Ishant Sharma: ఢిల్లీ ఫట్.. ఇషాంత్ శర్మ హిట్.. ప్లే ఆఫ్స్ రేస్ నుంచి నిష్క్రమించిన వార్నర్ సేన!
ABN , First Publish Date - 2023-05-14T10:25:51+05:30 IST
ఆరంభం నుంచి పేలవ ప్రదర్శనతో సతమతమవుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ ఐపీఎల్ ప్లే-ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. శనివారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 31 పరుగుల తేడాతో ఓడిపోయింది. సునాయాసంగా గెలవాల్సిన మ్యాచ్‌లో బ్యాట్స్‌మెన్ తడబడి పంజాబ్‌కు విజయాన్ని అందించారు.
ఆరంభం నుంచి పేలవ ప్రదర్శనతో సతమతమవుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ (DC) టీమ్ ఐపీఎల్ ప్లే-ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. శనివారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో (DCvsPBKS) 31 పరుగుల తేడాతో ఓడిపోయింది. సునాయాసంగా గెలవాల్సిన మ్యాచ్‌లో బ్యాట్స్‌మెన్ తడబడి పంజాబ్‌కు విజయాన్ని అందించారు. ఈ మ్యాచ్‌లో గెలిచిన పంజాబ్ కింగ్స్ తమ ఆశలను సజీవంగానే ఉంచుకుంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 167 పరుగులు చేసింది.
సీనియర్ బౌలర్ ఇషాంత్ శర్మ (Ishant Sharma) ఈ మ్యాచ్‌లో చక్కగా బౌలింగ్ చేశాడు. ప్రమాదకర ధవన్ (Shikhar Dhawan) (7), ఫామ్‌లో ఉన్న లివింగ్‌స్టోన్ (Liam Livingstone) (4)ను ఆరంభంలోనే పెవిలియన్‌కు చేర్చాడు. ఈ లీగ్‌లో ఇషాంత్‌ను ఢిల్లీ టీమ్ నామమాత్రపు ధరకే దక్కించుకుంది. తొలి రెండు మ్యాచ్‌ల్లోనూ ఇషాంత్‌కు ఆడే అవకాశమే రాలేదు. మూడో మ్యాచ్‌లో ఛాన్స్ దక్కించుకున్న ఇషాంత్.. ఢిల్లీ టీమ్ బౌలింగ్ విభాగానికి కీలకంగా మారాడు. వికెట్లు తీయడమే కాకుండా పరుగులను కూడా కట్టడి చేశాడు. అయితే ఢిల్లీ టీమ్ పేలవ ప్రదర్శన కారణంగా ఇషాంత్ బౌలింగ్ పెద్దగా గుర్తింపునకు నోచుకోలేదు.
SRHvsLSG: నో-బాల్ వివాదం.. కోహ్లీ.. కోహ్లీ.. అంటూ లఖ్‌నవూ జట్టును టీజ్ చేసిన హైదరాబాద్ అభిమానులు!
168 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీకి శుభారంభమే దక్కింది. ఓపెనర్లు వార్నర్ (David Warner), సాల్ట్ (21) బౌండరీల హోరుతో తొలి ఆరు ఓవర్లలోనే ఢిల్లీ స్కోరు 65కు చేరుకుంది. ఢిల్లీ టీమ్ సునాయాసంగా మ్యాచ్‌ను ముగిస్తుందని అంతా భావించారు. అయితే అటు హర్‌ప్రీత్ బ్రార్.. ఇటు రాహల్ చాహర్ డీసీని కుదురుకోనీయలేదు. వారి దెబ్బకు డీసీ 88/6తో కష్టాల్లో పడింది. చివరకు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 136 పరుగులు మాత్రమే చేయగలిగింది.