Home » TATA IPL2023
ఐపీఎల్ అంటే ఆటగాళ్ల విన్యాసాలే కాదు.. ఛీర్‌గాళ్స్ నృత్యాలు కూడా. బ్యాట్స్‌మెన్ బౌండరీలు కొట్టినపుడు, బౌలర్లు వికెట్లు తీసినపుడు ఆయా జట్లకు చెందిన ఛీర్‌గాళ్స్ తమ డ్యాన్స్‌తో ప్రేక్షకులకు ఉల్లాసం కలిగిస్తారు.
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి దేశవ్యాప్తంగా అభిమానులున్నారు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయినా ధోనీకి అభిమాన గణం తగ్గలేదు. ప్రస్తుత ఐపీఎల్‌లో భాగంగా ధోనీ ఏ నగరానికి వెళ్తున్నా స్థానిక టీమ్‌కు కాకుండా ధోనీకే అభిమానులు మద్దతుగా నిలుస్తున్నారు.
యువ ఆటగాళ్లకు ఐపీఎల్ ఒక అద్భుతమైన వరం. ప్రతిభను వెలుగులోకి తీసుకురావడమే కాదు.. దేశ, విదేశాలకు చెందిన దిగ్గజ ఆటగాళ్లతో డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకునే వెసులుబాటు కూడా యువ ఆటగాళ్లకు కల్పిస్తోంది.
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అంటే ఇష్టపడని వారు ఉండరు. ప్రేక్షకులే కాదు.. టీమిండియా మాజీ దిగ్గజ ఆటగాళ్లు కూడా ధోనీ ప్రవర్తనను, అతడి నాయకత్వ పటిమను ఎంతగానో ఇష్టపడతారు. భారత దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్‌కు కూడా ధోనీ అంటే చాలా ఇష్టం.
ప్రస్తుత ఐపీఎల్‌లో (IPL 2023) కొందరు ఆటగాళ్ల ప్రవర్తన కాస్త శృతిమించుతోంది. టీ-20 అంటేనే తీవ్ర ఒత్తడితో కూడుకున్న గేమ్. అందులోనూ ఐపీఎల్ అంటే ప్రెజర్ మరింత ఎక్కువగా ఉంటుంది. దీంతో ఆటగాళ్లు ప్రశాంతత కోల్పోయి అప్పుడప్పుడు ఆగ్రహావేశాలు ప్రదర్శిస్తున్నారు.
ఐపీఎల్ ద్వారా ఎంతో మంది యువ ఆటగాళ్లు వెలుగులోకి వస్తున్నారు. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ భవిష్యత్తు స్టార్లుగా ఎదుగుతున్నారు. ఈ లీగ్‌లో యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ వంటి యువ ఆటగాళ్లు సత్తా చాటిన సంగతి తెలిసిందే.
ఆరంభం నుంచి పేలవ ప్రదర్శనతో సతమతమవుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ ఐపీఎల్ ప్లే-ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. శనివారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 31 పరుగుల తేడాతో ఓడిపోయింది. సునాయాసంగా గెలవాల్సిన మ్యాచ్‌లో బ్యాట్స్‌మెన్ తడబడి పంజాబ్‌కు విజయాన్ని అందించారు.
ఈ ఐపీఎల్‌లో తరచుగా నో-బాల్ వివాదాలు చెలరేగుతున్నాయి. నడుము కంటే ఎత్తులో నేరుగా వచ్చే బంతుల విషయంలో అంపైర్లు తీసుకునే నిర్ణయాలు వివాదాస్పదమవుతున్నాయి. నో-బాల్ నిర్ణయంపై డీఆర్‌ఎస్ కోరే అవకాశం ఉండడం కూడా వివాదాలకు కారణమవుతోంది.
ఐపీఎల్ కీలక ప్లే-ఆఫ్స్‌కు చేరుకుంటున్న దశలో ముంబై ఇండియన్స్ టీమ్ జూలు విదిల్చింది. ఇప్పటివరకు ఈ లీగ్‌లో 12 మ్యాచ్‌లు ఆడి ఏడింట్లో గెలిచింది. చివరి ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు గెలిచిన ముంబై పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరుకుంది.
శుక్రవారం ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఇద్దరు ప్రతిభావంతుల ఆటను మరోసారి ప్రేక్షకులకు అందించింది. ముంబై ఆటగాడు సూర్య కుమార్ యాదవ్ (49 బంతుల్లో103 నాటౌట్) బ్యాట్‌తో చెలరేగాడు