Home » TDP
రాంగోపాల్ వర్మకు దమ్ముంటే.. ధైర్యంగా నిలబడాలని.. అప్పుడు చేసింది కరెక్టు అని చెప్పాలని.. ఆనాడు రెచ్చిపోయి.. ఇప్పుడు దాక్కున్న కొడాలి నాని, వంశీ, అవినాష్‌ల గురించి సినిమా తీయాలని బుద్దా వెంకన్న డిమండ్ చేశారు. వర్మ సినిమాలకు సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చిందని.. ఇప్పుడు కేసులు పెట్టడం ఏమిటని జగన్ అంటున్నారని.. జగన్‌కు సిగ్గు ఉందా.. ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి ఈ సినిమాల గురించి మాట్లాడతారా.. అంటూమండిపడ్డారు.
టీడీపీ కార్యకర్త, తన వీరాభిమాని శ్రీను మృతిపై ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అందరి కష్టాల గురించి తన దృష్టికి తెచ్చేవాడని, కానీ తన కష్టం గురించి మాత్రం ఎప్పుడూ చెప్పలేదంటూ లోకేశ్ మనోవేదనకు గురయ్యారు. ఆత్మహత్యకు పాల్పడి పార్టీకి, తనకు తీరని లోటు మిగిల్చావంటూ ఆయన బాధపడ్డారు.
బంగాళాఖాతంలో తుఫాను నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
గత ఐదేళ్లలో భూ మాఫియా, గంజాయి మాఫియా పేట్రేగిపోయాయని.. వాటికి అడ్డుకట్టవేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.
సీఎం చంద్రబాబు రాయదుర్గం నియోజకవర్గ ప్రగతికి బాటలు వేసేలా వరాల జల్లు కురిపించారు. స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు సమర్పించిన వినతిపత్రంలో పొందుపరిచిన అంశాలన్నింటికీ సానుకూలంగా స్పందించారు. ప్రజా వేదిక మీదుగా ఆయన పలు హామీలు ఇచ్చారు. నేమకల్లు-ఉంతకల్లు మధ్యలో ఐదు టీఎంసీల సామర్థ్యంతో ప్రతిపాదించిన రిజర్వాయర్‌ను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. భైరవానతిప్ప ప్రాజెక్టుకు జీడిపల్లి నుంచి కృష్ణజలాలను ...
వైసీపీ అక్రమార్కులను త్వరలోనే జైలుకు పంపుతామని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి(MLA Bojjala Sudheer Reddy) అన్నారు. శ్రీకాళహస్తి పట్టణంలోని ఎన్టీఆర్ భవన్లో శుక్రవారం ప్రజాసమస్యల పరిష్కారం కోసం మండలాల వారీగా సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ల జాబితాను విడుదల చేసిన ఆయన.. మీడియాతో మాట్లాడారు.
‘రాష్ట్రంలో అదానీతో విద్యుత్ ఒప్పందాలపై ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టమైన ప్రకటన చేశారు. వాటిపై ఆర్థిక, న్యాయపరంగా అన్ని కోణాల్లో చర్చించి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది’ అని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు సోదరుడు, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడి కర్మక్రియలు గురువారం నారావారిపల్లెలో శాస్త్రోక్తంగా జరిగాయి.
రాష్ట్రంలోని అర్హులైన పేదలందరికీ నాణ్యమైన ఇళ్లు కట్టిస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది.
YS Jagan: టీడీపీ సర్కారుపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ సీరియస్ అయ్యారు. డిస్కంలను నిలబెట్టడంలో విఫలమయ్యారని ఆయన మండిపడ్డారు.