Home » TDP - Janasena
ప్రభుత్వం సొమ్ముతో కొనుగోలు చేసిన ఫర్నిచర్, ఎలక్ట్రికల్ వస్తువులు వెంటనే తమకు అప్పజెప్పాలని మాజీ సీఎం జగన్‌ను సాధారణ పరిపాలన శాఖ కోరింది.
ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు... వైఎస్ జగన్ ఎన్నికల్లో గెలవలేక ఈవీఎంల వల్లే ఓడిపోయానని ఇప్పుడు వాపోతున్నారు. 2014లో టీడీపీ-బీజేపీ కూటమిని ప్రజలు గెలిపించినప్పుడు..
వైసీపీ సర్కారు పాలనలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ గాడితప్పింది. కేంద్ర నిధులతో చేపట్టే ఉపాధి హమీ పథకం పూర్తిగా నిర్వీర్యమైంది. పంచాయతీల నిధులను దారి మళ్లించి గ్రామాల్లో కనీస సౌకర్యాల కల్పనకూ కటకటలాడే పరిస్థితులు తీసుకొచ్చారు తమకు భజన చేసేవారిని అధికారులుగా నియమించుకుని ప్రజలకు పాలనను దూరం చేశారు.
కోట్లకొద్దీ ప్రజాధనంతో మాజీ సీఎం జగన్ ఇంట్లో ఫర్నిచర్ ఏర్పాటు చేసుకోవడంపై వైసీపీ నాయకులు చేస్తున్న ప్రకటనలు, ఇస్తున్న సంజాయిషీలపై టీడీపీ నేతలు విరుచుకుపడుతున్నారు.
ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ క్యాంప్ కార్యాలయంగా ఇరిగేషన్ గెస్ట్‌హౌ్‌సను ప్రభుత్వం కేటాయించింది. విజయవాడలోని సూర్యారావుపేటలో ఉన్న ఇరిగేషన్ గెస్ట్‌హౌ్‌సను గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో దేవినేని ఉమా జలవనరుల మంత్రిగా ఉన్నప్పుడు విశాలంగా నిర్మించారు
అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని నందలపాడుకు చెందిన టీడీపీ కార్యకర్త లాల్‌బాషా(23)ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. డాబాపై నిద్రిస్తున్న అతనిని సోమవారం తెల్లవారుజామున కత్తులతో నరికేశారని డీఎస్పీ జనార్దన్‌నాయుడు తెలిపారు.
ప్రభుత్వానికి, పార్టీకి మధ్య వారధిగా పనిచేస్తానని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. గత ఐదేళ్లలో అనేక కష్టాలు పడి, అధికారపక్షం దాడులకు ఎదురొడ్డి నిలబడిన కార్యకర్తలకు అండగా నిలబడతామని కష్టపడిన ప్రతి కార్యకర్తకు సముచిత న్యాయం చేస్తామని చెప్పారు.
రాష్ట్రంలో గర్భిణీలు, చిన్నారులు, గిరిజనుల్లో పౌష్టికాహార లోపంతో ఏ ఒక్కరూ చనిపోకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. సోమవారం సచివాలయంలో ఆమె మంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 544 గిరిజన గురుకులాలు, ఆశ్రమ పాఠశాలల్లో ఏఎన్ఎంలను నియమించేందుకు ప్రతిపాదిస్తూ ఫైల్‌పై మొదటి సంతకం చేశారు.
ఏపీలో ప్రభుత్వం ఏర్పడింది. మంత్రి వర్గం కొలువుదీరింది. ఈనెల 19వ తేదీన అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆ రోజు ఎమ్మెల్యేలంతా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించేందుకు సభలో సీనియర్ ఎమ్మెల్యేను ప్రోటెం స్పీకర్‌గా ఎన్నుకుంటారు.
ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 164 స్థానాలు కైవసం చేసుకుని అఖండ విజయం సాధించడంపై ఎన్ఆర్ఐలు(NRI) హర్షం వ్యక్తం చేస్తున్నారు.