Share News

CM Chandra Babu : ప్రగతికి బాటలు

ABN , Publish Date - Dec 01 , 2024 | 12:57 AM

సీఎం చంద్రబాబు రాయదుర్గం నియోజకవర్గ ప్రగతికి బాటలు వేసేలా వరాల జల్లు కురిపించారు. స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ కాలవ శ్రీనివాసులు సమర్పించిన వినతిపత్రంలో పొందుపరిచిన అంశాలన్నింటికీ సానుకూలంగా స్పందించారు. ప్రజా వేదిక మీదుగా ఆయన పలు హామీలు ఇచ్చారు. నేమకల్లు-ఉంతకల్లు మధ్యలో ఐదు టీఎంసీల సామర్థ్యంతో ప్రతిపాదించిన రిజర్వాయర్‌ను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. భైరవానతిప్ప ప్రాజెక్టుకు జీడిపల్లి నుంచి కృష్ణజలాలను ...

CM Chandra Babu : ప్రగతికి బాటలు
CM Chandrababu greeting the people

ఉంతకల్లు, బీటీపీ పనులకు భరోసా

నేమకల్లులో సోలార్‌ పైలెట్‌ ప్రాజెక్టు

ప్రజా వేదికపై ప్రకటించిన చంద్రబాబు

రాయదుర్గం, నవంబరు 30(ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబు రాయదుర్గం నియోజకవర్గ ప్రగతికి బాటలు వేసేలా వరాల జల్లు కురిపించారు. స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ కాలవ శ్రీనివాసులు సమర్పించిన వినతిపత్రంలో పొందుపరిచిన అంశాలన్నింటికీ సానుకూలంగా స్పందించారు. ప్రజా వేదిక మీదుగా ఆయన పలు హామీలు ఇచ్చారు. నేమకల్లు-ఉంతకల్లు మధ్యలో ఐదు టీఎంసీల సామర్థ్యంతో ప్రతిపాదించిన రిజర్వాయర్‌ను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. భైరవానతిప్ప ప్రాజెక్టుకు జీడిపల్లి నుంచి కృష్ణజలాలను


మళ్లించేందుకు రూ.965 కోట్లతో చేపట్టిన పనులు 35 శాతం మాత్రమే పూర్తయ్యాయి. వైసీపీ హయాంలో పనులు ఆగిపోయాయని, వాటిని పూర్తి చేసే బాధ్యత తమ ప్రభుత్వం తీసుకుంటుందని చంద్రబాబు అన్నారు. కృష్ణజలాలతో రాయదుర్గం నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తామని భరోసానిచ్చారు. తుంగభద్ర ఎగువ కాలువ ఆధునికీకరణకు నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. హంద్రీనీవా 36ఎ ప్యాకేజీ ద్వారా మాల్యం, ఆవులదట్ల డిసి్ట్రబ్యూటరీ పనులను పూర్తి చేసి, నీరిస్తామన్నారు. జిల్లాలో ఎడారి ఛాయలు ఇక్కడి నుంచే మొదలు అవుతున్నాయనే విషయం తనకు తెలుసునని, 20 వేల ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన ఇసుకమేటలను నియంత్రించేందుకు నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. ఇనుప ఖనిజ నిక్షేపాలు అధికంగా ఉన్న ప్రాంతం కావడంతో నేమకల్లు - డి.హీరేహాళ్‌ మధ్యలో ఉన్న స్పాంజ్‌ ఐరన ఫ్యాక్టరీల ప్రాంతాన్ని పారిశ్రామిక పార్క్‌గా తీర్చిదిద్దుతామని అన్నారు. డి.హీరేహాళ్‌లో సబ్‌ సర్ఫేస్‌ డ్యాం నిర్మిస్తామని హామీ ఇచ్చారు. రాయదుర్గం మున్సిపాలిటీ అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు మంజూరు చేస్తామని అన్నారు. బొమ్మనహాళ్‌ మండలంలోని శ్రీధరఘట్ట చెరువును హెచ్చెల్సీకి అనుసంధానించి, సాగునీరు ఇస్తామని అన్నారు. ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. రాయదుర్గం నియోజకవర్గం అత్యంత వెనుకబడి ఉందని, అభివృద్ధి చేసే బాధ్యత తాను తీసుకుంటానని ప్రకటించారు.

నేమకల్లులో సోలార్‌ పైలెట్‌ ప్రాజెక్ట్‌

‘ఇంటింటికీ సోలార్‌ పవర్‌’ ప్రాజెక్టును నేమకల్లు గ్రామంలో పైలెట్‌ ప్రాజెక్టుగా ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. నేమకల్లులో ఉన్న 759 ఇళ్లపై సోలార్‌ ప్యానల్స్‌ను సబ్సిడీ ద్వారా అమర్చి విద్యుత ఉత్పత్తి చేయిస్తామని అన్నారు. ఇంటికి అవసరమైన విద్యుతను వాడుకుని, మిగిలిన విద్యుతను విక్రయించే అవకాశం కూడా కల్పిస్తామని అన్నారు. 1,49,721 చదరపు అడుగులలో సోలార్‌ ప్యానల్స్‌ అమర్చి 1379 కిలోవాట్ల విద్యుతను ఉత్పత్తి చేసేలా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ను ఆదేశించారు. విద్యుత ఉత్పత్తి పైలెట్‌ ప్రాజెక్టును ఇక్కడి నుంచే ప్రారంభిస్తున్నామని సీఎం ప్రకటించారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Dec 01 , 2024 | 12:57 AM