Home » Telangana Assembly
మనం ఒకటి తలిస్తే.. దైవం ఒకటి తలచినట్లుగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌తోపాటు ఆయన ఫ్యామిలీ విషయంలో జరిగిందనే ఓ చర్చ అయితే పోలిటికల్ సర్కిల్లో వైరల్ అవుతోంది. ఈ లోక్‌సభ ఎన్నికల్లో కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా బరిలో దిగడం లేదని సదరు సర్కిల్లో ఓ చర్చ అయితే వాడి వేడిగా వైరల్ అవుతోంది.
అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కారు పార్టీని వీడతారంటూ ప్రచారం జరగుుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. గ్రేటర్ పరిధిలో ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకోవడం ద్వారా రానున్న లోక్‌సభతో పాటు.. కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపొందచ్చనే అంచనాలో హస్తం పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది.
బీజేపీకి ఆరేపల్లి మోహన్ రాజీనామా చేశారు. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డికి ఆయన లేఖ రాశారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఆయన పెద్దపల్లి టికెట్ ఆశించారు.
ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్ఐబీ)లో ఉండగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే నాయకులు, ప్రముఖుల ఫోన్లను తాను ట్యాపింగ్ చేసినట్లు విచారణలో మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు ఒప్పుకొన్నట్లు తెలుస్తోంది.
Telangana: అసెంబ్లీలో దివంగత స్పీకర్ శ్రీపాద రావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అసెంబ్లీ కమిటీ హల్లో శ్రీపాద రావు చిత్ర పటానికి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి , స్పీకర్ ప్రసాద్ రావు, మంత్రి కోమటిరెడ్డి, విప్ బీర్ల అయిలయ్య, ఆది శ్రీనివాస్, ఎమ్మేల్యేలు వీర్లపల్లి శంకర్, నాగరాజు, అనిరుద్ రెడ్డి తదితరులు నివాళులు అర్పించారు.
ప్రభుత్వానికి మేడిగడ్డ ప్రాజెక్ట్ ఇష్యూ తప్ప మరే సబ్జెక్ట్ దొరకడం లేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ..
తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ సెషన్ చర్చ సందర్భంగా అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్దం తీవ్రస్థాయికి చేరింది. శాసన సభ్యులు కడియం శ్రీహరి, కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒకరికొకరు తీవ్రంగా విమర్శించుకున్నారు.
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. గత ప్రభుత్వ తప్పిదాలను అధికార కాంగ్రెస్ పార్టీ ఎత్తి చూపుతోంది. అందుకు ధీటుగా ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ సమాధానం ఇస్తోంది.
Telangana CM Revanth Reddy: తెలంగాణలో రైతు బంధును అర్హులైన రైతులకు అందేలా చూస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అనర్హులకు రైతు భరోసా ఇవ్వబోమని.. వ్యవసాయం చేసే రైతులకు మాత్రమే పెట్టుబడి సహాయం అందిస్తామని స్పష్టం చేశారు సీఎం. బడ్జెట్ సమావేశాల అనంతరం మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి.. గత ప్రభుత్వ విధానాలను తూర్పారబట్టారు.
2024-25 సంవత్సరానికిగాను తెలంగాణ ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టారు. మొత్తం రూ.2,75,891 కోట్లతో కూడిన బడ్జెట్ పాఠాన్ని ఉప ముఖ్యంత్రి భట్టి విక్రమార్క చదివి వినిపించారు. రెవెన్యూ వ్యయం రూ.2,01,178 కోట్లు, మూలధన వ్యయం రూ.29,669 కోట్లుగా ఉన్నట్టు మంత్రి పేర్కొన్నారు.