రకటన బోర్డుల్ని కూడా కిందకు దించాలని పేర్కొంది. ప్రజల భద్రతకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది.
మరోవైపు, మహాబలిపురం తీర ప్రాంతంలో పర్యాటకులను పోలీసులు ఖాళీ చేయించారు. తీర ప్రాంతంలో సముద్ర స్నానాలపై పోలీసులు నిషేధం విధించారు. తమిళనాడు, పుదుచ్చేరి ప్రాంతాల్లో వరద సహాయక బృందాలను సిద్ధం చేశారు. రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి కేకేఎ్‌సఎ్‌సఆర్ రామచంద్రన్ శుక్రవారం సాయంత్రం కంట్రోల్ రూంలో పరిస్థితి సమీక్షించారు. ఇప్పటికే ఎన్‌డీఆర్‌ఎ్‌ఫ బలగాలు సిద్ధమైన విషయం తెలిసిందే. ఇదిలా వుండగా శనివారం భారీ వర్షం పడే అవకాశముండడంతో విల్లుపురం, కడలూరు, కళ్లకుర్చి జిల్లాల్లో విద్యాలయాలకు సెలవు ప్రకటించారు. అదే విధంగా పుదుచ్చేరి, కారైక్కల్ ప్రాంతాల్లోనూ విద్యాలయాలకు సెలవు ఇచ్చారు.
ఈవార్తను కూడా చదవండి: మూడు జిల్లాల్లో 8 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు
ఈవార్తను కూడా చదవండి: పోటీపై అధిష్ఠానం నిర్ణయమే శిరోధార్యం
ఈవార్తను కూడా చదవండి: రామప్ప, సోమశిల అభివృద్ధికి రూ.141.84 కోట్లు
ఈవార్తను కూడా చదవండి: ఒక్కనాడైనా జై తెలంగాణ అన్నావా.. రేవంత్‌పై హరీష్ విసుర్లు
Read Latest Telangana News and National News