Home » Telangana Assembly
తెలంగాణ అసెంబ్లీ ఎదుట ఒక్కసారిగా కలకలం చెలరేగింది. ఓ వ్యక్తి హఠాత్తుగా అసెంబ్లీ ముందు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి యత్నించాడు. అప్రమత్తమైన పోలీసులు నీళ్లు చల్లి అడ్డుకున్నారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తి.. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం చందనవెల్లి గ్రామ రైతుగా పోలీసులు గుర్తించారు.
రాష్ట్రంలో చేపల ఉత్పత్తి రెండింతలు పెరిగిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) అన్నారు. శాసనమండలిలో మంత్రి మాట్లాడారు. ‘‘18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క మత్స్యకారుడికి మెంబర్ షిప్ ఇస్తున్నాం.
మణిపూర్‌లో రెండు గిరిజన తెగల మధ్య కొట్లాట పెట్టించి చలి కాచుకుంటున్నారు. విభజించి పాలించి ఓట్లు దండుకోవాలని బీజేపీ చూస్తోంది. బ్రిటీషర్లు మొదలు పెట్టింది.. బీజేపీ ఫాలో అవుతుంది.
అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో వరుసగా మూడో రోజు పలు సంఘాల నేతలు ముట్టడికి యత్నించడం ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు ఆందోళనలు చేపట్టిన నేపథ్యంలో గవర్నర్ తమిళిసై కీలక నిర్ణయం తీసుకున్నారు. చర్చలకు రాజ్‌భవన్‌కు రావాలంటూ ఆర్టీసీ యూనియన్ నేతలకు గవర్నర్ ఆహ్వానం పంపారు. మరికాసేపట్లో ఆర్టీసీ ముఖ్య నాయకులతో తమిళిసై సమావేశం కానున్నారు. వీలుకాని పక్షంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గవర్నర్ చర్చించనున్నట్లు రాజ్‌భవన్ వర్గాలు తెలిపాయి.
తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఆదివారంతో ముగియనున్నాయి. సమావేశాల చివరి రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగించనున్నారు. ఆదివారం సమావేశం ప్రారంభం కాగానే తొమ్మిదేళ్లలో తెలంగాణ సాధించిన ప్రగతిపై లఘు చర్చ జరగనుంది. ఈ చర్చలో కేసీఆర్ మాట్లాడనున్నారు.
తెలంగాణ ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన బిల్లు గవర్నర్ దగ్గర పెండింగ్‌లో ఉండటం రాష్ట్ర వ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనానికి కేసీఆర్ కేబినెట్ ఆమోదం తెలపడంతో ఆర్టీసీ కార్మికులు సంబరాలు చేసుకున్నారు. సీఎం కేసీఆర్ పోటోకు పాలాభిషేకాలు కూడా చేశారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు ప్రారంభమయ్యాయి. అనంతరం స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రశ్నోత్తరాలు చేపట్టారు. అలాగే శాసనమండలిలో కూడా ప్రశ్నోత్తరాలు చేపట్టారు.
తెలంగాణ ప్రభుత్వానికి ఆదాయ మార్గాలు రెండే ఉన్నట్లు కనిపిస్తున్నాయని.. అవి ఒకటి ప్రభుత్వ భూములు అమ్మకం.. రెండు మద్యం వ్యాపారం అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల(Heavy Rains)కు సంభవించిన వరదల( floods)పై అసెంబ్లీ(Assembly)లో శుక్రవారం వాడివేడి చర్చ జరిగింది.