Home » Telangana Assembly
ఒక్క ఓటు కూడా అభ్యర్థుల తలరాతను మార్చగలదు. ఒకే ఒక్క ఓటు కూడా సీఎం అభ్యర్థులను సైతం ఓడించగలదు. గతంలో జరిగిన ఎన్నికల్లో అందుకు ప్రత్యక్ష ఉదాహరణలు కూడా కోకొల్లలుగా ఉన్నాయి. సీఎం అభ్యర్థి సైతం ఒకే ఒక్క ఓటు తేడాతో ఓడిపోయిన ఉదంతం 2008వ సంవత్సరంలో జరిగిన రాజస్థాన్ ఎన్నికల్లో చోటు చేసుకుంది.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ హడావుడి కొనసాగుతోంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు క్యూ కడుతున్నారు. ముఖ్యంగా.. రూరల్ ఏరియాలో పోలింగ్ శాతం ఎక్కువగా నమోదు అవుతోంది.
తెలంగాణ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లో రాజకీయ, సినీ తారలు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.
ఎన్నికల నిబంధనలు అతిక్రమించారనే ఫిర్యాదుతో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి(Indrakaran Reddy)పై పోలీసులు కేసు నమోదు చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్న వేళ పలు చోట్ల ఈవీఎంల(EVMs) మొరాయింపు అధికారులను టెన్షన్ పెడుతోంది. తాజాగా కొడంగల్(Kodangal) నియోజకవర్గంలో ఓ ఈవీఎం మొరాయించడంతో ఓటర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
యాదాద్రి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థి గొంగిడి సునీత భర్త మహేందర్ పోలింగ్ కేంద్రంలో ప్రచారం నిర్వహిస్తున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్ నేతలు నిరసనలకు దిగారు.
తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు (CM KCR) అసెంబ్లీ ఎన్నికలు-2023లో ఓటు హక్కుని వినియోగించుకున్నారు. భార్య శోభతో కలిసి వచ్చి ఓటు వేశారు. సిద్దిపేట రూరల్ మండలంలోని చింతమడక గ్రామంలోని తన ఓటు హక్కుని వినియోగించుకున్నారు.
Telangana Polls: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని సీఈఓ వికాస్ రాజ్ అన్నారు. కొన్ని చోట్ల ఈవీఎంల సమస్య వస్తే.. అక్కడ కొత్తవి మార్చినట్లు చెప్పారు. అర్బన్ ఏరియాల్లో ఇంకా పోలింగ్ శాతం పెరగాలని అన్నారు. ఇక నుంచి పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Telangana Polls: తెలంగాణ వ్యాప్తంగా ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు భారీ మొత్తంలో క్యూలైన్లలో బారులు తీరారు.
Telangana Polls: తెలంగాణ వ్యాప్తంగా ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ ప్రారంభం అయింది. అయితే, కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ ఆగింది. యాదాద్రి భువనగిరి జిల్లా మునుగోడు నియోజకవర్గం చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని 33వ బూత్‌లో ఈవీఎంలు మొరయించడంతో అర్ధగంట ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది.